మత్స్యకారుడి తనయుడు జోసెఫ్ జోషీ కొట్టాయం కేంద్రంగా పనిచేస్తున్న ఓ ప్రైవేట్ సంస్థలో పని చేస్తున్న ఓ ఉద్యోగి. ప్రైవేట్ సంస్థలో ఉద్యోగిగా చేరినప్పటి నుంచి సొంతింటితోపాటు సొంత కారు కల కంటున్నాడు. ‘నా తండ్రి ముందు ఇల్లు కట్టుకోవాలంటే, తల్లి కారు కొనాలంటున్నది’ అని చెబుతున్నాడు జోసెఫ్ జోషి.

వారిద్దరి కల సాకారం చేయాలని నిర్ణయానికి వచ్చినట్లు పేర్కొన్న జోషి జోసెఫ్.. రుణంతో ఇల్లు కట్టేసుకున్నాడు. ఇటీవల ప్రమోషన్ రావడంతో కారు కొనుగోలుకు సిద్ధమయ్యాడు. తన తల్లి ఆనందంతో ఉబ్బి తబ్బిబవుతున్నారన్నాడు. త్వరలో పెండ్లి కూడా చూసుకోనున్నట్లు చెప్పాడు. 

ముంబై నివాసి సిద్ధార్థ్ మిశ్రా ఒక ఇంజినీర్‌గా ఆర్థిక రంగ బహుళ జాతి సంస్థ (ఎంఎన్సీ) ఆలోచనలు విభిన్నం. బైక్ కొనుగోలుకే ప్రాధాన్యం ఇస్తున్నారు. విదేశాలకు వెళ్లి ఎంబీఏ కోర్సు పూర్తి చేయాలని కోరుతున్నారు. వచ్చే నాలుగైదేళ్లలో కారు కొనే ఆలోచనే లేదన్నారు.

అవసరమైనప్పుడు ఓలా, ఉబేర్, జూమ్ కార్ సర్వీసులు పొందే వారు. వీరిద్దరూ విభిన్న సామాజిక వర్గాల వారు కావడంతో ఆలోచనలతో ఉన్నారు. కానీ కార్ల విక్రయాల్లో నెగెటివ్ ప్రగతి నమోదు కావడం ఆటోమొబైల్ సంస్థలను ఇబ్బంది పెడుతున్నది.

ముందే ఈ సంకేతాలు రావడంతో కార్ల తయారీ సంస్థలు కూడా తమ వ్యూహాల ఖరారుపైనే కేంద్రీకరించారు. నిత్యం దూర ప్రాంతాలకు వెళ్లే వారు కార్లపై మోజు చూపడం లేదు. కానీ నిర్దిష్ట ఆదాయం గల వారు కార్ల కొనుగోలుకు ప్రాధాన్యం ఇస్తున్నారు. 

స్థూలంగా కార్ల విక్రయాలు 5-6 శాతం పెరిగితే పట్టణాల్లో తిరోగమనం బాట పడుతున్నాయి. కానీ గ్రామీణ ప్రాంతాల్లో కార్ల విక్రయాలు రెండంకెల వ్రుద్ధి సాధించాయని ఐసీఐసీఐ బ్యాంక్ గ్రూప్ ప్రొడక్ట్ అధినేత ఎన్ఆర్ నారాయణన్ తెలిపారు.

పట్టణ వాసులు తమ ఆలోచనలు, వ్యూహాలు మార్చుకుంటున్నారు. చిన్న కార్లు.. హ్యుండాయ్ శాంత్రో, మారుతి 800, ఆల్ట వంటి మోడల్ కార్ల ఊసే ఎత్తడం లేదు. వీటి కొనుగోళ్లపైనే 1990వ దశకంలో అందరి ద్రుష్టి ఉండేది. అప్పట్లో 40 శాతం విక్రయాలు జరిగితే ప్రస్తుతం 10 శాతానికి పరిమితం. 

కానీ ప్రస్తుతం హ్యేచ్ బ్యాక్ మోడ్ కార్లపైఅందరి ద్రుష్టి మళ్లింది. కంపెనీలు కూడా వినియోగదారుల ఆకాంక్షలకు అనుగుణంగా మినీ కంపాక్ట్, మైక్రో ఎస్ యూవీ మోడల్ కార్ల రీ లాంచ్ పై ఆటోమొబైల్ సంస్థలు ద్రుష్టిని కేంద్రీకరించాయి.

