156 కిలోమీటర్ల మైలేజీచ్చే ఈ బైక్‌ను ఇప్పుడు ఫ్లిప్‌కార్ట్ నుండి బుక్ చేసుకోవచ్చు.. ఎలా అంటే..?

రివోల్ట్ మోటార్స్ RV400 EV బైక్ సేల్స్  ప్రారంభించడానికి ఫ్లిప్‌కార్ట్‌తో వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని ప్రకటించింది. కస్టమర్లు ఇప్పుడు నేరుగా ఫ్లిప్‌కార్ట్‌లో RV400ని కొనుగోలు చేయవచ్చు.
 

This bike with a mileage of 156 km can now be bought from Flipkart-sak

రివోల్ట్ మోటార్స్ ఫ్లిప్‌కార్ట్‌తో భాగస్వామ్యాన్ని ప్రకటించింది. ఫ్లిప్‌కార్ట్ ఇ-కామర్స్ ప్లాట్‌ఫారమ్‌లో RV400 EV బైక్ సేల్స్ ప్రారంభించింది. ఈ సహకారంతో కస్టమర్లు ఇప్పుడు నేరుగా ఫ్లిప్‌కార్ట్‌లో RV400ని కొనుగోలు చేయవచ్చు.

బలమైన ఇ-కామర్స్ ప్లాట్‌ఫారమ్‌ ఫ్లిప్‌కార్ట్  ఉపయోగించడం ద్వారా రివోల్ట్ మోటార్స్ వైడ్ కస్టమర్ బేస్‌ను చేరుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది.  RV400 ఎలక్ట్రిక్ బైక్ ప్రత్యేక ఆఫర్‌లు, ఫాస్ట్ డెలివరీతో సహా ప్రత్యేక ప్రయోజనాలతో ఫ్లిప్‌కార్ట్‌లో కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంటుంది. రివోల్ట్ మోటార్స్ భారతదేశం అంతటా ఉనికిని విస్తరింపజేస్తూ మారుమూల ప్రాంతాల్లోని వినియోగదారులకు ఎలక్ట్రిక్ బైక్ ని అందించడానికి  లాజిస్టిక్స్ నెట్‌వర్క్‌ను ఉపయోగిస్తుంది.

దేశంలో మొట్టమొదటి ఎలక్ట్రిక్ బైక్ రివోల్ట్ ఆగస్టు 2019లో రివోల్ట్ ఇంటెలికార్ప్ RV 300 అండ్  RV 400 మోడళ్లను ప్రవేశపెట్టింది. రివోల్ట్ RV400 ఎలక్ట్రిక్ బైక్ పవర్‌ట్రైన్ సెటప్‌లో 3.24 kWh లిథియం-అయాన్ బ్యాటరీ ఇంకా 175Nm ఇన్స్టంట్  టార్క్‌ను అందించే 3kW (మిడ్ డ్రైవ్) ఎలక్ట్రిక్ మోటార్ ఉన్నాయి. ఇది గరిష్టంగా 85 kmph వేగాన్ని అందిస్తుంది. ఈ బైక్ 156 కి.మీ సర్టిఫైడ్ పరిధిని అనిస్తుంది. ఇంకా మూడు రైడింగ్ మోడ్‌లు అందించబడ్డాయి: నార్మల్, ఎకో అండ్  స్పోర్ట్. 

ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎనేబుల్డ్ బైక్, దీనికి ఇంటర్నెట్ ఇంకా  క్లౌడ్ కనెక్ట్ చేయబడిన ఫీచర్‌లను అందించే ఎంబెడెడ్ 4G LTE SIM ఉంటుంది. సాటిలైట్ నావిగేషన్, రియల్-టైమ్ బైక్ డయాగ్నోస్టిక్స్, బ్యాటరీ స్విచ్, బైక్ లొకేటర్, డోర్‌స్టెప్ బ్యాటరీ సర్వీస్, సెక్యూరిటీ  కోసం జియో-ఫెన్సింగ్, రివోల్ట్ మొబైల్ యాప్ ద్వారా ఆన్‌లైన్ పేమెంట్ గేట్‌వే వంటి ఫీచర్లను కూడా My Revolt యాప్ ద్వారా యాక్సెస్ చేయవచ్చు. కంపెనీ ఆథరైజేడ్ డీలర్‌షిప్‌ల ద్వారా లభించే ఒరిజినల్  విడిభాగాలు ఇంకా ఆక్సెసోరిస్ కాకుండా, కంపెనీ ప్రస్తుతం భారతదేశంలో రెండు ఎలక్ట్రిక్ టూ-వీలర్ మోడళ్లను అందిస్తోంది.

రివాల్క్ RV400 ఎలక్ట్రిక్ బైక్ కూడా ఫీచర్ రిచ్‌గా  ఎల్‌ఈడీ హెడ్‌ల్యాంప్, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్, కీలెస్ ఇగ్నిషన్ ఇంకా రిమూవబుల్ బ్యాటరీ ప్యాక్ వంటి అనేక ఫీచర్లు ఇందులో ఉన్నాయి. Revolt RV400 కూడా ఫుట్ పెగ్స్ దగ్గర ఉంచిన స్పీకర్ల ద్వారా బైక్  సౌండ్‌ను విడుదల చేసే సౌండ్ సిస్టమ్‌ను అందిస్తుంది.ఎలక్ట్రిక్ బైక్‌లో సౌండ్ లేని లోటును భర్తీ చేయాలనుకునే వారు ఈ సిస్టమ్‌ను ఉపయోగించవచ్చు. 

రివోల్ట్ మోటార్స్ ఇటీవలే RV400 ఎలక్ట్రిక్ బైక్ బుకింగ్‌లను తిరిగి ప్రారంభించింది. ఆసక్తిగల కస్టమర్లు రూ. 2,499 టోకెన్ మొత్తాన్ని చెల్లించి కొత్త రివోల్ట్ RV400 ఎలక్ట్రిక్ బైకుని  బుక్ చేసుకోవచ్చు. ఎలక్ట్రిక్ బైక్ డెలివరీలు మార్చి 31, 2023లోపు ప్రారంభమవుతాయి.   కస్టమర్‌లు అధికారిక వెబ్‌పేజీలో బుకింగ్‌ రిజిస్టర్ చేసుకోవచ్చు.

రివోల్ట్ మోటార్స్ కి ప్రస్తుతం భారతదేశంలోని 22 రాష్ట్రాలలో 35 డీలర్‌షిప్‌ ఉన్నాయి. సగటు రైడర్‌కు పెట్రోల్ బైక్‌లకు రూ. 3,500తో పోలిస్తే నెలకు రూ. 350 కంటే తక్కువ ప్రతినెల రన్నింగ్ ఖర్చుతో రివోల్ట్ ఎలక్ట్రిక్ బైక్‌లు వినియోగదారులకు భారీ పొదుపును అందజేస్తాయని కంపెనీ పేర్కొంది.

రతన్ ఎంటర్‌ప్రైజెస్ చైర్‌పర్సన్ అంజలి రతన్ మాట్లాడుతూ, "ఫ్లిప్‌కార్ట్ ప్లాట్‌ఫారమ్‌లో విక్రయాల కోసం రివోల్ట్ మోటార్స్‌తో భాగస్వామ్యం కావడం పట్ల మేము సంతోషిస్తున్నాము ఇంకా  పర్యావరణ స్పృహ కలిగిన వినియోగదారుల పెద్ద కస్టమర్ బేస్‌ను చేరుకోవడానికి ఇంకా వారికి నిజంగా పరివర్తన చెందే ఎలక్ట్రిక్ బైకును  అందించడానికి ఈ సహకారం మాకు వీలు కల్పిస్తుంది." అని అన్నారు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios