Volvo:లగ్జరీ కార్ బ్రాండ్ వోల్వో కార్ల ధరల పెంపు.. ఏ మోడల్ పై ఎంత పెరిగిందంటే..?

ఈ ఏడాది ఏప్రిల్ 12 వరకు  వోల్వో కార్లను బుక్ చేసుకున్న కస్టమర్లకు పాత ధరకే కారు లభిస్తుందని వాహన తయారీ సంస్థ తెలిపింది. అయితే ఆ తేదీ తర్వాత  కార్లను బుక్ చేసుకున్న కస్టమర్లు కొత్త ధరను చెల్లించాల్సి ఉంటుంది.

Volvo India increased the prices of its vehicles by up to 4 percent, know how expensive it became

వోల్వో కార్స్ ఇండియా (volvo cars india) లగ్జరీ కార్ల ధరలను పెంచుతున్నట్లు ప్రకటించింది. దీంతో కంపెనీ వాహనాల ధరలను నాలుగు శాతం వరకు పెరిగాయి. తాజా ధరల పెంపు తర్వాత భారత మార్కెట్లో వోల్వో కార్ల ధర లక్ష నుంచి రూ.3 లక్షలకు అధికంగా మారాయి. XC60 B5 ఇన్‌స్క్రిప్షన్ పెట్రోల్ మైల్డ్-హైబ్రిడ్ మోడల్ ధర అత్యధికంగా నాలుగు శాతం ధర పెరిగింది. ఈ లగ్జరీ కార్ SUV ఎక్స్-షోరూమ్ ధర ఇప్పుడు రూ. 65.90 లక్షలు. XC40 T4 R డిజైన్ పెట్రోల్, S90 B5 ఇన్‌స్క్రిప్షన్ పెట్రోల్ మైల్డ్-హైబ్రిడ్ అండ్ XC90 B6 ఇన్‌స్క్రిప్షన్ పెట్రోల్ మైల్డ్-హైబ్రిడ్ వంటి మోడల్స్ పై కంపెనీ తాజా ధరల పెంపు కారణంగా ఖరీదైనదిగా మారాయి. 

మూడు శాతం పెంపు తర్వాత వోల్వో ఎక్స్‌సి40 ధర ఇప్పుడు రూ.44.50 లక్షలు. S90 అండ్ XC90 ధరలు  రూ. 65.90 లక్షలు ఇంకా రూ. 93.90 లక్షలు. S90 అలాగే XC90 ధరలు కూడా రెండు శాతం నుండి మూడు శాతం పెరిగింది. ఈ ఏడాది ఏప్రిల్ 12 వరకు  వోల్వో కార్లను బుక్ చేసుకున్న కస్టమర్లకు పాత ధరకే కారు లభిస్తుందని వాహన తయారీ సంస్థ తెలిపింది. అయితే ఆ తేదీ తర్వాత  కార్లను బుక్ చేసుకున్న కస్టమర్లు కొత్త ధరను చెల్లించాల్సి ఉంటుంది.

కంపెనీ  వాహనాల ధరలను పెంచడం ఇదే మొదటిసారి కాదు. ఈ ఏడాదిలో ధరలు పెరగడం రెండోసారి. అంతకుముందు వోల్వో 2022 ప్రారంభంలో ధరల పెంపును ప్రకటించింది. గ్లోబల్ సరఫరా చైన్ అంతరాయం, అధిక లాజిస్టిక్స్ ధర, అస్థిర విదేశీ మారకపు పరిస్థితులు పెరుగుతున్న ఇన్‌పుట్ ఖర్చుల కారణంగా తాజా ధరల పెంపు జరిగిందని వాహన తయారీ సంస్థ పేర్కొంది. 

ధరల పెంపుపై వోల్వో కార్స్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ జ్యోతి మల్హోత్రా మాట్లాడుతూ, గత కొన్ని నెలలుగా గ్లోబల్ సప్లై చెయిన్‌లో అంతరాయాలు పెరిగి ఇన్‌పుట్, లాజిస్టిక్స్ ఖర్చులు పెరిగాయని చెప్పారు. "దీని వల్ల మొత్తం భారతీయ ఆటోమొబైల్ పరిశ్రమపై ప్రభావం చూపినట్లే, వోల్వో కార్ ఇండియాపై ప్రతికూల ప్రభావం చూపింది. ఈ  ధరల పెరుగుదలతో మా ఉత్పత్తులన్నింటి ఎక్స్-షోరూమ్ ధరలను పెంచవలసి వచ్చింది."అని అన్నారు.
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios