న్యూఢిల్లీ: స్కోడా ఆటో ఇండియా తన ప్రీమియం సెడాన్‌ సూపర్బ్‌ మోడల్‌లో కార్పొరేట్‌ ఎడిషన్‌ను బుధవారం మార్కెట్లోకి విడుదల చేసింది. దీని ధర రూ.23.99 లక్షలు ఉంటుంది. 1.8 లీటర్‌ పెట్రోల్‌ ఇంజన్‌ కలిగిన ఈ వేరియంట్‌లో ఎనిమిది ఎయిర్‌ బ్యాగులు, ఎఎఫ్ఎస్‌ (అడాప్టివ్‌ ఫ్రంట్‌ లైటింగ్‌ సిస్టమ్‌) ఫంక్షన్‌, 20.32 సెంటీమీటర్‌ ఫ్లోటింగ్‌ టచ్‌స్ర్కీన్‌ డిస్‌ప్లే, వాతావరణానికి అనుగుణంగా పని చేసే ఎయిర్‌ కండీషనింగ్‌, క్లీన్‌ ఎయిర్‌ ఫంక్షన్‌ తదితర ఫీచర్లు ఈ కారులో ఉన్నాయని కంపెనీ తెలిపింది.

లీటర్ పెట్రోల్‌పై 14.64 కిమీ సామర్థ్యంతో కూడిన ఇంజిన్ గల స్కోడా సూపర్బ్ ఆటోమేటిక్ మోడల్ కారును ఈ ఏడాది చివరిలోగా మార్కెట్లో ప్రవేశపెట్టనున్నట్లు పేర్కొంది. కాండీ వైట్, న్యూ మాగ్నటిక్ బ్రౌన్ రంగుల్లో స్కోడా సూపర్బ్ అందుబాటులోకి రానున్నది. టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ వినోద వ్యవస్థ, మిర్రర్ లింగ్, యాపిల్ కార్ ప్లే, ఆండ్రాయిడ్ ఆటో, మల్టీ కొల్లిషన్ బ్రేక్ కంట్రోల్ వ్యవస్థ తదితర వసతులు స్కోడా సూపర్బ్ కార్పొరేట్ మోడల్ కారులో లభించనున్నాయి.