SBI brings special offers: కారు కొనాల‌కునేవారికి ఎస్బీఐ బంప‌రాఫ‌ర్‌..!

కారు కొనాలనుకునే వారికి మంచి ఛాన్స్.. మీరు కారు లోన్ తీసుకోవాలని ప్లాన్ చేస్తున్నారా.. అయితే మీకు శుభవార్త.. ఎస్‌బీఐలో చౌక వడ్డీకే రుణాలు అందిస్తుంది.  అంతేకాకుండా పలు రకాల చార్జీల నుంచి మినహాయింపు ఇస్తుంది. ఆ వివ‌రాలేంటో చూద్దాం..!
 

SBI brings special offers for car buyers

మీరు కారు కొనుగోలు చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు శుభవార్త. మీకోసం దేశీ అతిపెద్ద బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) బంప‌రాఫ‌ర్‌ అందుబాటులో ఉంచింది. కారు కొనుగోలుపై 100 శాతం ఫైనాన్స్ ఆప్షన్ అందిస్తోంది. దీంతో కారు కొనుగోలు చేయాలని భావించే వారు డౌన్ పేమెంట్ కోసం ప్రత్యేకంగా డబ్బులు చెల్లించాల్సిన పని లేదు. మొత్తం బ్యాంక్ లోన్ ద్వారానే కారును కొనుగోలు చేయొచ్చు. అయితే ఈ ఆప్షన్ కేవలం ఎస్‌బీఐ కస్టమర్లకే లభిస్తోంది. ఎస్‌బీఐ కార్ లోన్ ఆఫర్ కింద 100 శాతం ఆన్‌రోడ్ ఫైనాన్స్ పొందొచ్చు. అంతేకాకుండా తక్కువ వడ్డీ రేటుకే లోన్ పొందొచ్చు. ఇంకా ప్రాసెసింగ్ ఫీజు వంటివి ఉండవు. ప్రిపేమెంట్ చార్జీలు కూడా లేవు. ఈ ఆఫర్‌లో భాగంగా మీరు ఎస్‌యూవీలు, ఎంయూవీలు సహా ప్యాసింజర్ కారు కొనుగోలు చేయొచ్చు. వడ్డీ రేటు 7.25 శాతం నుంచి ప్రారంభం అవుతోంది. ఇది తక్కువ వడ్డీ రేటు అని చెప్పుకోవచ్చు.

కారు లోన్ కోసం ఎలా అప్లై చేసుకోవాలి..?

ఎస్‌బీఐ ద్వారా కారు లోన్ పొందాలని భావించే వారు బ్యాంక్ బ్రాంచ్‌కు వెళ్లాల్సిన పని లేదు. యోనో యాప్ ద్వారానే రుణాలు పొందొచ్చు. దీని కోసం మీరు యోనో యాప్‌లోకి లాగిన్ అవ్వాలి. తర్వాత షాప్ అండ్ అర్డర్ అనే ఆప్షన్ ఎంచుకోవాలి. ఇందులో ఆటోమొబైల్‌పై క్లిక్ చేయాలి. తర్వాత కార్ లోన్ కోసం అప్లై చేసుకోవచ్చు. 21 నుంచి 67 ఏళ్ల వరకు వయసు కలిగిన వారు లోన్ కోసం అప్లై చేసుకోవచ్చు. మీ ఆదాయం ప్రాతిపదికన మీ లోన్ డబ్బులు నిర్ణయమౌతాయి.

అలాగే మహీంద్రా కార్లపై రూ. 3 వేల విలువైన యాక్ససిరీస్‌ను ఉచితంగానే పొందొచ్చు. లోన్ ఆఫర్‌కు సంబంధించిన పూర్తి వివరాల కోసం 1800 11 2211 నెంబర్‌కు కాల్ చేయొచ్చు. లేదంటే కార్ అని టైప్‌ చేసి 7208933142 నెంబర్‌కు ఎస్ఎంఎస్ పంపొచ్చు. లేదంటే బ్యాంక్ వెబ్‌సైట్‌కు వెళ్లి లోన్ వివరాలను పూర్తి తెలుసుకోవచ్చు. కారు లోన్ తీసుకోవాలని భావించే వారికి ఇది మంచి ఛాన్స్ అని చెప్పొచ్చు. అయితే ఎస్‌బీఐ కాకుండా ఇతర బ్యాంకుల్లో లోన్ తీసుకునే ముందు వడ్డీ రేట్లు ఎలా ఉన్నాయో ఒకసారి చెక్ చేసుకోండి. తక్కువ వడ్డీ ఉన్న చోటు లోన్ పొందడం ఉత్తమం.
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios