Asianet News TeluguAsianet News Telugu

Triumph Bonneville T100:ట్రయంఫ్ ప్రీమియం రెట్రో క్రూయిజర్ బైక్.. దీని స్పీడ్, ధర ఎంతో తెలుసా..

కొత్త 2023 బోన్నెవిల్లే T100 బైక్ భారతీయ మార్కెట్లో రూ. 9.59 లక్షల ప్రారంభ ధరతో విడుదల చేసింది (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ). జెట్ బ్లాక్, కార్నివాల్ రెడ్ విత్ ఫ్యూజన్ వైట్, మెరిడియన్ బ్లూతో టాన్జేరిన్  మూడు కలర్ స్కీమ్‌లలో బైక్ అందించారు. 

Triumphs premium retro cruiser bike launched in new colors, know price and features
Author
Hyderabad, First Published Aug 3, 2022, 11:37 AM IST

ట్రయంఫ్ మోటార్‌సైకిల్స్ ఇండియా (Triumph Motorcycles India) మంగళవారం కొత్త 2023 బోన్నెవిల్లే T100 (2023 Bonneville T100) ప్రీమియం రెట్రో క్రూయిజర్ బైక్‌ను లాంచ్ చేస్తున్నట్లు ప్రకటించింది. కొత్త 2023 బోన్నెవిల్లే T100 బైక్ భారతీయ మార్కెట్లో రూ. 9.59 లక్షల ప్రారంభ ధరతో విడుదల చేసింది (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ). జెట్ బ్లాక్, కార్నివాల్ రెడ్ విత్ ఫ్యూజన్ వైట్, మెరిడియన్ బ్లూతో టాన్జేరిన్  మూడు కలర్ స్కీమ్‌లలో బైక్ అందించారు. కొత్త కలర్స్ మినహా ఇతర ఎలాంటి మార్పులు చేయలేదు. 

కలర్ ఆప్షన్స్ అండ్ ధర
జెట్ బ్లాక్ కలర్ ఆప్షన్ ధర రూ.9.59 లక్షలు, కార్నివాల్ రెడ్ విత్ ఫ్యూజన్ వైట్ ధర రూ.9.89 లక్షలు, టాన్జేరిన్‌తో కూడిన మెరిడియన్ బ్లూ ధర రూ.9.89 లక్షలు అన్ని ధరలు ఎక్స్-షోరూమ్, ఢిల్లీకి చెందినవి. 

లుక్ అండ్ డిజైన్
ఎక్స్టీరియర్ లుక్ గురించి మాట్లాడితే కొత్త పెయింట్ స్కీమ్ ఆప్షన్ బైక్ కి సరికొత్త ఆకర్షణను ఇచ్చింది. జెట్ బ్లాక్ పెయింట్ సింగిల్-టోన్ ఫీనిషింగ్ ఉంది, అయితే ఇతర ఆప్షన్స్ డ్యూయల్-టోన్ కలర్ స్కీమ్‌ పొందుతాయి. కొత్త కలర్స్ కలయికతో ఈ బైక్ స్టైలింగ్ కొద్దిగా మార్చబడింది. కానీ డిజైన్ పరంగా అదే సిగ్నేచర్ రౌండ్ హెడ్‌లైట్, టియర్-డ్రాప్ ఆకారపు ఫ్యూయెల్ ట్యాంక్‌తో రబ్బర్ ప్యాడ్‌లు, షూటర్ ఎగ్జాస్ట్, వైర్-స్పోక్ వీల్స్‌ ఇచ్చారు.

ఇంజిన్ అండ్ పవర్
కొత్త 2023 బోన్నెవిల్లే T100 బైక్ కూడా BS-VI కంప్లైంట్ 900cc, పారలెల్-ట్విన్, లిక్విడ్-కూల్డ్ ఇంజిన్‌తో మెకానికల్ ఫీచర్స్ ఉంది. ఈ ఇంజన్ 7,400 rpm వద్ద 64.1 bhp శక్తిని, 3,750 rpm వద్ద 80 Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ 5-స్పీడ్ గేర్‌బాక్స్‌ పొందుతుంది. 

బ్రేకింగ్ అండ్ సస్పెన్షన్ 
సస్పెన్షన్ గురించి మాట్లాడితే ట్రయంఫ్ రెట్రో క్లాసిక్ ఆఫర్‌లో ఇంతకుముందులాగే 41 mm టెలిస్కోపిక్ ఫ్రంట్ ఫోర్క్స్, ట్విన్ రియర్ స్ప్రింగ్‌లు ఉన్నాయి. కొన్ని సంవత్సరాల క్రితం ఇచ్చిన లాస్ట్ జనరేషన్ అప్ డేట్ నుండి అదే సెటప్ బైక్‌లో ఉపయోగించారు. దీనితో పాటు డిస్క్ బ్రేక్లు, టైర్లు వంటి ఇతర అంశాలు కూడా అలాగే ఉంటాయి.  లేటెస్ట్ అప్‌డేట్‌తో ఈ బైక్ కవాసకి Z650 RSతో పాటు దాని సెగ్మెంట్‌లోని ఇతర బైక్‌లతో పోటీపడుతుంది.

Follow Us:
Download App:
  • android
  • ios