Tata Nexon EV: టాటా నెక్సాన్ కొత్త ఈవీ లాంచ్.. ఒక్కసారి ఛార్జింగ్‌కే 400 కి.మీ ప్రయాణం..!
టాటా మోటార్స్ మనదేశంలో ఈ నెల 11వ తేదీన కొత్త కారు లాంచ్ చేయనున్నట్లు గతంలోనే ప్రకటించింది. అయితే ఆ కారు ఏదో తెలియరాలేదు. ఇప్పుడు టాటా ఆ సస్పెన్స్‌కు తెరదించింది. నెక్సాన్‌లోనే ఫ్లాగ్ షిప్ వేరియంట్‌ను లాంచ్ చేయనున్నట్లు ప్రకటించింది. దానికి నెక్సాన్ ఈవీ మ్యాక్స్ అని పేరు పెట్టింది.
టాటా మోటార్స్ నెక్సాన్ అప్‌డేటెడ్ ఎలక్ట్రిక్ వెహికిల్‌ను నేడు మార్కెట్లోకి విడుదల చేసింది. లాంగ్ రేంజ్ నెక్సాన్ ఈవీ మ్యాక్స్‌ను బుధవారం మార్కెట్లోకి విడుదల చేసినట్టు టాటా మోటార్స్ ప్రకటించింది. ఈ అప్‌డేటెడ్ ఎలక్ట్రిక్ సబ్ కాంపాక్ట్ ఎస్‌యూవీ అతిపెద్ద బ్యాటరీ ప్యాక్‌తో మార్కెట్లోకి వచ్చింది. ప్రస్తుత మోడల్‌కు పలు రకాల అప్‌డేటెడ్ ఫీచర్లను యాడ్ చేసింది. నెక్సాన్ ఈవీ ప్రస్తుతం భారత్‌లో బెస్ట్ సెల్లింగ్ ఎలక్ట్రిక్ వెహికిల్స్‌లో ఒకటిగా నిలుస్తోంది.
రెండు వేరియంట్లలో నెక్సాన్ ఈవీని కంపెనీ ఆఫర్ చేస్తుంది. ఎక్స్‌జెడ్ ప్లస్, ఎక్స్‌జెడ్ ప్లస్ లక్స్ వేరియంట్లలో నెక్సాన్ ఈవీని లాంచ్ చేసింది. ఈ రెండు వేరియంట్లలో స్టాండర్డ్ 3.3 కేడబ్ల్యూ ఛార్జర్ లేదా అదనంగా రూ.50 వేల ఖర్చుతో 7.2 కేడబ్ల్యూ ఏసీ ఫాస్ట్ ఛార్జర్‌ను అందిస్తోంది.
3.3 కేడబ్ల్యూ ఛార్జర్ ఆప్షన్‌తో మార్కెట్లోకి వచ్చిన నెక్సాన్ ఈవీ మ్యాక్స్ ఎక్స్‌జెడ్ ధర రూ.17.74 లక్షలు కాగా.. 7.2 కేడబ్ల్యూ ఏసీ ఫాస్ట్ ఛార్జర్‌తో వచ్చిన నెక్సాన్ ఈవీ మ్యాక్స్ ఎక్స్‌జెడ్ ప్లస్ ధర రూ.18.24 లక్షలుగా ఉంది. నెక్సాన్ ఈవీ మ్యాక్స్ జెడ్‌ప్లస్ లక్స్ ధర ఛార్జింగ్ ఆప్షన్ బట్టి రూ.18.74 లక్షలుగా, రూ.19.24 లక్షలుగా ఉంది. 7.2 కేడబ్ల్యూ ఏసీ ఫాస్ట్ ఛార్జర్ ఈ కారును ఆరున్నర గంటల్లో ఛార్జ్ చేస్తుంది. అయితే ఈ కారు టాప్ స్పీడ్‌ను కంపెనీ గంటకు 140 కి.మీను కుదించింది.
నెక్సాన్ ఈవీ మ్యాక్స్ బ్యాటరీ ప్యాక్ ఏఆర్ఏఐ సర్టిఫికేషన్‌తో 40.5 కిలోవాట్స్ పర్ అవర్‌గా ఉంది. ప్రస్తుత మోడల్‌లో ఈ బ్యాటరీ ప్యాక్ 30.3 కేడబ్ల్యూహెచ్‌గా ఉంది. సింగిల్ ఛార్జింగ్‌తోనే 400 కిలోమీటర్లు ఇది ప్రయాణించగలదు. మకరన్ ఇంటీరియర్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, వైర్‌లెస్ ఫోన్ ఛార్జర్, ఎయిర్ ప్యూరిఫైయర్, స్మార్ట్ వాచ్ ఇంటిగ్రేషన్, క్రూయిజ్ కంట్రోల్ వంటి ఫీచర్లు ఈ కారులో ఉన్నాయి.
ఈ ఎలక్ట్రిక్ వెహికిల్‌ను ప్రస్తుతం 75కి పైగా నగరాలలో 210 టచ్ పాయింట్లలో విక్రయిస్తోంది. ఈ ఏడాది మరో 70 టచ్ పాయింట్లను కంపెనీ యాడ్ చేస్తుంది. ఛార్జింగ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ను 200కి పైగా నగరాలలో, 1300కి పైగా ఉన్నాయి.