ఇటీవలే హ్యుండాయ్ నూతనంగా శాంత్రో ఇటీవల రీ లాంచ్ చేసింది. తాజాగా మారుతి తన వాగన్ ఆర్ మోడల్ కారును వచ్చే ఏడాది, ఆల్టో కే 10 కోడ్ నేం వై1కే మోడల్ కారు 2020, ఆల్టో 800 కారు, రెనాల్డ్ క్విడ్, నిస్సాన్ డస్టన్ రెడీ-గో మోడల్ కార్లను వచ్చే ఏడాది ఆవిష్కరించనున్నాయి. 

ఇక హుండాయ్ మోటార్స్, మహీంద్రా అండ్ మహీంద్రా వంటి సంస్థలు ఫ్లెక్సిబుల్ కార్ల మొబిలిటీ ఎక్స్ పీరియన్స్ ను అందుబాటులోకి తేవడానికి ప్రయత్నిస్తున్నాయి. రేవ్, జూమ్ కార్ వంటి మోడల్స్ తేనున్నాయి. ఇక బజాజ్ ఆటోమొబైల్ క్వాడ్రీ సైకిల్ క్యూట్, మహీంద్రా అండ్ పియాజియో వంటి కార్లు మార్కెట్లోకి తేనున్నాయి. 
 
మరోవైపు ప్రభుత్వం కూడా నూతన సేఫ్టీ నిబంధనలను అమలులోకి తేనున్నది. పర్యావరణ హితమైన యూరో 4, యూరో 6 కర్బన ఉద్గారాల రహిత ఇంజిన్ సామర్థ్యం గల వాహనాలను అందుబాటులోకి తెచ్చేందుకు ఆటోమొబైల్ సంస్థలు సిద్ధమయ్యాయి.

వినియోగదారులు కూడా ప్రత్యేకించి పట్టణ కార్ల వినియోగదారుల్లో తొలిసారి కొనుగోలుదారులు, మల్టీపుల్ కార్లు కలవారు, రీప్లేస్ మెంట్ ఆఫర్లు ముందుకు తెస్తున్నాయి. యువత బైక్ లను వాడేందుకు ప్రయత్నిస్తున్నారు.  

ఢిల్లీ, ముంబై వంటి నగరాల్లో భారీగా కార్ల కొనుగోలు దారులు ఉన్నారు. అంతగా కొనేవాళ్లు లేరు. మెట్రో నగరాల పరిధిలో కార్లు కొనుగోళ్లు స్థిరీకరణకు గురయ్యాయి.  పట్టణ వినియోగదారులు అధికంగా టైం కేటాయించకుండా కార్ల కొనుగోలుకు ప్రాధాన్యం ఇస్తున్నారని క్రిసిల్ ఇండియా డైరెక్టర్ హేటల్ గాంధీ ఆరోపించారు. 

చిన్న పట్టణాలు, నగరాలపై ఆటోమొబైల్ సంస్థలు కేంద్రీకరించాయి. ప్రభుత్వ రవాణా వ్యవస్థలు పేలవంగా ఉన్నాయి. ఆయా ప్రాంతాల్లో వారంతా కార్లు కొనుగోలు చేయాలంటే అతిపెద్ద ఆకాంక్షే అవుతుందని హ్యుండాయ్ మోటార్స్ మార్కెటింగ్ హెడ్ పునీత్ ఆనంద్ చెప్పారు.

కస్టమర్ల ఆకాంక్షలకు అనుగుణంగా రూపుదిద్దుకున్న హ్యుండాయ్ శాంత్రో మోడల్ కారు బుకింగ్స్ 40 వేలు దాటాయని గుర్తు చేశారు. దీనివల్ల నెలవారీగా ఉత్పత్తి ఎనిమిది వేల యూనిట్లు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నది హ్యుండాయ్ శాంత్రో.

తాజాగా సేఫ్టీ మోడల్ కార్ల కోసం బీఎస్ 6 ప్రమాణాలతో కొత్త కార్లు తయారు చేయాలంటే అదనంగా రూ.70 వేలకు పైగా ఖర్చు చేయాల్సి వస్తుందని తెలిపారు. సీట్ బెల్లు, ఎయిర్ బ్యాగ్‌లు అమరిస్తే అదనపు ఖర్చవుతుందని ఫెడరేషన్ ఆఫ్ ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు నికుంజ్ సంఘీ తెలిపారు.