Tata Nexon:టాటా నెక్సాన్ ఎలక్ట్రిక్ కారులో మంటలు.. వీడియో వైరల్‌.. విచారణపై కంపెనీ హామీ..

ఈ వైరల్ వీడియోలో ముంబైలోని వెస్ట్ వసాయ్ ప్రాంతంలోని ఒక రెస్టారెంట్ బయట తెల్లటి రంగు టాటా నెక్సాన్ EV మంటల్లో మునిగిపోయింది. పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది కూడా మంటలను ఆర్పడానికి అలాగే ఆ ప్రాంతంలో ట్రాఫిక్‌ను నియంత్రించి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. 

 Tata Nexon electric car caught fire, video went viral, company assured of investigation

ముంబైలో మంగళవారం టాటా నెక్సాన్ ఎలక్ట్రిక్ వాహనంలో మంటలు చెలరేగాయి, దీంతో భారతదేశంలో విక్రయించే ఎలక్ట్రిక్ వాహనాల భద్రత గురించి కొత్త చర్చకు దారితీసింది. Nexon EV అగ్నిప్రమాదానికి సంబంధించిన వీడియో మంగళవారం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ప్రస్తుతం దేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న ఎలక్ట్రిక్ కారు టాటా నెక్సాన్ EV అగ్ని ప్రమాదంలో తీవ్రంగా దెబ్బతిన్నది. కంపెనీ ఈ సంఘటన, భవిష్యత్ కార్యాచరణకు సంబంధించి ఒక ప్రకటనను కూడా విడుదల చేసింది. 

ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్‌
ఈ వైరల్ వీడియోలో ముంబైలోని వెస్ట్ వసాయ్ ప్రాంతంలోని ఒక రెస్టారెంట్ బయట తెల్లటి రంగు టాటా నెక్సాన్ EV మంటల్లో మునిగిపోయింది. పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది కూడా మంటలను ఆర్పడానికి అలాగే ఆ ప్రాంతంలో ట్రాఫిక్‌ను నియంత్రించి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఈ ఘటనలో ఇప్పటివరకు ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. ప్రస్తుతం అగ్నిప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు. 

కంపెనీ ప్రకటన విడుదల 
Nexon EV అగ్నిప్రమాదానికి గల కారణాలపై విచారణకు హామీ ఇస్తూ టాటా మోటార్స్ బుధవారం ఒక ప్రకటన విడుదల చేసింది. "తాజా  అగ్నిప్రమాద సంఘటన  వాస్తవాలను నిర్ధారించడానికి పూర్తి దర్యాప్తు జరుగుతోంది. మా పూర్తి విచారణ తర్వాత మేము కారణాలను వెల్లడిస్తాము" అని కార్ల తయారీ సంస్థ తెలిపింది. సోషల్ మీడియాలో వీడియో షేర్ చేసిన వ్యక్తి మంటలు ఆర్పిన తర్వాత మరో వీడియో షేర్ చేశాడు. 

ఎలక్ట్రిక్ స్కూటర్ల అగ్నిప్రమాదం తర్వాత ఇప్పటికే ఒత్తిడిని ఎదుర్కొంటున్న ఓలా ఎలక్ట్రిక్ సీఈఓ భవిష్ అగర్వాల్ కూడా  సోషల్ మీడియా ఈ వీడియోను షేర్ చేశారు. దీనితో పాటు ఎలక్ట్రిక్ వాహనల అగ్ని ప్రమాదాలు అసాధారణం కాదని, ప్రపంచవ్యాప్తంగా కూడా అలాంటి నివేదికలు ఉన్నాయని అతను మెసేజ్ పోస్ట్ చేశాడు. అయితే, ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు ICE వాహనాల కంటే EVలు సురక్షితమైనవని అని ఆయన అన్నారు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios