Voice command on Honda bikes:హోండా హెచ్‌నెస్ ఇప్పుడు ఐ‌ఓ‌ఎస్ సపోర్ట్ తో లాంచ్.. ధర, ఫీచర్స్ ఇవే..

కొత్త iOS సపోర్ట్‌తో పాటు బైక్ లో ఎలాంటి ఇతర మార్పులు చేయలేదు. ఫుల్ -LED లైటింగ్, హోండా సెలెక్టబుల్ టార్క్ కంట్రోల్, అసిస్ట్ అండ్ స్లిప్పర్ క్లచ్, సెమీ-డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, ఇంజన్ ఇన్హిబిటర్‌లతో కూడిన సైడ్-స్టాండ్ అండ్ డ్యూయల్-ఛానల్ ABS వంటి ఫీచర్లను పొందుతుంది.

Voice command on Honda bikes: After Android Auto, Honda H'Ness now launched with iOS support, know price and features

హోండా 2వీలర్స్ ఇండియా (honda 2wheelers) HNess CB350 బైక్ కోసం హోండా స్మార్ట్‌ఫోన్ వాయిస్ కమాండ్ (honda smartphone voice command) సిస్టమ్ కోసం iOS ఇంటిగ్రేషన్‌ను లాంచ్ చేసింది. ఇంతకుముందు ఈ బైక్ ఆండ్రాయిడ్ ఆటో సిస్టమ్‌తో మాత్రమే వచ్చింది. కంపెనీ హోండా స్మార్ట్‌ఫోన్ వాయిస్ కమాండ్ సిస్టమ్ బ్లూటూత్ ద్వారా స్మార్ట్‌ఫోన్‌కు కనెక్ట్ చేయడం ద్వారా పని చేస్తుంది ఇంకా కాల్స్, మెసేజెస్, నావిగేషన్ సమాచారాన్ని చూపిస్తుంది.

అయితే ఈ ఫీచర్ బైక్  హై-స్పెక్ DLX ప్రో (DLX pro) అండ్ యానివర్సరీ ఎడిషన్ (anniversary edition) ట్రిమ్‌లలో మాత్రమే అందుబాటులో ఉంటుంది. డీఎల్‌ఎక్స్ ప్రో ధర రూ.2,03,179గా ఉండగా, యానివర్సరీ ఎడిషన్ ధర రూ.2,05,679. రెండు ధరలు ఎక్స్-షోరూమ్, ఢిల్లీ చెందినవి. 

ఇంజిన్ అండ్ సస్పెన్షన్
HNess CB350 బైక్ 348.3cc, సింగిల్-సిలిండర్ ఇంజన్‌తో శక్తిని పొందింది. ఈ ఇంజన్ 5,500rpm వద్ద 21bhp శక్తిని, 3,000rpm వద్ద 30Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్‌తో 6-స్పీడ్ మ్యాన్యువల్ గేర్ ట్రాన్స్‌మిషన్ ఉంటుంది. బైక్  హార్డ్‌వేర్ కిట్‌లో టెలిస్కోపిక్ ఫ్రంట్ ఫోర్క్స్, ట్విన్ రియర్ స్ప్రింగ్‌లు, డ్యూయల్ డిస్క్ బ్రేక్‌లు ఉన్నాయి. 

ఫీచర్లు
కొత్త iOS సపోర్ట్‌తో పాటు బైక్ లో ఎలాంటి ఇతర మార్పులు చేయలేదు. ఫుల్ -LED లైటింగ్, హోండా సెలెక్టబుల్ టార్క్ కంట్రోల్, అసిస్ట్ అండ్ స్లిప్పర్ క్లచ్, సెమీ-డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, ఇంజన్ ఇన్హిబిటర్‌లతో కూడిన సైడ్-స్టాండ్ అండ్ డ్యూయల్-ఛానల్ ABS వంటి ఫీచర్లను పొందుతుంది.

హోండా పాపులర్ Activa 125, Activa 6G స్కూటర్ల ధరలను మళ్లీ పెంచింది. ఈ రెండు స్కూటర్ల ధరలు రూ.500 నుంచి రూ.1,000 వరకు పెరిగాయి. తాజాగా పెంపు ధర ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి ఉంటుంది. Honda Activa 6G ధర ఇప్పుడు రూ. 71,432 నుండి ప్రారంభమవుతుంది, Activa 125 ప్రారంభ ధర ఇప్పుడు రూ. 74,989 నుండి ప్రారంభమవుతుంది. రెండు ధరలు ఎక్స్-షోరూమ్, ఢిల్లీ చెందినవి. 
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios