న్యూఢిల్లీ: ఇక ముందు ప్రపంచం విద్యుత్ వాహనాల శకంగా మారనున్నది. ఈ నేపథ్యంలో ఆటోమొబైల్ సంస్థలన్నీ తమ కార్యకలాపాలను విద్యుత్ వాహనాల తయారీపై కేంద్రీకరించాయి. ఈ క్రమంలో విద్యుత్ వాహనాలను తయారు చేయడంపై ప్రముఖ విలాసవంతమైన మోటారు సైకిళ్ల తయారీ సంస్థ రాయల్ ఎన్‌ఫీల్డ్ కూడా కేంద్రీకరించింది. ఈ సంగతిని సంస్థ సీఈఓ వినోద్ దాసరి వెల్లడించారు. 

విద్యుత్ వాహనాలను ఉత్పత్తి చేయడంతో ఇప్పటి వరకు తిరోగమన వ్రుద్ధి నమోదు చేస్తున్న ఆటో సేల్స్ ఇక పుంజుకుంటాయని భావిస్తున్నట్లు  సంస్థ సీఈఓ వినోద్ దాసరి చెప్పారు. రెండంకెల వ్రుద్ధిని నమోదు చేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. విద్యుత్ వినియోగ వాహనాలను తయారు చేయడం కోసం కంపెనీ మూలధన వ్యయాలు తగ్గించబోవడం లేదని కూడా వినోద్ దాసరి వెల్లడించారు.

తమ సామర్థ్యం పెంచడంపైనా, కొత్త ఉత్పత్తులను అందుబాటులోకి తీసుకు వచ్చేందుకు, విద్యుత్ వాహనాలను తయారు చేయడంపైనే పెట్టుబడిని ఖర్చు చేస్తున్నామని తెలిపారు. ప్రపంచంలో చాలా చోట్ల గల అసెంబ్లీ యూనిట్లలోకి ఇవి చేరతాయన్నారు. యునైటెడ్ కింగ్ డంలోని సంస్థ టెక్నాలజీ సెంటర్ నుంచి ప్రపంచ వ్యాప్తంగా విద్యుత్ వాహనాలను అందుబాటులోకి తేవడానికి ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు.

రెట్రోఫిటెడ్ విత్ ఎలక్ట్రిక్ పవర్ ట్రైన్ దిశగా రాయల్ ఎన్ ఫీల్డ్ సీఈఓ వినోద్ దాసరి తెలిపారు.అయితే రాయల్ ఎన్ ఫీల్డ్ తన విద్యుత్ వాహనాల తయారీ గురించి ఇంతకుమించిన వివరాలను వినోద్ దాసరి చెప్పలేదు. బాబర్ స్టయిల్డ్ కాన్సెప్ట్ కేఎక్స్ మోటార్ సైకిల్ తొలిసారి మిలాన్ లో గతేడాది ఈఐసీఎం షోలో తొలుత ప్రదర్శించారు.