Asianet News TeluguAsianet News Telugu

ఆ కార్లకు భారత్‌లో భలే గిరాకీ...2018లో భారీ అమ్మకాలు

ఆటోమొబైల్ రంగంలో స్పోర్ట్స్ యుటిలిటీ వెహికల్స్ (ఎస్ యూవీ) పట్ల వినియోగదారుల్లో క్రేజ్ పెరిగిపోతున్నది. గతేడాది (2018)లో మొత్తం కార్ల సేల్స్ లో సబ్ కంపాక్ట్ ఎస్‌యూవీ మోడల్ సబ్ కంపాక్ట్ మోడల్స్ విక్రయాల్లో 23 శాతం పురోగతి లభించింది. 
 

Subcompact SUV Sales Grow By Almost 23% In 2018: Study
Author
New Delhi, First Published Jan 1, 2019, 3:18 PM IST

న్యూఢిల్లీ: అంతర్జాతీయంగా ఎస్‌యూవీ మోడల్ కార్లకు ఉన్న మోజు భారతదేశంలోనూ కనిపిస్తోంది.  2018లో మార్కెట్లో అడుగు పెట్టిన ఎస్‌యూవీ మోడల్ కార్లన్నీపరిపూర్ణంగా అమ్ముడుపోతున్నాయి. 2018 ఏప్రిల్ - సెప్టెంబర్ మధ్య భారతీయ కస్టమర్లు సుమారు నాలుగు లక్షల ఎస్‌యూవీ కార్లను కొనుగోలు చేశారు. ఇది 2017తో పోలిస్తే తొమ్మిది శాతం పెరుగుదల. సెడాన్, ఎంట్రీ లెవెల్ హ్యాచ్ బ్యాక్, ఎంపీవీ సెగ్మెంట్ కార్ల విక్రయాల్లో పురోగతి కనిపిస్తోంది. 

మొత్తం కార్ల విక్రయాల్లో సబ్ కంపాక్ట్ ఎస్‌యూవీ కార్ల వాటానే ప్రధానంగా ఉంది. దేశీయంగా సబ్ కంపాక్ట్ ఎస్‌యూవీ కార్లు ఏప్రిల్ - సెప్టెంబర్ మధ్య రెండు లక్షలకు పైగా యూనిట్లు అమ్ముడు పోయాయి. ఈ విభాగంలో మరికొన్ని ఎస్‌యూవీ మోడల్స్ మార్కెట్లోకి రానున్నాయి. ప్రత్యేకించి మారుతి సుజుకి విటారా, బ్రెజ్జా, టాటా నెక్సన్, ఫోర్డ్ ఎకోస్పోర్ట్, మహీంద్రా ఎస్ యూవీ300 మోడల్ కార్లు ఇప్పటికే సక్సెస్ సాధించేశాయి. దీంతో ఇతర సంస్థలు కూడా విజయం సాధించేందుకు వ్యూహాల రూపకల్పనలో నిమగ్నమయ్యాయి. 

మహీంద్రా ఎక్స్ యూవీ 300 మోడల్ కారు త్వరలో మార్కెట్లో ప్రవేశించనున్నది. ఇక ఎస్‌యూవీ మోడల్‌లో వోక్స్ వ్యాగన్, టయోటా, స్కోడా తదితర సంస్థలు ఎస్‌యూవీ విభాగంలో ఈ ఏడాది అతిపెద్ద కార్లను మార్కెట్లోకి విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నాయి. 2016 ఆటో ఎక్స్ పోలో కాన్సెప్ట్ ఆవిష్కరించిన హుండాయి త్వరలో సబ్ కంపాక్ట్ ఎస్‌యూవీ కారును మార్కెట్లోకి తేనున్నది. తద్వారా భారీ స్థాయిలో వినియోగదారుల మనస్సు చూరగొననున్నది. 

రోజురోజుకు సబ్ కంపాక్ట్ ఎస్ యూవీ మోడల్ కార్ల పట్ల డిమాండ్ పెరుగుతోంది. అయితే సబ్ కంపాక్ట్ ఎస్ యూవీ మోడల్స్ కార్ల విక్రయం ఏప్రిల్ - సెప్టెంబర్ మధ్య కేవలం మూడు శాతంగా నమోదైంది.  జీప్ కంపాస్, హ్యుండాయి క్రెట్టా తదితర మోడల్ కార్లతోపాటు టాటా హరియర్, నిస్సాన్, హుండాయ్ టుక్సోన్ తదితర మోడల్ కార్లు మార్కెట్లోకి రానున్నాయి. 

ఇక కంపాక్ట్ ఎస్ యూవీ కార్ల సేల్స్ నాలుగు శాతం తగ్గాయి. ఏప్రిల్ - సెప్టెంబర్ మధ్య కేవలం 41,868 యూనిట్లు అమ్ముడు పోయాయి. హోండా సీఆర్ -వీ, బీఎండబ్ల్యూ ఎక్స్3, అడి క్యూ5 తదితర నూతన మోడల్స్ రానున్నాయి. ఈ విభాగంలో వినూత్న ఆవిష్కరణలతో మార్కెట్లో భారీ పెరుగుదలకు అవకాశం ఉన్నదని తెలుస్తోంది. 

బీఎండబ్ల్యూ ఎక్స్5, ఎక్స్7, ఎక్స్2తోపాటు మెర్సిడెస్ విడుదల చేసే నూతన తరం జీఎల్ఈ, వీ- క్లాస్ మోడల్ కారుతోపాటు ఫోర్డ్ కూడా కాంట్రాక్టు ఎస్ యూవీ మోడల్ కార్ల విభాగంలోకి అడుగు పెట్టనున్నది. 

 

Follow Us:
Download App:
  • android
  • ios