రేంజ్ రోవర్ లుక్ లో స్కోడా కొత్త ఎలక్ట్రిక్ కార్.. సింగిల్ ఛార్జితో ఎంత మైలేజ్ ఇస్తుందో తెలుసా..

స్కోడా విజన్ 7Sలో 89KwH బ్యాటరీ ప్యాక్‌ని అందించారు. ఈ కారుని ఒక్కసారి ఫుల్ ఛార్జింగ్‌తో 600 కిలోమీటర్లు ప్రయాణించవచ్చు. అలాగే ఫోక్స్‌వ్యాగన్ గ్రూప్ MEB ప్లాట్‌ఫారమ్‌పై ఈ కారుని  నిర్మించనుంది.

Skoda introduced the new electric Vision 7S, will go this far in a single charge

చెక్ రిపబ్లిక్ కార్ కంపెనీ స్కోడా ఎలక్ట్రిక్ సెవెన్ సీటర్ కాన్సెప్ట్ విజన్ 7ఎస్‌ని పరిచయం చేసింది. ఈ కారుని బ్రాండ్ కొత్త డిజైన్ లాంగ్వేజ్ పై నిర్మించారు. ఈ కారు ఒక్కసారి ఛార్జ్ చేస్తే 600 కిలోమీటర్లు ప్రయాణిస్తుందని కంపెనీ పేర్కొంది. స్కోడా ఈ ఎలక్ట్రిక్ కారు 2026 నాటికి మూడు ఎలక్ట్రిక్ వాహనాలను లాంచ్ చేసే ప్రణాళికలో భాగంగా వస్తుంది. 

సింగిల్ చార్జ్ పై 600 కి.మీ
స్కోడా విజన్ 7Sలో 89KwH బ్యాటరీ ప్యాక్‌ని అందించారు. ఈ కారుని ఒక్కసారి ఫుల్ ఛార్జింగ్‌తో 600 కిలోమీటర్లు ప్రయాణించవచ్చు. అలాగే ఫోక్స్‌వ్యాగన్ గ్రూప్ MEB ప్లాట్‌ఫారమ్‌పై ఈ కారుని  నిర్మించనుంది. ఆడి,  వోక్స్‌వ్యాగన్ కూడా ఎలక్ట్రిక్ కార్ల కోసం కూడా ఇదే ప్లాట్‌ఫారమ్‌ను ఉపయోగిస్తాయి. ఈ కారు డ్రైవింగ్, రిలాక్సింగ్ మోడ్ కాన్ఫిగరేషన్‌తో విభిన్న పరిస్థితుల కోసం రెండు ఇంటీరియర్ కాన్ఫిగరేషన్‌లను పొందుతుంది. 

కాన్సెప్ట్ విజన్ 7ఎస్ ఇంటీరియర్ స్పెషల్ 
కారు ఇంటీరియర్ కూడా కొత్త టెక్నాలజీ కోసం డిజైన్ చేయబడింది. ఇంటీరియర్‌కు మధ్యలో ఇతర స్కోడా కార్ల కంటే పెద్దగా 14.6-అంగుళాల స్క్రీన్, ఇందులో నావిగేషన్‌, ఎంటర్టైన్మెంట్, గేమింగ్‌తో పాటు కారుకు సంబంధించిన ఇతర వివరాలను చూడవచ్చు. ఈ కారు లెదర్ ఫ్రీ ఇంటీరియర్‌తో మన్నికైన మెటీరియల్‌తో తయారు చేసారు. కారు ఫ్లోర్ రీసైకిల్ టైర్ల నుండి తయారు చేసారు, లోపల ఉపయోగించిన ఫాబ్రిక్ కూడా 100% రీసైకిల్ పాలిస్టర్ నూలుతో తయారు చేయబడింది. 

T డిజైన్ లైట్లు
కారుకు ఫాక్స్ స్కిడ్ ప్లేట్లు, బ్లాక్ అవుట్ వీల్ ఆర్చ్, ఏడు వర్టికల్ స్లిట్‌లు ఇంకా వెనుక T డిజైన్ టెయిల్‌ల్యాంప్‌లు ఇచ్చారు. విజన్ 7S కాన్సెప్ట్ స్కోడా నుండి హెడ్‌లైట్‌లు ఒకదానిపై ఒకటి రెండు లైన్‌లలో  హెడ్‌లైట్‌లను కొద్దిగా ముందుకు ఉన్నట్లు కనిపిస్తుంది తద్వారా టిగా ఏర్పరుస్తుంది. 
 
ఎలక్ట్రిక్ కార్లపై దృష్టి
2030 నాటికి యూరప్‌లోకి 70 శాతానికి పైగా ఎలక్ట్రిక్ కార్లను తీసుకురావాలని స్కోడా కోరుకుంటోంది. స్కోడా డిజైన్ హెడ్ ఆలివర్ మాట్లాడుతూ, “మేము గత కొన్ని నెలలుగా కొత్త డిజైన్ లాంగ్వేజ్‌పై పనిచేశాము, ఇలాంటి అద్భుతమైన ప్రాజెక్ట్‌లో మా టీమ్ అంకితభావంతో పనిచేసినందుకు నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అని అన్నారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios