Asianet News TeluguAsianet News Telugu

టీవీఎస్ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్.. ఈ ఏరియాల్లో అందుబాటులోకి.. ఎప్పుటి నుంచి తెలుసా?

ఒక ఫోటో స్పీడోమీటర్ రీడింగ్ "105 kmph"ని చూపుతుంది. ఇది స్కూటర్  హై-స్పీడ్ సామర్థ్యాలకు ఇండికేషన్ కావచ్చు. 2018 ఆటో ఎక్స్‌పోలో చూపిన క్రియోన్ ఇ-స్కూటర్ కాన్సెప్ట్ ఆధారంగా, రాబోయే స్కూటర్ ఆగస్ట్ 23న దుబాయ్‌లో ప్రారంభం కానుంది.
 

TVS Creon : TVS Creon electric scooter will be available in all areas.. Do you know when?-sak
Author
First Published Aug 22, 2023, 3:40 PM IST

ద్విచక్ర వాహన తయారీ సంస్థ  టీవీఎస్ సోషల్ మీడియాలో షేర్ చేసిన లేటెస్ట్ టీజర్ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్‌లో ఆశించే ఫీచర్ల గ్లిఫ్స్ చూపించింది. మొదటి టీజర్‌లో, TFT స్క్రీన్‌ ఉన్న డిస్‌ప్లేపై ఫోకస్ చేసింది. టీజర్ లో ఈ డిస ప్లే స్క్రీన్  కొన్ని ఫోటోలను  చూపుతుంది. 

ఒక ఫోటో స్పీడోమీటర్ రీడింగ్ "105 kmph"ని చూపుతుంది. ఇది స్కూటర్  హై-స్పీడ్ సామర్థ్యాలకు ఇండికేషన్ కావచ్చు. 2018 ఆటో ఎక్స్‌పోలో చూపిన క్రియోన్ ఇ-స్కూటర్ కాన్సెప్ట్ ఆధారంగా, రాబోయే స్కూటర్ ఆగస్ట్ 23న దుబాయ్‌లో ప్రారంభం కానుంది.

డిస ప్లే స్క్రీన్‌ మరో ఫోటో మ్యూజిక్ కంట్రోల్, బ్లూటూత్ ద్వారా స్కూటర్ మీ ఫోన్‌కి కనెక్ట్ అయ్యేలా కనిపిస్తోంది. TVS స్కూటర్   స్మార్ట్‌వాచ్ ఫోటో ఇంకా బటన్స్ చూపుతుంది. ఇది  స్కూటర్ కనెక్ట్ చేయబడిన ఫీచర్స్ సూచిస్తుంది. 

ఈ బటన్‌లు అండర్-సీట్ స్టోరేజ్‌ని లాక్ చేయడం లేదా అన్‌లాక్ చేయడం, హ్యాండిల్‌బార్‌ను లాక్ చేయడం లేదా అన్‌లాక్ చేయడం లేదా రిమోట్‌గా అలారం సెట్ చేయడంలో మీకు సహాయపడతాయి. ఎవరైనా స్కూటర్‌ని దొంగిలించకుండా చేయడానికి లేదా మీరు ఎక్కడ పార్క్ చేశారో మర్చిపోతే స్కూటర్‌ని కనుగొనడానికి ఈ అలారం ఉపయోగపడుతుంది.

తాజా ప్రివ్యూలో, TVS మోటార్స్ ఎలక్ట్రిక్ స్కూటర్  ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్‌లో కొంత భాగాన్ని చూపిస్తుంది. ఇది వివిధ రైడింగ్ మోడ్‌ల కోసం విభిన్న డిస్‌ప్లే  ఉంటుంది. వీటిలో  ఎకో అండ్  స్పోర్ట్ కావచ్చు. స్క్రీన్‌షాట్‌లలో ఒకటి స్పీడోమీటర్ రీడింగ్ 105 kmphని చూపుతుంది.

రాబోయే స్కూటర్  పనితీరు ఆధారిత ఉత్పత్తి అని ఇది సూచిస్తుంది. ఫీచర్ ఇంకా ధర గురించి మరిన్ని వివరాలు అధికారిక లాంచ్ ఈవెంట్ తర్వాత మాత్రమే  వెలువడతాయి. ప్రస్తుతం, TVSకి భారతదేశంలో ఏకైక ఎలక్ట్రిక్ స్కూటర్‌  iQube ఉంది. 

త్వరలో విడుదల కానున్న ఈ కొత్త Creon ఆధారిత హైటెక్ స్కూటర్ కోసం కస్టమర్లు ఎదురుచూస్తున్నారు. ఇది TVS నుండి ఎలక్ట్రిక్ స్కూటర్లను కొనుగోలు చేసేవారికి మరిన్ని అప్షన్స్  అందిస్తుంది. ఎక్స్టెండెడ్  లైనప్‌తో, టీవీఎస్ ఎలక్ట్రిక్ స్కూటర్ రంగంలో ఓలా వంటి బ్రాండ్‌లకి పోటీగా వస్తుంది. 

Follow Us:
Download App:
  • android
  • ios