Asianet News TeluguAsianet News Telugu

మహీంద్రా ‘ఎస్‌యూవీ300’బుకింగ్స్ షురూ!!

మహీంద్రా అండ్ మహీంద్రా ఇటీవల ఆవిష్కరించిన కంపాక్ట్ ఎస్‌యూవీ మోడల్ ‘ఎక్స్‌యూవీ300’కార్ల బుకింగ్స్ అధికారికంగా ప్రారంభమయ్యాయి. కోడ్ నేమ్ ‘ఎస్201’తో రూపుదిద్దుకుంటున్న ఈ కారును మహీంద్రా అండ్ మహీంద్రా వచ్చేనెల 15వ తేదీన మార్కెట్లోకి ఆవిష్కరించనున్నది. 

Upcoming Mahindra XUV300 Compact SUV Official Bookings Open
Author
New Delhi, First Published Jan 12, 2019, 10:48 AM IST

మహీంద్రా అండ్ మహీంద్రా ఇటీవల ఆవిష్కరించిన కంపాక్ట్ ఎస్‌యూవీ మోడల్ ‘ఎక్స్‌యూవీ300’కార్ల బుకింగ్స్ అధికారికంగా ప్రారంభమయ్యాయి. కోడ్ నేమ్ ‘ఎస్201’తో రూపుదిద్దుకుంటున్న ఈ కారును మహీంద్రా అండ్ మహీంద్రా వచ్చేనెల 15వ తేదీన మార్కెట్లోకి ఆవిష్కరించనున్నది. 

మహీంద్రా ‘ఎక్స్‌యూవీ 300’ మోడల్ కారు మారుతి సుజుకికి చెందిన విటారా, బ్రెజా, హ్యుండాయ్ క్రెటా మోడల్ కార్లతో తలపడనున్నది. ఇప్పటికే ఎక్స్‌యూవీ300 మోడల్ కారు శాంగ్ యాంగ్ టివోలీతో కలిసి అంతర్జాతీయంగా 50కి పైగా దేశాల్లో 2.6 లక్షల యూనిట్లను విక్రయించింది. 

అంతర్జాతీయంగా 2015లోనే మార్కెట్లోకి విడుదలైంది. టివోలీ.. కొరియాన్ న్యూ కారు అస్సెస్‌మెంట్ ప్రోగ్రామ్, ఆటోమోటివ్ సేఫ్టీ విభాగంలో 2015లో కేఎన్ఏపీ గ్రేడ్ 1 సేఫ్టీ అవార్డును కూడా అందుకున్నది. ఇంకా పలు సేఫ్టీ, సమర్థత అవార్డులను అందుకున్నది. 

మహారాష్ట్రలోని నాసిక్ నగరంలో ఏర్పాటు చేసిన ఉత్పాదక సంస్థలో మహీంద్రా ఎక్స్‌యూవీ 300 మోడల్ కారు ఉత్పత్తి కానున్నది. చీతా స్ఫూర్తితో రూపుదిద్దుకున్న ఎక్స్‌యూవీ 500 ఆధారంగా అత్యాధునిక టెక్నాలజీ ఫీచర్లతో ఎస్‌యూవీ300 మోడల్ డిజైన్ చేశారు. 

6 - స్పీడ్ ట్రాన్స్‌మిషన్‌తో 200 ఎన్ఎం పెట్రోల్, 300 ఎన్ఎం డీజిల్ ఇంజిన్ల ఆప్షన్లతో మహీంద్రా ఎక్స్‌యూవీ 300 మోడల్ కారు డిజైన్ చేశారు. ఈ కారు మూడు వేరియంట్ల (డబ్ల్యూ4, డబ్ల్యూ6, డబ్ల్యూ8)లో లభిస్తుంది. డబ్ల్యూ8 వేరియంట్ కారులో 1 ఆప్షనల్ ప్యాక్ కూడా ఉన్నది. ఎయిర్ బ్యాలు, ఏబీఎస్, నాలుగు చక్రాలకు డిస్క్ బ్రేకులు అమర్చారు. ఎల్ఈడీ టెయిల్ ల్యాంప్స్, ఆల్ 4 పవర్ విండోస్ తదితరాలను అమర్చారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios