ఎలక్ట్రిక్ వాహనాల్లో ఇంజిన్ ఆయిల్ పోయొచ్చా.. ? పెట్రోల్ కారుకి దీనికి తేడా ఏంటి..?
ముఖ్యంగా పెట్రోల్ లేదా డీజిల్‌తో నడిచే కారులాగా ఎలక్ట్రిక్ కారులో ఇంజన్ ఆయిల్ పోయాల్సిన అవసరం ఉంటుందా అనే ప్రశ్న చాలా మందికి ఉంటుంది.
ప్రస్తుతం ఎలక్ట్రిక్ కార్లు బాగా ప్రాచుర్యం పొందుతున్నాయి. వీటిని కొనేందుకు చాలా మంది ఆసక్తిగా ముందుకు వస్తున్నారు. కస్టమర్ల డిమాండ్‌కు అనుగుణంగా కార్ల తయారీ కంపెనీలు కూడా కొత్త ఎలక్ట్రిక్ కార్లను ప్రవేశపెడుతున్నాయి. ఈ కార్ల కొనుగోలుదారులకు వాటి నిర్వహణకు సంబంధించి ఎన్నో ప్రశ్నలు ఉన్నాయి.
ముఖ్యంగా పెట్రోల్ లేదా డీజిల్‌తో నడిచే కారులాగా ఎలక్ట్రిక్ కారులో ఇంజన్ ఆయిల్ పోయాల్సిన అవసరం ఉంటుందా అనే ప్రశ్న చాలా మందికి ఉంటుంది.
ఇంజిన్ ఆయిల్ ?
ఎలక్ట్రిక్ కార్లు ఎలక్ట్రిక్ వెహికల్ ఇంజన్ (EV)ని ఉపయోగిస్తాయి. పెట్రోల్ డీజిల్‌తో నడిచే కార్లు ఉపయోగించే ICE ఇంజిన్‌ల కంటే ఇవి చాలా భిన్నంగా ఉంటాయి. ICE ఇంజిన్ వివిధ భాగాలతో ఉంటుంది. ఇవన్నీ కలిసి కారు కదిలేలా చేయాలి.
కానీ ఎలక్ట్రిక్ కార్లలోని మోటార్లు చాలా భాగాలతో ఉండవు. అందుకే ఎలక్ట్రిక్ కార్ ఇంజిన్‌కు ఆయిల్ అవసరం లేదు. ఇంజిన్ వేడెక్కడం, ఇంజిన్ దెబ్బతినకుండా ఉండడానికి ICE ఇంజిన్‌ను ఉపయోగించినప్పుడు మాత్రమే ఆయిల్ వేయడం అవసరం.
ఎలక్ట్రిక్ వెహికల్ ఇంజన్లు ఎక్కువగా గాలితో చల్లబడేవి కాబట్టి, అవి సరిగ్గా పనిచేయడానికి ఆయిల్ వేయాల్సిన అవసరం లేదు.
ఎలక్ట్రిక్ కారు నిర్వహణ
పెట్రోల్ డీజిల్ కారులాగా ఎలక్ట్రిక్ కారు ఇంజన్ ఆయిల్‌ని మార్చాల్సిన అవసరం లేదు కాబట్టి, ఎలక్ట్రిక్ కార్ల యజమానులు ఇంజన్ ఆయిల్ ధరను ఆదా చేసుకోవచ్చు. అయితే, ఎలక్ట్రిక్ కారు మెయింటెనెన్స్ ఫ్రీ ఉంటుందని అనుకోకండి. ఎలక్ట్రిక్ కార్ల తయారీదారు అందించిన మార్గదర్శకాల ప్రకారం ఎల్లప్పుడూ కారు కండిషన్ చెక్ చేయండి.