Gadkari On Tesla: భారత్‌లో ఈవీ తయారీతో టెస్లాకు ప్రయోజనం: నితిన్ గడ్కరీ

అమెరికాకు చెందిన ఈవీ తయారీ సంస్థ టెస్లా (Tesla) భారత మార్కెట్‌లో తమ ఎలక్ట్రిక్ వాహనాలను తయారు చేస్తే.. ఆ కంపెనీకి కూడా ప్రయోజనాలు లభిస్తాయని కేంద్ర రోడ్డు రవాణా రహదారుల మంత్రి నితిన్ గడ్కరీ ప్రకటించారు. సోమవారం ఒక కార్యక్రమానికి హాజరైన మంత్రి గడ్కరీ మాట్లాడుతూ.. దేశంలోని పెట్రోల్ వాహనాల ధర కంటే అన్ని ఎలక్ట్రిక్ వాహనాల ధరలు తక్కువగా ఉండే రోజులు ఎంతో దూరంలో లేవని అన్నారు.
 

Tesla can benefit by manufacturing EVs in India

ఎలక్ట్రిక్ వాహనాలను భారత్‌లో తయారు చేస్తే ఈ వాహనాలు తయారు చేసే టెస్లాకు కూడా ప్రయోజనకరమని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. ‘అగర్ టెస్లా ఇండియా మే ఎలక్ట్రిక్ కార్ల తయారీ కరేగా తో ఉంకా భీ ఫైదా హోగా’ (టెస్లా తన ఎలక్ట్రిక్ వాహనాలను భారతదేశంలో తయారు చేస్తే.. వారు కూడా మంచి ప్రయోజనాలను పొందుతారు) అని గడ్కరీ హిందీలో చెప్పారు. దేశంలో పెట్రోల్ వాహనాల ధర కంటే ఎలక్ట్రిక్ వాహనాల ధరలు తక్కువగా ఉండే రోజులు మరెంతో కాలం లేదన్నారు. ఆ రోజులు ఎంతో దూరంలో లేవని వ్యాఖ్యానించారు.  టెస్లా ఇంక్ అధినేత ఎలాన్ మస్క్ తన ఎలక్ట్రిక్ వాహనాలను చైనాలో తయారు చేసి, భారత్‌లో విక్రయిస్తామని భావిస్తున్నారు. దీనికి భారత ప్రభుత్వం అంగీకరించడం లేదు. ఇక్కడే తయారు చేయాలని చెబుతోంది.

దేశంలో పెట్రోల్ వాహనాల వ్యయంతో పోలిస్తే అన్ని విద్యుత్ వాహనాల ధరలు తక్కువకు లభించే రోజులు ఎంతో దూరంలో లేవన్నారు గడ్కరీ. ఎలాన్ మస్క్ భారత్‌లో తయారీకి సిద్ధంగా ఉంటే తమకు సమస్య లేదన్నారు. ఇక్కడ తయారీ ప్రారంభిస్తే చాలా ప్రయోజనమని, భారత్ చాలా పెద్ద మార్కెట్ అని, భారత్ నుండి ఎగుమతులు కూడా చేసుకోవచ్చునని చెప్పారు. కానీ చైనా నుండి మాత్రం కార్లను దిగుమతి చేసుకోరాదన్నారు.

ముందుగా భారత్‌లో తయారీని ప్రారంభిస్తేనే ఏవైనా పన్ను మినహాయింపులు పరిశీలిస్తామని గతంలోనే గడ్కరీ చెప్పారు. ప్రస్తుతం పూర్తిగా తయారైన వాహనాల దిగుమతిపై కస్టమ్స్ డ్యూటీ 60 శాతం నుండి 100 శాతంగా ఉంది. ఇంజిన్ పరిమాణం, వ్యయం, ఇన్సురెన్స్, ట్రాన్సుపోర్ట్ వ్యాల్యూ ఆధారంగా ఉంది. 40,000 డాలర్లకు పైగా ఉండే వాహనాలపై దిగుమతి సుంకం 110 శాతంగా ఉందని, ఇది ఉద్గారరహిత వాహనాలపై నిషేధం విధించడం వంటిదని గతంలో టెస్లా పేర్కొంది. విద్యుత్ కార్లపై టారిఫ్‌ను 40 శాతానికి చేర్చాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. సీఎస్ఆర్‌ను కూడా ఉపసంహరించారలని కోరింది.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios