అదృష్ఠం అంటే ఇతనిదేనేమో.. ఒక్క సెకండ్లోనే.. ఆనంద్ మహీంద్రాను ఆశ్చర్యపరిచిన వీడియో..
యూజర్ల ఆసక్తిని రేకెత్తించే పోస్ట్‌లను షేర్ చేయడంలో పేరుగాంచిన పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా తాజాగా ఒక వీడియోని షేర్ చేశారు.
న్యూఢిల్లీ: ఒక వ్యక్తి రోడ్డుపక్కన ఉన్న షాప్ లోకి వెళ్ళే ముందు రోడ్డు మీద నడుస్తూ కనిస్తాడు. అయితే అతను సాధారణంగా నడుచుకుంటూ ఒక షాప్ వైపు వెళ్తుండగా అడుగు తీసి అడుగు వేసే క్షణంలో కాలి కింద ఉన్న నెల ఒక్కసారి డ్రైనేజి కాలువలోకి కూలిపోతుంది. అతను తృటిలో తప్పించుకోవడంతో ఆశ్చర్యపోయిన అతను ఇతరులు షాప్ నుండి బయటకు రావడంతో ఆగిపోయాడు.
ప్రజల ఆసక్తిని రేకెత్తించే పోస్ట్‌లను షేర్ చేయడంలో పేరుగాంచిన పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా తాజాగా ఈ వీడియోని ట్విట్టర్ లో షేర్ చేసారు.
"ఈ వ్యక్తికి ప్రపంచం ఎలాంటి మెసేజ్ పంపిస్తోందో తెలుసుకోవడానికి నేను వీకెండ్ గడపబోతున్నాను. ఒకవేళ మీరు అతని స్థానంలో ఉంటే ఏం ఆలోచిస్తారు" అంటూ మహీంద్రా గ్రూప్ ఛైర్మన్ శుక్రవారం వీడియోను షేర్ చేశారు. 30 సెకన్లు ఉన్న ఈ వీడియో షాప్ బయట ఉన్న సీసీటీవీ నుండి తీసుకోబడింది.
ఈ వీడియో చూశాక "ఒక సెకను కూడా ఆలస్యం చేయవద్దు" అంటూ ఒకరు సూచించగా, మరొకరు "లేదా కొన్ని నిమిషాలు ఆలస్యంగా ఉండండి.. ఎలాగైనా, మీరు రక్షించబడతారు". అంటూ కామెంట్ చేశారు. మౌలిక సదుపాయాలను మెరుగుపరచడానికి సిటిజన్స్ ప్రభుత్వాన్ని ముందుకు తీసుకురావాలని మరొక యూజర్ కామెంట్ చేశారు. ఈ వీడియో ట్విట్టర్ లో చేసిన తరువాత ఇప్పటివరకు 2500రిట్విట్లు, 25 వేలకు పైగా లైక్స్ వచ్చాయి.