ముంబై: రేసు బైకులను తలపించేలా.. యువతను ఆకట్టుకొనేలా టీవీఎస్‌ మోటార్స్‌ సంస్థ ‘అపాచీ ఆర్‌ఆర్‌310’ను మార్కెట్లోకి తీసుకొచ్చింది. దీనిలో సరికొత్తగా రేస్‌ ట్యూన్డ్‌ స్లిపర్‌ క్లచ్‌ను అమర్చారు. 

ట్యూన్డ్‌ స్లిపర్‌ క్లచ్‌ ఫీచర్‌తో అత్యంత వేగంగా ప్రయాణిస్తున్నా స్థిరత్వం మరింత మెరుగుపడుతుందని టీవీఎస్‌ తెలిపింది. ఈ సరికొత్త ఫీచర్‌తో క్లచ్‌ వినియోగం మరింత సులభతరం అవుతుందని పేర్కొంది.

ఇప్పటికే ఆర్‌ఆర్‌310ను ఉపయోగిస్తున్నవారు ఈ సరికొత్త ఫీచర్‌ను టీవీఎస్‌ రేసింగ్‌ యాక్సెసిరీస్‌లో అప్‌గ్రేడ్‌ చేసుకోవచ్చని పేర్కొంది. ఈ వాహనం పాంథమ్‌ బ్లాక్‌ రంగులో లభిస్తుంది. ఈ బైక్ ధర రూ.2.27లక్షలుగా నిర్ణయించింది.

‘మేం రేస్‌ ట్యూన్‌ (ఆర్‌టీ) స్లిపరీ క్లచ్‌ను ప్రవేశపెట్టడంపై ఎంతో ఉత్సుకతతో ఉన్నాము. ఇది మా ప్రస్తుత, కొత్త వినియోగదారులకు నచ్చుతుందని భావిస్తున్నాం ’ అని అని టీవీఎస్‌ మోటార్స్‌ డైరెక్టర్‌, సీఈవో కె.ఎన్‌.రాధాకృష్ణన్‌ పాల్గొన్నారు. 

సరికొత్త బైక్‌లో రివర్స్‌ ఇన్‌క్లైన్డ్‌ డబుల్‌ ఓవర్‌ హెడ్‌ కామ్‌, అడిషనల్‌ ఆయిల్‌ కూలింగ్‌ టెక్నాలజీతో లిక్విడ్‌ కూల్‌ ఇంజిన్‌ అమర్చారు. దీనిలో సిక్స్‌ స్పీడ్‌ గేర్‌ బాక్స్‌ను అమర్చారు. 313 సీసీ సింగిల్‌ సిలిండర్‌ ఇంజిన్‌ను బీఎండబ్ల్యూ, టీవీఎస్‌ మోటార్స్‌ సంయుక్తంగా అభివృద్ధి చేశాయి. 

313 సీసీ సింగిల్‌ సిలిండర్‌ ఇంజిన్‌ను ఇంజిన్‌ను బీఎండబ్ల్యూ జీ 310 ఆర్, బీఎండబ్ల్యూ జీ 310 జీఎస్ మోడల్స్‌లోనూ వాడతారు. 7000 ఆర్పీఎం వద్ద 27.3 ఎన్ఎం పీక్ టార్చ్, 9700 ఆర్పీఎం వద్ద గరిష్టంగా 34బీహెచ్‌పీ శక్తిని విడుదల చేస్తుంది. అప్ డేటెడ్ న్యూ టీవీఎస్ అపాచీ ఆర్ఆర్ 310 స్లిప్పర్ క్లచ్ మోడల్ బైక్‌ను టీమిండియా మిస్టర్ కూల్ మహేంద్ర సింగ్ ధోనీ కొనుగోలు చేశారు.