టాటా మోటార్స్ ఈ మూడు వేరియంట్‌ల కార్లు నిలిపివేత.. అసలు కారణం ఏంటంటే..?
వేరియంట్‌లలో మార్పులతో పాటు టాటా మోటార్స్ ఆల్ట్రోజ్ హై స్ట్రీట్ గోల్డ్ కలర్ స్కీమ్‌ను తిరిగి పరిచయం చేసింది. దీంతో ఈ హ్యాచ్‌బ్యాక్ ఇప్పుడు మొత్తం ఏడు కలర్ ఆప్షన్‌లలో అందుబాటులో ఉంది.
ఇండియాలోని ప్రముఖ వాహన తయారీ సంస్థ టాటా మోటార్స్ టాటా ఆల్ట్రోజ్ XE, XZ డార్క్ అండ్ XZ(O) డీజిల్ వేరియంట్‌లను నిలిపివేసింది. దీనితో పాటు హ్యాచ్‌బ్యాక్ XZA(O) పెట్రోల్ వేరియంట్ కూడా నిలిపివేసింది. అయితే టాటా మోటార్స్ ఆల్ట్రోజ్ లైనప్‌లో XT డార్క్ ఎడిషన్‌ను తీసుకొచ్చింది.
వేరియంట్‌లలో మార్పులతో పాటు టాటా మోటార్స్ ఆల్ట్రోజ్ హై స్ట్రీట్ గోల్డ్ కలర్ స్కీమ్‌ను తిరిగి పరిచయం చేసింది. దీంతో ఈ హ్యాచ్‌బ్యాక్ ఇప్పుడు మొత్తం ఏడు కలర్ ఆప్షన్‌లలో అందుబాటులో ఉంది. ఇందులో హై స్ట్రీట్ గోల్డ్, ఒపెరా బ్లూ, ఆర్కేడ్ గ్రే, డౌన్‌టౌన్ రెడ్, అవెన్యూ వైట్, కాస్మో బ్లాక్ అండ్ హార్బర్ బ్లూ ఉన్నాయి.
ఈ వేరియంట్‌లను నిలిపివేయడానికి టాటా మోటార్స్ ఎటువంటి కారణం చెప్పలేదు. అయితే, డీలర్ల ప్రకారం సేల్స్ కి లింక్ చేయవచ్చు. గత కొన్ని నెలల్లో టాటా ఆల్ట్రోజ్ సేల్స్ తగ్గుదలని చూశాయి, అయితే కొంతమంది డీలర్లు ఇది కేవలం లైనప్‌ను రిఫ్రెష్ చేయడానికి మాత్రమేనని చెబుతున్నారు.
లైనప్ మార్పులు కాకుండా, టాటా ఆల్ట్రోజ్ మెకానికల్ గా ఏం మార్చలేదు. టాటా ఆల్ట్రోజ్ మూడు ఇంజన్ ఆప్షన్స్ పొందుతుంది. 85 bhp 1.2-లీటర్ పెట్రోల్ ఇంజన్, 108 bhp 1.2-లీటర్ టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజన్, 89 bhp 1.5-లీటర్ డీజిల్ ఇంజన్. వీటికి గేర్‌బాక్స్ ఆప్షన్స్ కూడా ఒకే విధంగా ఉంటాయి - మాన్యువల్ అండ్ DCT.
పోటీ పరంగా టాటా ఆల్ట్రోజ్ భారతీయ మార్కెట్లో హ్యుందాయ్ ఐ20, మారుతి సుజుకి బాలెనో, టయోటా గ్లాంజాలతో పోటీ పడుతోంది.