ట్రయంఫ్ మోటార్‌సైకిల్స్ ఇండియా  కొత్త అడ్వెంచర్ బైక్ 2022 టైగర్ స్పోర్ట్ 660ని మార్చి 29న దేశంలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది. కస్టమర్ల కోసం కొత్త అడ్వెంచర్ బైక్ కోసం ప్రీ-బుకింగ్‌లను గతేడాది డిసెంబర్‌లో రూ.50,000 టోకెన్ మొత్తంతో ప్రారంభించింది. 

యూ‌కే మోటార్ సైకిల్ బ్రాండ్ ట్రయంఫ్ మోటార్‌సైకిల్స్ ఇండియా (triumph motorcycles brand) కొత్త అడ్వెంచర్ బైక్ 2022 టైగర్ స్పోర్ట్ 660ని మార్చి 29న ఇండియాలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది. కంపెనీ టైగర్ ఫ్యామిలీలో ఈ బైక్ ఎంట్రీ లెవల్ మోడల్‌గా అందించనుంది. కస్టమర్ల కోసం కొత్త అడ్వెంచర్ బైక్ కోసం ప్రీ-బుకింగ్‌లను గతేడాది డిసెంబర్‌లో రూ.50,000 టోకెన్ మొత్తంతో ప్రారంభించింది. ఈ బైక్ కంపెనీ ఇండియా వెబ్‌సైట్‌లో కూడా లిస్టింగ్ చేయబడింది.

ప్రత్యేక ఫీచర్లు
ట్రయంఫ్ టైగర్ స్పోర్ట్ 660 (triumph tiger sport 660) గత ఏడాది అక్టోబర్‌లో ప్రపంచవ్యాప్తంగా ప్రవేశించింది. దీనికి ఎల్‌ఈ‌డి హెడ్‌లైట్‌లతో విలక్షణంగా కనిపించే స్పోర్టీ హాఫ్-ఫెయిరింగ్‌తో పాటు ఆధునికంగా కనిపించే బ్లూటూత్-రెడీ టి‌ఎఫ్‌టి ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్‌ను పొందుతుంది. ఈ బైక్ రెండు రైడింగ్ మోడ్‌లతో వస్తుంది - రోడ్ అండ్ రెయిన్, ట్రాక్షన్ కంట్రోల్ అండ్ ఏ‌బి‌ఎస్. కొత్త బైక్ ట్రైడెంట్ మోడల్‌పై ఆధారపడి ఉంటుంది అలాగే ప్రధాన ఫ్రేమ్‌ను ఉపయోగిస్తుంది. అయితే, బైక్ అదనపు బరువుకు అనుగుణంగా వెనుక సబ్‌ఫ్రేమ్ అప్ డేట్ చేయబడింది. దీని కారణంగా ఈ బైక్ అడ్వెంచర్ టూరర్ బైక్‌గా రూపొందించబడింది.

ఇంజిన్ అండ్ పవర్
రాబోయే ట్రయంఫ్ టైగర్ స్పోర్ట్ 660 బైక్‌లో 660cc త్రీ-సిలిండర్ ఇంజన్ ఉంది, దీనిని ట్రైడెంట్‌లో కూడా ఉపయోగించారు. ఈ ఇంజన్ 81 బిహెచ్‌పి పవర్, 64 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్‌తో 6-స్పీడ్ గేర్‌బాక్స్ ఉంది. దీనితో పాటు, అప్/డౌన్ క్విక్‌షిఫ్టర్ ఆప్షన్ ఉంది.

ఫ్యూయల్ ట్యాంక్ అండ్ సస్పెన్షన్
ఈ బైక్ 17-లీటర్ల ఫ్యూయెల్ ట్యాంక్‌ను పొందుతుంది, అంటే ట్రైడెంట్ మోడల్ కంటే మూడు-లీటర్ల సామర్ధ్యం ఎక్కువ. అడ్వెంచర్ టూరర్ బైక్‌లో నాన్ అడ్జస్ట్ 41ఎం‌ఎం USD ఫోర్క్‌లు, రిమోట్ ప్రీలోడ్ అడ్జస్టర్‌తో ప్రీ-లోడ్ అడ్జస్టబుల్ షాక్‌లు ఉన్నాయి.

అంతర్జాతీయంగా కలర్ ఆప్షన్స్ 
బైక్ మూడు కలర్ ఆప్షన్స్ అందుబాటులో ఉంది. వీటిలో లూసర్న్ బ్లూ, సఫైర్ బ్లాక్, కొరోసి రెడ్, గ్రాఫైట్, గ్రాఫైట్ ఇంకా బ్లాక్. ఈ మూడు రంగుల బైక్‌లను భారతదేశంలో కూడా ప్రవేశపెట్టాలని భావిస్తున్నారు. భారతీయ మార్కెట్లో లాంచ్ అయిన తర్వాత ట్రయంఫ్ టైగర్ స్పోర్ట్ 660 కవాసకి వెర్సిస్ 650 (kawasaki verses 650), సుజుకి వి-స్టార్మ్ 650 ఎక్స్‌టి (suzuki v-smart 650 ఎక్స్‌టి) వంటి బైక్‌లతో పోటీపడుతుంది .