Asianet News TeluguAsianet News Telugu

టయోటా ఇన్నోవా కొత్త మోడల్.. హైబ్రిడ్ టెక్నాలజీతో మరింత పెద్దగా, గొప్ప ఫీచర్లతో వచ్చేస్తోంది..

కొత్త టయోటా ఇన్నోవా హైక్రాస్ కంపెనీ ప్రస్తుతం ఉన్న లాడర్ ఫ్రేమ్ ఛాసిస్‌కు బదులుగా మోనోకోక్ ఛాసిస్‌పై ఆధారపడుతుంది. ఈ ఛాసిస్‌తో వస్తున్న తొలి ఇన్నోవా ఇదే. ఈ ఛాసిస్‌ వాహనాన్ని తేలికగా ఇంకా బలంగా చేస్తుంది.

Toyota Innova Hycross will launch in November now  more lighter and more powerful know details
Author
Hyderabad, First Published Aug 26, 2022, 4:39 PM IST

జపాన్ మల్టీనేషనల్ ఆటోమోటివ్ తయారీ సంస్థ టయోటా అర్బన్ క్రూయిజర్ హైరైడర్‌ను స్ట్రాంగ్ అండ్ లైట్ హైబ్రిడ్ ఇంజన్‌తో పరిచయం చేసిన తర్వాత టయోటా ఇండియా కోసం టయోటా ఇన్నోవా హైక్రాస్‌ను పరిచయం చేసేందుకు సిద్ధంగా ఉంది. మీడియా నివేదికల ప్రకారం, ఈ ఏడాది నవంబర్‌లో టొయోటా ఇన్నోవా హైక్రాస్‌ను ప్రదర్శించనుంది అయితే దీనిని భారత మార్కెట్లో ప్రస్తుత టయోటా ఇన్నోవా కంటే పైకి ఉంటుంది.

కొత్త టయోటా ఇన్నోవా హైక్రాస్ కంపెనీ ప్రస్తుతం ఉన్న లాడర్ ఫ్రేమ్ ఛాసిస్‌కు బదులుగా మోనోకోక్ ఛాసిస్‌పై ఆధారపడుతుంది. ఈ ఛాసిస్‌తో వస్తున్న తొలి ఇన్నోవా ఇదే. ఈ ఛాసిస్‌ వాహనాన్ని తేలికగా ఇంకా బలంగా చేస్తుంది. హైక్రాస్‌ను కంపెనీ TNGA-C ప్లాట్‌ఫారమ్‌పై నిర్మించనుందీ, అయితే దీనిని టయోటా కొరోలాలో కూడా ఉపయోగించారు. 

స్టైలింగ్ పరంగా, కొత్త ఇన్నోవా హైక్రాస్ విలక్షణమైన MPV డిజైన్‌తో వస్తుంది. అయితే ప్రస్తుత ఇన్నోవా కంటే పెద్దగా తేడా ఏం ఉండదు. అయితే పెద్ద ఫ్రంట్ గ్రిల్, రీడిజైన్ హెడ్‌ల్యాంప్‌లు, మస్కులర్ వీల్ ఆర్చ్‌లు వంటి  మార్పులను చూడవచ్చు. 

కొత్త ఇన్నోవా హైక్రాస్ ప్రస్తుత జనరేషన్ క్రిస్టా కంటే పొడవుగా ఉంటుంది. కొత్త టొయోటా ఇన్నోవా హైక్రాస్ వీల్‌బేస్ సుమారు 2,850 ఎం‌ఎం ఉండవచ్చని అంచనా వేయగా, దాని మొత్తం పొడవు 4.7 మీటర్లు ఉండవచ్చు. ఎక్కువ క్యాబిన్ స్పేస్‌తో ఈ వాహనం వివిధ సీటింగ్ ఏర్పాట్లతో వస్తుంది ఇంకా ప్రస్తుతం ఉన్న ఇన్నోవా క్రిస్టా కంటే ఎక్కువ ఇంటీరియర్ స్పేస్‌ను అందిస్తుంది. 

ఇంజన్ ముందు ఇన్నోవా హైక్రాస్ లో  కొత్త అర్బన్ క్రూయిజర్ హైరైడర్ అండ్ మారుతి సుజుకి గ్రాండ్ విటారాలో అందించిన టయోటా హైబ్రిడ్ టెక్నాలజీని ఉపయోగిస్తుంది.  

అయితే, హైరైడర్లోని  1.5-లీటర్ యూనిట్ కాకుండా, ఇన్నోవా హైక్రాస్ 2.0-లీటర్ హైబ్రిడ్ ఇంజన్‌ను పొందుతుంది. ఇంజిన్ స్పెసిఫికేషన్లను ప్రస్తుతానికి వెల్లడించలేదు. అయితే ప్రస్తుతం అమ్ముడవుతున్న ఇన్నోవా క్రిస్టా లాగా అత్యుత్తమంగా ఉంటుందని ఆశించవచ్చు. కొత్త టయోటా ఇన్నోవా హైక్రాస్ ప్రస్తుత జనరేషన్ MPV లాగానే గ్లోబల్ మోడల్‌గా ఉంటుంది ఇంకా దీనిని ఇండోనేషియా వంటి దేశాల్లో కూడా విక్రయించనుంది.

Follow Us:
Download App:
  • android
  • ios