టయోటా కిర్లోస్కర్ నుండి సెల్ఫ్‌ చార్జింగ్‌ ఎలక్ట్రిక్‌ కారు...

జర్మనీ ఆటోమొబైల్ దిగ్గజం టయోటా కిర్లోస్కర్ తాజాగా ‘న్యూ కామ్రీ’ మోడల్ కారును భారతదేశ మార్కెట్లోకి విడుదల చేసింది. టయోటా కిర్లోస్కర్ మేనేజింగ్‌ డైరెక్టర్‌ మజకజు యొషిమురా మాట్లాడుతూ భారత్ వంటి మార్కెట్లో పర్యావరణ అనుకూల వాహనాలకే భవిష్యత్ ఉంటుందని పేర్కొన్నారు.

toyota kirloskar self charging car released in indian market

జర్మనీ కార్ల తయారీ సంస్థ టొయోటా కిర్లోస్కర్‌ మోటార్‌ (టీకేఎం) మార్కెట్లోకి కామ్రీ హైబ్రిడ్‌ వెర్షన్‌ను విడుదల చేసింది. దీని ప్రారంభ ధర రూ.36.95 లక్షలుగా ఉంది. 2.5 లీటర్‌ పెట్రోల్‌ ఇంజన్‌, ఎలక్ట్రిక్‌ మోటార్‌ కల కామ్రీ కారు 23.27 కిలో మీటర్ల మైలేజీ ఇస్తుందని కంపెనీ పేర్కొంది. నాలుగోతరం హైబ్రిడ్‌ వ్యవస్థతో కూడిన ఈ సెడాన్‌లో అడ్వాన్స్‌డ్‌ నికెల్‌ మెటల్‌ హైడ్రైడ్‌ బ్యాటరీలు ఉన్నాయి. తొమ్మిది ఎయిర్‌బ్యాగులు, ఇంపాక్ట్‌ సెన్సింగ్‌ ఫ్యూయల్‌ కట్‌ ఆఫ్‌, బ్యాక్‌ హోల్డ్‌ ఫంక్షన్‌ వంటివి ఇందులోని అదనపు ఫీచర్లు. బెంగళూరులోని ప్లాంట్‌లో దీన్ని అసెంబ్లింగ్‌ చేస్తోంది. 

పర్యావరణ అనుకూల మార్కెట్ భారత్

ఈ సెల్ఫ్‌ చార్జింగ్‌ ఎలక్ట్రిక్‌ వెహికిల్‌ ద్వారా పర్యావరణానికి అనుకూలంగా ఉండే వాహనాలు తీసుకురావడంలో ఒక అడుగు ముందు ఉన్నట్టు టయోటా కిర్లోస్కర్ మోటార్స్ (టీకేఎం) మేనేజింగ్‌ డైరెక్టర్‌ మజకజు యొషిమురా తెలిపారు. హైబ్రిడ్‌ టెక్నాలజీలో తమ కంపెనీ మార్గదర్శకంగా ఉందని చెప్పారు. భారత్‌ వంటి మార్కెట్లలో పర్యావరణానికి అనుకూలంగా ఉండే వాహనాలదే భవిష్యత్‌ అని, ఈ నేపథ్యంలో ఈ మార్కెట్‌పై దృష్టిసారిస్తున్నామని ఆయన తెలిపారు.
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios