April Auto Sales: ఏప్రిల్‌లో తగ్గిన వాహన విక్రయాలు.. అదరగొట్టిన టాటా మోటార్స్‌..!

ఏప్రిల్‌లోనూ వాహన టోకు విక్రయాలు తగ్గాయి. దేశీయ దిగ్గజ సంస్థ మారుతీ సుజుకీ టోకు విక్రయాలు ఏప్రిల్‌లో 1,50,661 వాహనాలకు పరిమితమయ్యాయి. 2021 ఏప్రిల్‌లో డీలర్లకు కంపెనీ సరఫరా చేసిన 1,59,691 వాహనాలతో పోలిస్తే ఇవి 6 శాతం తక్కువ. 
 

Tata Motors sees 74% YoY jump

ఏప్రిల్ నెలలో వాహనాల విక్రయాలు మిశ్రమంగా ఉన్నాయి. టాటా మోటార్స్ మాత్రం భారీ విక్రయాలు నమోదు చేసింది. ఏడాది ప్రాతిపదికన 74 శాతం సేల్స్ పెరిగాయి. హ్యుండాయ్, మారుతీ సుజుకీ సేల్స్ తగ్గాయి. సరఫరా అంతరాయాల వల్ల ఉత్పత్తి సమస్యలు తలెత్తి మారుతీ, హ్యుండాయ్ మోటార్స్ తమ ప్లాంట్స్ నుండి డీలర్లకు వాహన సరఫరాలను గత నెలలో తగ్గించాయి. టాటా మోటార్స్‌తో పాటు స్కోడా మాత్రం గణనీయ వృద్ధిని నమోదు చేసింది.

ఏడాది ప్రాతిపదికన టాటా మోటార్స్ లిమిటెడ్ డొమెస్టిక్, ఇంటర్నేషనల్ మార్కెట్ సేల్స్ గత ఏప్రిల్ నెలలో 72,468కి పెరిగాయి. 2021 ఏప్రిల్ నెలలో 41,729 మాత్రమే విక్రయించింది. డొమెస్టిక్ సేల్స్ 39,401 యూనిట్ల నుండి 71,467 యూనిట్లకు పెరిగాయి. డొమెస్టిక్ మార్కెట్ కమర్షియల్ వెహికిల్ సేల్స్ 109 శాతం పెరిగి 14,306 యూనిట్ల నుండి 29,894 యూనిట్లకు పెరిగాయి. అయితే కమర్షియల్ వెహికిల్ ఎక్స్‌పోర్ట్స్ మాత్రం 57 శాతం తగ్గి 2209 యూనిట్ల నుండి 958 యూనిట్లకు పెరిగాయి. ట్రక్కులు, బస్సుల సేల్స్ గత ఏడాది ఏప్రిల్‌లో 7366 యూనిట్లు కాగా, ఈ ఏప్రిల్ నెలలో 12,524 యూనిట్లకు పెరిగాయి. టాటా మోటార్స్ పాసింజర్ వెహికిల్ సేల్స్ డొమెస్టిక్ మార్కెట్‌లో గత నెలలో 66 శాతం పెరిగి 25,095 యూనిట్ల నుండి 41,587 యూనిట్లకు పెరిగాయి.

మారుతీ సుజుకీ విక్రయాలు 1,42,454 నుండి 7 శాతం తగ్గి 1,32,248 వాహనాలకు పరిమితమయ్యాయి. చిన్న కార్లలో ఆల్టో, ఎస్-ప్రెసోల విక్రయాలు 32 శాతం తగ్గాయి. కాంపాక్ట్ విభాగంలో స్విఫ్ట్, సెలారియో, ఇగ్నిస్, బాలెనె, డిజైర్ విక్రయాలు 18 శాతం తగ్గి 60,000 దిగువకు నమోదయ్యాయి. మధ్యస్థాయి సెడాన్ సియాజ్ అయితే ఏకంగా మూడింట రెండింతలు తగ్గి 1567 యూనిట్ల నుండి 579 యూనిట్లకు పడిపోయాయి.హ్యుండాయ్ ఇండియా డొమెస్టిక్ సేల్స్ 44,001 యూనిట్లకు, ఎగుమతులు 12,200 యూనిట్లకు పరిమితమయ్యాయి. మొత్తం సేల్స్ 5 శాతం, డొమెస్టిక్ సేల్స్ 10 శాతం తగ్గాయి.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios