న్యూఢిల్లీ: ప్రముఖ జర్మనీ విలాసవంతమైన కార్ల తయారీ కంపెనీ ఆడీ.. బీఎస్‌-6 నిబంధనలకు అనుగుణంగా ఉన్న పెట్రోల్‌ కార్లనే ముందు మార్కెట్లోకి తీసుకురావాలనుకుంటోంది. అంతేకాక ప్రత్యామ్నాయ ఇంధన టెక్నాలజీతో కూడిన వాహనాలకు ప్రాధాన్యం ఇస్తామని చెబుతోంది. 

ఈ నేపథ్యంలో పూర్తిగా డీజిల్‌ ఇంజన్ల నుంచి వైదొలిగే అవకాశం లేదని అంటోంది. ఇటీవలే కంపెనీ ఎనిమిదోతరం ఏ6 సెడాన్‌ను మార్కెట్లోకి తెచ్చింది ఆడి ఇండియా. ఇందులో హైబ్రీడ్‌ టెక్నాలజీ ఉంది. రానున్న కాలంలో మరిన్ని హైబ్రీడ్స్‌, ప్లగ్‌ ఇన్‌ హైబ్రీడ్‌ వెహికల్స్ మార్కెట్లోకి తేవాలనుకుంటోంది.

also read  ట్రైబర్‌కు జోడీ: సబ్ కంపాక్ట్ సెడాన్ తయారీలో రెనాల్ట్

‘అన్ని మోడళ్లలోనూ బీఎ్‌స-6తో కూడిన పెట్రోల్‌ కార్లను తెస్తాం. డీజిల్‌ కార్లు పూర్తిగా ఉండవని చెప్పలేం’’ అని ఆడీ ఇండియా హెడ్‌ బల్బిర్‌ సింగ్‌ ధిల్లాన్‌ తెలిపారు. మున్ముందు పెట్రోల్‌ కార్లతోపాటు ఎలక్ట్రిక్‌ కార్లను కూడా మార్కెట్లోకి తీసుకు వస్తామని బల్బీర్ సింగ్ ధిల్లాన్ పేర్కొన్నారు.

వచ్చే ఏడాది ఏప్రిల్‌ నుంచి బీఎస్‌-6 నిబంధనలు అమల్లోకి రానున్న విషయం తెలిసిందే ఈ నిబంధనలు అమల్లోకి వచ్చిన తర్వాత డీజిల్‌ వాహనాలను విక్రయించబోమని ఇప్పటికే మారుతీ సుజుకీ, రెనాల్ట్ కంపెనీలు ప్రకటించాయి. 

also read తమ్ముడి కళ్లు మెరిసేలా.. బాలీవుడ్ ఊర్వశి ‘భాయ్ దూజ్’ గిఫ్ట్

భవిష్యత్‌ ఎలక్ర్టిక్‌, హైబ్రీడ్‌ వాహనాలదే కాబట్టి డీజిల్‌ టెక్నాలజీ నుంచి వైదొలగనున్నట్టు ఇంతకుముందే ఆడీ ఇండియా కూడా పేర్కొంది. మైల్డ్‌ హైబ్రిడ్స్‌, ప్లగ్‌ ఇన్‌ హైబ్రిడ్స్‌ వంటి టెక్నాలజీలపై కూడా దృష్టిసారించాల్సిన అవసరం ఉందని, ఇతర టెక్నాలజీలపై కూడా తాము ప్రయోగం చేస్తామని ఆడి ఇండియా అధిపతి బల్బీర్ సింగ్ ధిల్లాన్‌ తెలిపారు.