Asianet News TeluguAsianet News Telugu

టయోటా కొత్త ఎస్‌యూ‌వి.. లేటెస్ట్ హైబ్రిడ్ ఇంజన్ తో దానికదే ఛార్జ్ అవుతుంది, దీని ఫీచర్ల గురించి తెలుసా..?

ఈ మోడళ్లను కర్ణాటకలోని కంపెనీ బిడాడి ప్లాంట్‌లో తయారు చేయనున్నారు. ఈ ఎస్‌యూ‌వి గ్లాంజా, అర్బన్ క్రూయిజర్ తర్వాత టయోటా-సుజుకి భాగస్వామ్యంలో నెక్స్ట్ మోడల్‌, ఇవి మారుతి సుజుకి బాలెనో, మారుతి సుజుకి బ్రెజ్జా  రీబ్యాడ్జ్ వెర్షన్‌లకు సంబంధించినవి. 

Toyota Urban Cruiser Hyryder 2022 India unveiled see its Design, features, engine and more
Author
Hyderabad, First Published Jul 1, 2022, 3:58 PM IST

టయోటా కిర్లోస్కర్ మోటార్ ఎట్టకేలకు  అప్ కమింగ్ మిడ్-సైజ్ అర్బన్ క్రూయిజర్ హైరైడర్‌ను పరిచయం చేసింది. విశేషమేమిటంటే హైరైడర్ సెల్ఫ్-చార్జింగ్ స్ట్రాంగ్ హైబ్రిడ్ ఎలక్ట్రిక్ పవర్‌ట్రెయిన్‌తో పరిచయం చేసారు. ఈ మోడల్ కోసం ఆన్‌లైన్ అండ్ ఆఫ్‌లైన్ బుకింగ్‌లు రూ. 25,000 టోకెన్ మొత్తంతో ప్రారంభించారు. ఈ SUV ఆగస్ట్ లేదా సెప్టెంబర్ 2022 లో మార్కెట్లో లాంచ్ కానుంది. 

మారుతీ, టయోటా కలిసి 
ఈ మోడళ్లను కర్ణాటకలోని కంపెనీ బిడాడి ప్లాంట్‌లో తయారు చేయనున్నారు. ఈ ఎస్‌యూ‌వి గ్లాంజా, అర్బన్ క్రూయిజర్ తర్వాత టయోటా-సుజుకి భాగస్వామ్యంలో నెక్స్ట్ మోడల్‌, ఇవి మారుతి సుజుకి బాలెనో, మారుతి సుజుకి బ్రెజ్జా  రీబ్యాడ్జ్ వెర్షన్‌లకు సంబంధించినవి.  Hyryder ప్లాట్‌ఫారమ్, డిజైన్ ఎలిమెంట్స్, ఫీచర్లు, ఇంజన్‌ మారుతి విటారాతో పంచుకుంటుంది. రెండు మోడళ్లను సుజుకి, టయోటా  జాయింట్ వెంచర్ క్రింద కలిసి అభివృద్ధి చేశాయి. 

సెల్ఫ్-చార్జింగ్ స్ట్రాంగ్ హైబ్రిడ్ ఎలక్ట్రిక్ పవర్‌ట్రెయిన్
2022 టయోటా అర్బైన్ క్రూయిజర్ హైరైడర్ సెల్ఫ్-చార్జింగ్ స్ట్రాంగ్ హైబ్రిడ్ ఎలక్ట్రిక్ పవర్‌ట్రెయిన్‌తో అమర్చబడి ఉంటుంది. దీనితో కంపెనీ గ్లోబల్ సెల్ఫ్-చార్జింగ్ టెక్నాలజీతో ఇండియాలోని మాస్ మార్కెట్ విభాగంలోకి ప్రవేశించింది. Urabn క్రూయిజర్ హైరైడర్‌లో అందుబాటులో ఉన్న మరో పవర్‌ట్రెయిన్ ఆప్షన్ నియో డ్రైవ్. SUV మారుతి సుజుకి నుండి 1.5-లీటర్ K-సిరీస్ మైల్డ్-హైబ్రిడ్ పవర్‌ట్రైన్‌తో పాటు టయోటా హైబ్రిడ్ సిస్టమ్ (THS), ఇ-డ్రైవ్ ట్రాన్స్‌మిషన్‌తో వస్తుంది.  ఇంకా 103 బిహెచ్‌పి పవర్, 137 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇంజిన్  కంబైన్డ్ పవర్ అవుట్‌పుట్ 85kW. ఈ మోటార్ 5-స్పీడ్ మాన్యువల్ లేదా 6-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో వస్తుంది.

మైలేజ్
ఈ SUV 177.6V లిథియం-అయాన్ బ్యాటరీ ప్యాక్‌తో  25 కి.మీ వరకు ఫుల్-ఎలక్ట్రిక్ ప్రయాణాన్ని అందిస్తుంది. టయోటా ప్రకారం, ఈ SUV మొత్తం 24-25 kmpl మైలేజీని ఇస్తుంది. 

లుక్ అండ్ డిజైన్
అర్బన్ క్రూయిజర్ హైరైడర్ రాబోయే అర్బన్ క్రూయిజర్ ఫేస్‌లిఫ్ట్ పైన ఉంటుంది. లుక్ అండ్ డిజైన్ గురించి మాట్లాడుతూ, ఈ SUV స్ప్లిట్ హెడ్‌ల్యాంప్ సెటప్‌ను పొందింది, ఇవి ఈ కాలంలో బాగా ప్రాచుర్యం పొందింది.  రెండు వైపులా  LED DRLలతో స్లిమ్ గ్రిల్‌, ఫుల్-LED హెడ్‌ల్యాంప్‌లు, వెనుక వైపున హైరైడర్ టయోటా లోగోతో సన్నని C-ఆకారపు టెయిల్ ల్యాంప్‌లను పొందుతుంది. 

ఇంటీరియర్ అండ్ ఫీచర్లు
టొయోటా హైరైడర్ లెదర్ ర్యాప్డ్ డ్యాష్‌బోర్డ్‌తో డ్యూయల్-టోన్ ఇంటీరియర్‌, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, 360-డిగ్రీ కెమెరా, పనోరమిక్ సన్‌రూఫ్, వైర్‌లెస్ ఛార్జర్, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, కనెక్ట్  కార్ టెక్‌తో కూడిన హెడ్స్-అప్ డిస్‌ప్లే వంటి ఫీచర్లతో అమర్చబడి వస్తుంది. హైరైడర్‌లో 6 ఎయిర్‌బ్యాగ్‌లు, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్, ESP, హిల్-హోల్డ్ అసిస్ట్, హిల్ డిసెంట్ కంట్రోల్ ఉన్నాయి.

వారంటీ
కంపెనీ హైబ్రిడ్ వెర్షన్‌పై 3 సంవత్సరాలు లేదా 1,00,000 కి.మీల స్టాండర్డ్ వారంటీని ఇంకా 8 సంవత్సరాలు లేదా 1,60,000 కి.మీల బ్యాటరీ వారంటీని అందిస్తోంది.

కాంపిటీషన్ 
ఈ మిడ్-సైజ్ SUV టయోటా అర్బన్ క్రూయిజర్ హైరైడర్ హ్యుందాయ్ క్రెటా, కియా సెల్టోస్, స్కోడా కుషాక్, ఫోక్స్‌వ్యాగన్ టైగన్ వంటి వాటితో పోటీ పడుతుంది. మారుతి సుజుకి  రాబోయే కొత్త విటారా SUV టయోటా  కొత్త SUVకి కూడా చాలెంజింగ్ గా నిలుస్తుంది.

Follow Us:
Download App:
  • android
  • ios