నాలుగు లక్షల కంటే తక్కువ ధరకే ఇండియాలోని బెస్ట్ మైకేజ్ కార్లు.. ఈ పండగకి ఇంటికి తీసుకెళ్లండి..

 కంపెనీ ఈ కారును రూ.3 లక్షల 39 వేల ఎక్స్-షోరూమ్ ప్రారంభ ధరతో అందిస్తోంది. కారులో మొత్తం ఐదు వేరియంట్లు ఉన్నాయి, అయితే స్టాండర్డ్ మోడల్ చౌకైనది. దీని ధర తక్కువగా ఉన్నప్పటికీ ఆవరేజ్ పరంగా పెద్ద కార్లను వెనుకకు వేస్తుంది. 

These are the three cheapest cars in india take home for less than four lakhs

తక్కువ ధర, ఎక్కువ మైలేజీ, ఈజీ మెంటేనెన్స్, మంచి రీసేల్ వాల్యు. బడ్జెట్ కార్లలోని ఈ ఫీచర్లు సామాన్యులకు బెస్ట్ ఆప్షన్ గా చేస్తాయి. మీరు కూడా తక్కువ బడ్జెట్‌లో మంచి కారు కొనాలనుకుంటే, కేవలం నాలుగు లక్షల బడ్జెట్‌లో మీకు లభించే టాప్ 3 కార్ల గురించి తెలుసుకోండి..

మారుతీ ఆల్టో 800
మారుతి ఆల్టో 800 ఇండియాలోనే అత్యంత చౌకైన ఇంకా ఎక్కువ ఇష్టపడే కారు. దీని ధర, ఫీచర్లు మొదటిసారిగా కారు కొనుగోలు చేసే వారికి బెస్ట్ ఆప్షన్ చేస్తాయి. కంపెనీ ఈ కారును రూ.3 లక్షల 39 వేల ఎక్స్-షోరూమ్ ప్రారంభ ధరతో అందిస్తోంది. కారులో మొత్తం ఐదు వేరియంట్లు ఉన్నాయి, అయితే స్టాండర్డ్ మోడల్ చౌకైనది. దీని ధర తక్కువగా ఉన్నప్పటికీ ఆవరేజ్ పరంగా పెద్ద కార్లను వెనుకకు వేస్తుంది. కంపెనీ ప్రకారం, ఈ కారు పెట్రోల్ ఇంజన్‌తో లీటర్‌కి 22.05 కి.మీ మైలేజ్ ఇస్తుంది. సేఫ్టీ కోసం కారులో రెండు ఎయిర్‌బ్యాగ్‌లు, రివర్స్ పార్కింగ్ సెన్సార్లు, ABS అండ్ EBD, సీట్ బెల్ట్ రిమైండర్, స్పీడ్ అలర్ట్ సిస్టమ్ వంటి ఫీచర్లు  ఉన్నాయి. పెట్రోల్‌తో పాటు కారు ఇతర వేరియంట్‌లలో సి‌ఎన్‌జి ఆప్షన్ కూడా ఉంది. 

ఆల్టో K10
కంపెనీ చౌకైన ఆల్టో 800 కారు తర్వాత ఈ కారు కూడా చాలా బెస్ట్ ఆప్షన్ కార్. తాజాగా లాంచ్ చేసిన ఆల్టో కె10 ఎక్స్-షోరూమ్ ధర రూ.3.99 లక్షలు. స్టాండర్డ్, LXi, VXi, VXi Plus, VXi AGS అండ్ VXi Plus AGS అనే మొత్తం ఆరు రకాల K10 మార్కెట్‌లో అందుబాటులో ఉన్నాయి. ఇందులో 998 cc పెట్రోల్ ఇంజన్, ఆవరేజ్ మైలేజ్ 24.39 kmpl ఇస్తుంది. దీని చౌకైన వేరియంట్ బ్యాక్ డోర్ చైల్డ్ లాక్, హై స్పీడ్ అలర్ట్, డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్‌బ్యాగ్‌లు, ABS అండ్ EBD, రివర్స్ పార్కింగ్ సెన్సార్లు, సీట్ బెల్ట్ రిమైండర్ వంటి సేఫ్టీ ఫీచర్స్ పొందుతుంది. ఈ కారులో మాన్యువల్ అండ్ AGS గెర్ ట్రాన్స్‌మిషన్ ఆప్షన్ ఉంది.

డాట్సన్ రెడి గో
మారుతితో పాటు నిస్సాన్ డాట్సన్ బ్రాండ్ రెడి గో కూడా  ఇండియాలోని చౌకైన కార్లలో ఒకటి. ఈ కారు ఎక్స్-షోరూమ్ ప్రారంభ ధర రూ.3.97 లక్షల నుండి ప్రారంభమవుతుంది. ఇందులో A, T, T ఆప్షనల్, T ఆప్షనల్ 1.0L అండ్ AMT వేరియంట్‌లను ఉన్నాయి. రూ. 4 లక్షల లోపు ఈ కారు 800 సిసి ఇంజన్, ఎబిఎస్, ఇబిడి, డ్రైవర్ ఎయిర్‌బ్యాగ్, రియర్ డోర్ చైల్డ్ సేఫ్టీ లాక్, ఓవర్ స్పీడ్ వార్నింగ్, రియర్ పార్కింగ్ సెన్సార్, బాడీ కలర్ బంపర్స్ వంటి ఫీచర్లతో వస్తుంది. ఈ కారు ఒక లీటర్ పెట్రోల్‌తో 20.71 కి.మీ మైలేజ్ ఇస్తుంది. 
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios