మ్యూజిక్ లవర్స్ కోసం వోక్స్‌వ్యాగన్ కొత్త ఎడిషన్; ఇప్పుడు డబుల్ మస్తీ, డబుల్ మజా..

టైగాన్ అండ్ వర్టస్ సౌండ్ ఎడిషన్‌లు 1-లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్ 115PS పవర్,  178Nm టార్క్‌ను విడుదల చేస్తుంది. ఇంజిన్ 6-స్పీడ్ మాన్యువల్ లేదా 6-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో వస్తుంది. మీరు రెండు కార్ల కోసం మరింత శక్తివంతమైన 150PS 1.5-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజన్ సెలెక్ట్ చేసుకోవచ్చు.
 

Volkswagen Virtus, Tygon Sound Edition; Prices, key features-sak

జర్మన్ ఆటో బ్రాండ్ వోక్స్‌వ్యాగన్ వర్టస్ సెడాన్ అండ్ టైగన్ మిడ్-సైజ్ SUV ప్రత్యేక ఎడిషన్‌లను విడుదల చేసింది. వోక్స్‌వ్యాగన్ వర్టస్ సౌండ్ ఎడిషన్, టైగన్ సౌండ్ ఎడిషన్ అని పిలువబడే ఈ రెండు ఎడిషన్‌లు టాప్‌లైన్ ట్రిమ్ ఆధారంగా రూపొందించబడ్డాయి. ఈ కార్లు  115bhp ఇంకా 178Nm టార్క్ ఉత్పత్తి చేసే 1.0L TSI పెట్రోల్ ఇంజన్ ద్వారా శక్తిని పొందుతాయి.

వర్టస్ సౌండ్ ఎడిషన్ మాన్యువల్ వేరియంట్ ధర రూ.15.52 లక్షలు అలాగే ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ ధర రూ.16.77 లక్షలు, టైగన్ సౌండ్ ఎడిషన్ మ్యాన్యువల్ వేరియంట్ ధర రూ.16.33 లక్షలు, ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ ధర రూ.17.90 లక్షలు. ఈ ధరలన్నీ ఎక్స్-షోరూమ్ చేందిన  ధరలు.

టైగాన్ అండ్ వర్టస్ సౌండ్ ఎడిషన్‌లు 1-లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్ 115PS పవర్,  178Nm టార్క్‌ను విడుదల చేస్తుంది. ఇంజిన్ 6-స్పీడ్ మాన్యువల్ లేదా 6-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో వస్తుంది. మీరు రెండు కార్ల కోసం మరింత శక్తివంతమైన 150PS 1.5-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజన్ సెలెక్ట్ చేసుకోవచ్చు.

పేర్లు సూచించినట్లుగా, వోక్స్‌వ్యాగన్ వర్టస్ అండ్  టైగాన్ సౌండ్ ఎడిషన్‌లు స్పీకర్ ఇంకా  యాంప్లిఫైయర్ సిస్టమ్ అలాగే పవర్డ్ ఫ్రంట్ సీట్‌లతో కూడిన మ్యూజిక్  అనుభవాన్ని  మెరుగుపరచడానికి ప్రయాణికుల కోసం రూపొందించబడ్డాయి. ఈ మూడు ఫీచర్లు గతంలో 1.5L TSI పెట్రోల్ ఇంజన్‌తో నడిచే GT ప్లస్ వేరియంట్‌లకు ప్రత్యేకమైనవి.

కొత్త ఫోక్స్‌వ్యాగన్ టిగువాన్,  వర్టస్ సౌండ్ ఎడిషన్‌లు డోర్లు ఇంకా  సి-పిల్లర్‌లపై ప్రత్యేక బ్యాడ్జింగ్‌ను పొందూతాయి. SUV వేరియంట్ కాంట్రాస్ట్ రూఫ్ అండ్ వింగ్ మిర్రర్స్ అప్షన్ కూడా అందిస్తుంది. వైల్డ్ చెర్రీ రెడ్, లావా బ్లూ, రైజింగ్ బ్లూ ఇంకా  కార్బన్ స్టీల్ గ్రే అనే నాలుగు  రంగుల అప్షన్స్  లో కొనుగోలుదారులు ఈ ప్రత్యేక ఎడిషన్‌ను సెలెక్ట్ చేసుకోవచ్చు.

టాప్‌లైన్ ట్రిమ్‌పై నిర్మించబడిన సౌండ్ ఎడిషన్‌లు ఆటో-డిమ్మింగ్ IRVM, ఎనిమిది అంగుళాల ఫుల్  డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, ఎలక్ట్రిక్ సన్‌రూఫ్, లెదర్ ఇన్‌సర్ట్‌లతో వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ ఇంకా  మరెన్నో ఉన్నాయి. ఈ మోడల్‌లు లెథెరెట్ సీట్ అప్హోల్స్టరీ, క్రూయిజ్ కంట్రోల్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, హిల్ స్టార్ట్ అసిస్ట్, వైర్‌లెస్ ఛార్జింగ్, ఎత్తు అడ్జస్ట్   చేయగల డ్రైవర్ సీటు అండ్  రివర్స్ పార్కింగ్ కెమెరా వంటి ఫీచర్లను కూడా పొందుతాయి. 

టైగన్ సౌండ్ ఎడిషన్ ధర రూ. 16.33 లక్షలు అలాగే  వర్టస్ సౌండ్ ఎడిషన్ ధర రూ. 15.52 లక్షలు (ఎక్స్-షోరూమ్). టైగాన్ కారుకి  పోటీగా కియా సెల్టోస్, మారుతి సుజుకి గ్రాండ్ విటారా, హ్యుందాయ్ క్రెటా, స్కోడా కుషాక్, టయోటా అర్బన్ క్రూయిజర్ హైరైడర్, హోండా ఎలివేట్, MG ఆస్టర్ ఇంకా  సిట్రోయెన్ C3 ఎయిర్‌క్రాస్ ఉన్నాయి. మరోవైపు, Virtus హోండా సిటీ, హ్యుందాయ్ వెర్నా, స్కోడా స్లావియా, మారుతి సుజుకి సియాజ్‌లతో  కూడా పోటీగా ఉంటుంది.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios