Asianet News TeluguAsianet News Telugu

లాంచ్ ముందే రాయల్ ఎన్‌ఫీల్డ్ హంటర్ 350 బైక్ ఫోటోస్ లీక్.. కొత్త లుక్ అదిరింది కదా..

కంపెనీకి చెందిన ఈ అప్ కమింగ్ బైక్‌ను అందరి ముందుకు తెచ్చింది మరెవరో కాదు, ఎయిచర్(Eicher motors)మోటార్స్ సి‌ఈ‌ఓ సిద్ లాల్. అతను సోషల్ మీడియాలో వీడియోతో పాటు హంటర్ 350 బైక్  ఫస్ట్ లుక్‌ను షేర్ చేశారు. 

Royal Enfield Hunter 350 bike photos revealed before its launch see photos
Author
Hyderabad, First Published Aug 6, 2022, 11:42 AM IST

రాయల్ ఎన్‌ఫీల్డ్ హంటర్ 350 బైక్ ఇండియాలో షెడ్యూల్ చేసిన లాంచ్ కి ముందే ఫోటోస్ లీకయ్యాయి. కంపెనీకి చెందిన ఈ అప్ కమింగ్ బైక్‌ను అందరి ముందుకు తెచ్చింది మరెవరో కాదు, ఎయిచర్(Eicher motors)మోటార్స్ సి‌ఈ‌ఓ సిద్ లాల్. అతను సోషల్ మీడియాలో వీడియోతో పాటు హంటర్ 350 బైక్  ఫస్ట్ లుక్‌ను షేర్ చేశారు. పోస్ట్‌ షేర్ చేస్తూ లాల్, "నిజానికి నేను దీన్ని మీకు చూపిస్తానని అనుకోలేదు, కానీ నేనే బాస్." రాయల్ ఎన్‌ఫీల్డ్ హంటర్ 350 బైక్ ఆగస్ట్ 7 ఆదివారం అధికారికంగా లాంచ్ కానుంది. అయితే ఈ బైక్ రాయల్ ఎన్‌ఫీల్డ్‌కు చెందిన అత్యంత చౌకైన బైక్ గా చెప్పబడుతోంది. 

వీడియోలో కనిపించే హంటర్ 350 డ్యూయల్-టోన్ వైట్ అండ్ స్కై బ్లూ కలర్ లో వస్తుంది. హంటర్ 350 గురించి సిద్ లాల్ పెద్దగా సమాచారం ఇవ్వలేదు. కొన్ని నివేదికల ప్రకారం, కొత్త రాయల్ ఎన్‌ఫీల్డ్ హంటర్ 350 రెట్రో, మెట్రో, మెట్రో రెబెల్ అనే మూడు విభిన్న ట్రిమ్‌లలో అందించనుంది. రాయల్ ఎన్‌ఫీల్డ్ నుండి త్వరలో విడుదల కానున్న రెండు మోడళ్లలో హంటర్ 350 ఒకటి. మరొకటి బుల్లెట్ 350 బైక్.  

రాయల్ ఎన్‌ఫీల్డ్ హంటర్ 350  బేస్ వేరియంట్ ట్యూబ్-టైప్ టైర్లు స్పోక్ వీల్స్, సింగిల్-ఛానల్ ABS, రియర్ డ్రమ్ బ్రేక్ అండ్ హాలోజన్ టర్న్ ఇండికేటర్‌లతో వస్తుంది. అఫిషియల్ వేరియంట్‌లకు LED టర్న్ ఇండికేటర్‌లు, అల్లాయ్ వీల్స్, డ్యూయల్-ఛానల్ ABS లభిస్తాయి. సిద్ లాల్ షేర్ చేసిన వీడియో టాప్-స్పెక్ మోడల్‌లో ఒకటి. LED టర్న్ ఇండికేటర్స్ కంపెనీ అధికారికంగా అందించే అవకాశం కూడా ఉంది. ఫీచర్స్ తో పాటు పెయింట్ స్కీమ్ కూడా భిన్నంగా ఉంటుంది. 

ఫీచర్లు
రాయల్ ఎన్‌ఫీల్డ్ ట్రిప్పర్ నావిగేషన్ సిస్టమ్‌ను హంటర్ 350తో అక్సెసరిగా అందించవచ్చు. స్విచ్ గేర్ అండ్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ స్క్రామ్ 311 అండ్ మెటోర్ 350 నుండి తీసుకుంటుంది. హంటర్ 350 ఇప్పటికే క్లాసిక్ రీబార్న్ అండ్ మెటియోర్ 350లో ఉపయోగిస్తున్న J-ప్లాట్‌ఫారమ్‌పై ఆధారపడి ఉంటుంది. 

సైజు
రాయల్ ఎన్‌ఫీల్డ్ హంటర్ 350 పొడవు 2,055mm, వెడల్పు 800mm, ఎత్తు 1,055mm ఉంటుంది. కొత్త బైక్  వీల్‌బేస్ 1,370mm అంటే  క్లాసిక్ 350 అండ్ మీటోర్ 350 కంటే చిన్నది. J-ప్లాట్‌ఫారమ్ ఆధారంగా ఇతర బైక్ కంటే తక్కువ బరువు ఉన్నందున బైక్ మంచి హ్యాండిల్‌బార్‌ పొందగలదని భావిస్తున్నారు. 

ఇంజిన్ అండ్ పవర్
ఇంజిన్ కూడా 349 cc, సింగిల్-సిలిండర్, ఎయిర్-ఆయిల్ కూలింగ్‌తో లాంగ్-స్ట్రోక్ యూనిట్‌గా ఉంటుంది. ఈ ఇంజన్ గరిష్టంగా 20.2 bhp శక్తిని, 27 Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. దీనికి 5-స్పీడ్ గేర్‌బాక్స్‌ ఇచ్చారు. కంపెనీ కొత్త బైక్ స్పెసిