ఈ మంటలు ఎప్పుడు ఆగుతాయి?: హైదరాబాద్ లో కాలి బూడిదైన మరో ఎలక్ట్రిక్ స్కూటర్..

ఎలక్ట్రిక్ స్కూటర్లలో మంటలు చెలరేగిన ఘటనలు కొనసాగుతున్నాయి. తాజాగా  హైదరాబాద్‌లో ఓ ఎలక్ట్రిక్ స్కూటర్‌లో మంటలు చెలరేగాయి.  ఆ తర్వాత ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.  

When will this fire stop?: Now another electric scooter burnt in this city

దేశంలో ఎలక్ట్రిక్ స్కూటర్లలో మంటల ఘటనలు కొనసాగుతున్నాయి. తాజాగా  హైదరాబాద్‌లో ఓ ఎలక్ట్రిక్ స్కూటర్‌లో మంటలు చెలరేగాయి. ఈసారి ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ ప్యూర్ EV చెందిన EPluto G7 ఎలక్ట్రిక్ స్కూటర్ అగ్నిప్రమాదం కారణంగా ముఖ్యాంశాలలో నిలిచింది.

ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌లో మంటలు చెలరేగటంతో అక్కడి నుంచి వెళ్తున్న వారు మొబైల్‌ కెమెరాల్లో రికార్డు చేశారు. ఆ తర్వాత ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదని పోలీసులు తెలిపారు.

స్కూటర్ యజమాని ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. కొద్దిరోజుల క్రితం తాను EPluto G7 ఎలక్ట్రిక్ స్కూటర్‌ను దాదాపు రూ.90,000 ధరతో కొనుగోలు చేసినట్లు చెప్పాడు. 

బ్యాటరీలో మంటలు చెలరేగడంతో 
ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ యజమాని ఫుడ్ డెలివరీ ఏజెంట్‌గా పనిచేస్తున్నాడు. తన స్నేహితుడితో కలిసి ప్రయాణిస్తుండగా ఈ ఘటన జరిగింది. బాధితుడి ప్రకారం,  ప్యూర్ EV ఎలక్ట్రిక్ స్కూటర్ ప్రయాణంలో అకస్మాత్తుగా ఆగిపోయింది. చెక్ చేసేందుకు బ్యాటరీ కంపార్ట్‌మెంట్‌ను తెరిచి చూడగా పొగలు రావడం చూశాడు. కొద్దిసేపటికే స్కూటర్‌కు మంటలు అంటుకుని కాలి బూడిదైంది.

స్కూటర్లు వెనక్కి 
భారతదేశంలోని ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల తయారీదారులలో ప్యూర్ EV ఒకటి. ఈ ప్రమాదం జరిగినప్పటి నుండి బ్రాండ్ ఇప్పటివరకు దాదాపు 2,000 ఎలక్ట్రిక్ స్కూటర్లను రీకాల్ చేసింది. అయితే తాజాగా స్కూటర్‌లో మంటలు చెలరేగడంపై కంపెనీ ఎలాంటి ప్రకటన విడుదల చేయలేదు.

EV అగ్ని ప్రమాదాల మధ్య ఇ-స్కూటర్‌లను రీకాల్ చేయడానికి ఓలా ఎలక్ట్రిక్ అండ్ ఒకినావా ఆటోటెక్ ఇతర రెండు ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన తయారీదారులు ఉన్నాయి. EV అగ్నిప్రమాదానికి గల కారణాలను తెలుసుకోవడానికి కేంద్రం కేసులపై విచారణకు ఆదేశించింది. 

నివేదిక ప్రకారం గత నెల నిజామాబాద్ జిల్లాలో ఎలక్ట్రిక్ స్కూటర్ బ్యాటరీ చార్జింగ్ పెడుతుండగా పేలుడు సంభవించింది . ఈ ఘటనలో 80 ఏళ్ల వృద్ధుడు మృతి చెందాడు. కాగా అతని కుటుంబంలో ముగ్గురు గాయపడ్డారు. మరో ఘటనలో మే 8వ తేదీ రాత్రి కరీంనగర్ జిల్లాలో విద్యుత్ ద్విచక్ర వాహనం చార్జింగ్ అవుతుండగా బ్యాటరీ పేలిపోయింది. అయితే ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదు.
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios