Royal Enfield:పెరిగిన రాయల్ ఎన్‌ఫీల్డ్ అమ్మకాలు.. గతేడాదితో పోలిస్తే ఎగుమతులు రెట్టింపు..
రాయల్ ఎన్ఫీల్డ్ ఐషర్ మోటార్స్ (eichers motors)లో ఒక భాగం. భారతదేశంలో రాయల్ ఎన్‌ఫీల్డ్ గత నెలలో 53,852 యూనిట్ల విక్రయాలను నమోదు చేసింది.
పర్ఫర్మేన్స్ బైక్‌లను తయారు చేసే చెన్నైకి చెందిన ద్విచక్ర వాహన తయారీ సంస్థ రాయల్ ఎన్‌ఫీల్డ్ ఏప్రిల్ నెలలో మొత్తం హోల్‌సేల్ అమ్మకాలు 17 శాతం పెరిగి 62,155 యూనిట్లకు చేరుకున్నట్లు సోమవారం ప్రకటించింది. గతేడాది ఇదే నెలలో కంపెనీ 53,298 యూనిట్ల ద్విచక్ర వాహనాలను విక్రయించింది.
రాయల్ ఎన్ఫీల్డ్ ఐషర్ మోటార్స్ (eichers motors)లో ఒక భాగం. భారతదేశంలో రాయల్ ఎన్‌ఫీల్డ్ గత నెలలో 53,852 యూనిట్ల విక్రయాలను నమోదు చేసింది, 2021 ఏప్రిల్‌లో 48,789 యూనిట్లతో పోలిస్తే సప్లయి చైన్ లో నిరంతర సవాళ్లు ఉన్నప్పటికీ 10 శాతం పెరిగింది.
పెరిగిన ఎగుమతులు
ద్విచక్ర వాహనాల ఎగుమతులు గతేడాది ఇదే నెలలో 4,509 యూనిట్ల నుంచి 8,303 యూనిట్లకు పెరిగాయి.
చిప్ కొరత ప్రభావం
సప్లయి చైన్ సమస్యలు, చిప్ కొరత కారణంగా రాయల్ ఎన్‌ఫీల్డ్ ఇటీవల మెటోర్ 350, హిమాలయన్ మోటార్‌సైకిళ్లలో ట్రిప్పర్ నావిగేషన్‌ను స్టాండర్డ్ గా తీసివేసినట్లు ప్రకటించింది. అయితే ఈ ఫీచర్ పూర్తిగా తొలగించలేదు.
స్టాండర్డ్ ఫీచర్‌గా ట్రిప్పర్ నావిగేషన్‌ను తొలగించడంతో రెండు మోడళ్ల ధర రూ.5,000 తగ్గింది. ట్రిప్పర్ నావిగేషన్ హిమాలయన్ మరియు మెటోర్ 350లో స్టాండర్డ్ కిట్‌లో భాగం. కానీ కంపెనీ ప్రముఖ బైక్ క్లాసిక్ 350లో ఆప్షనల్ గా అందించింది ఇంకా కొత్త బైక్ స్క్రమ్ 411ని కూడా విడుదల చేసింది.
పెరిగిన బుకింగ్ మొత్తం
కంపెనీ 'మేడ్-టు-ఆర్డర్' ఫ్యాక్టరీ ఫిట్టెడ్ మోడల్‌ల బుకింగ్ మొత్తాన్ని కూడా పెంచింది. ఈ మొత్తాన్ని కంపెనీ రూ.10,000 నుంచి రూ.20,000కు పెంచింది. అయితే, సాధారణ మోడల్‌కు బుకింగ్ మొత్తం గతంలో లాగానే ఉంటుంది.