Asianet News TeluguAsianet News Telugu

ట్యూబ్ టైర్ vs ట్యూబ్‌లెస్ టైర్: ఏ టైర్ బెస్ట్, తేడా ఏంటో తెలుసా..

ఈ రోజుల్లో, రోడ్లపై నడుస్తున్న వాహనాల్లో రెండు రకాల టైర్లు బాగా ప్రాచుర్యం పొందాయి. ఒకటి ట్యూబ్ లెస్ టైర్, రెండోది ట్యూబ్ టైర్. వాటి మధ్య తేడా ఏమిటో మీకు తెలుసా ఇంకా  రెండింటిలో ఏ టైర్ మంచిది? ఇవన్నీ తెలుసుకోండి.. 
 

Tube Tire vs Tubeless Tyre: Know which tire is best, what is the difference between the two-sak
Author
First Published Mar 16, 2024, 11:53 AM IST

ఈ రోజుల్లో ఎన్నో రకాల వాహనాలు రోడ్లపై తిరుగుతున్నాయి. వీటిలో చాలా వాహనాలు కొత్త టెక్నాలజీతోనూ మరికొన్ని పాత టెక్నాలజీతోనూ నడుస్తున్నాయి. అయితే వాహనాల్లో చాలా కొత్త ఫీచర్లు కూడా వచ్చాయి. అంతేకాకుండా వాటిలో అమర్చిన వాహనాల ఇంజన్  కూడా అధునాతనంగా మారాయి. సాధారణంగా వాహనాలకు రెండు రకాల టైర్లు ఉంటాయి. ట్యూబ్ టైర్ అండ్ ట్యూబ్ లెస్ టైర్. నేటి ఆధునిక వాహనాలకు ట్యూబ్‌లెస్ టైర్లు వస్తున్నాయి. అయినప్పటికీ, కొంతమంది ఇప్పటికీ వాహనాల్లో ట్యూబ్ టైర్లను ఇష్టపడతారు. అయితే ట్యూబ్ టైర్ కి ట్యూబ్ లెస్ టైర్ కి తేడా ఏంటో తెలుసా?

ముందుగా ట్యూబ్ టైర్ గురించి  

ట్యూబ్ టైర్‌లో టైర్‌తో పాటు లోపల ట్యూబ్ ఉంటుంది. ట్యూబ్ చాల మృదువైన కాంపౌండ్ తో తయారు చేయబడింది, దీనిని గాలితో నింపిన తర్వాత గట్టిగా మారుతుంది. ఇంకా దాని   లైఫ్  కూడా పెంచుతుంది. ట్యూబ్ అలాగే టైర్ ఒకదానితో ఒకటి అనుసంధానించబడనందున, టైర్ అండ్  వీల్ మధ్య  గాలి బంధం గట్టిగా ఉండదు. ఈ ట్యూబ్ టైర్ పంక్చర్‌ను రిపేర్ చేయడం సులభం.

ట్యూబ్‌లెస్ టైర్ గురించి

ఈ రకమైన టైర్ ట్యూబ్ లేకుండా పనిచేస్తుంది. ఇందులో నేరుగా టైర్‌లోకి గాలి నింపుతారు. దీని డిజైన్ ఏమిటంటే, ఈ టైర్లను గాలితో నింపినప్పుడు, అవి గాలి ఒత్తిడి కారణంగా వీల్  మెటల్ అంచుకు అంటుకుంటాయి. ఇంకా  గాలి బయటకు వెళ్ళడానికి ఉండదు.

ఏ టైర్ మంచిది?

ట్యూబ్ టైర్ అండ్  ట్యూబ్ లెస్ టైర్ మధ్య ఏది మంచిది? ట్యూబ్ టైర్ పంక్చర్ అయితే  సులభంగా రిపేరు అవుతుంది. దీనికి అయ్యే ఖర్చు కూడా తక్కువగానే కనిపిస్తోంది. ఇందులో మంచి పట్టు కూడా ఏర్పడుతుంది. ఇప్పుడు ట్యూబ్ లెస్ టైర్ గురించి మాట్లాడితే పంక్చర్ అయ్యే అవకాశాలు తక్కువ. ఈ టైర్లు ఎక్కువ కాలం మన్నుతాయి. ఈ టైర్లు పంక్చర్ అయితే గాలి చాలా నెమ్మదిగా బయటకు వస్తుంది. రెండింటి లక్షణాలు భిన్నంగా ఉంటాయి, కానీ రెండింటి ధర ఒకేలా ఉంటుంది.

Follow Us:
Download App:
  • android
  • ios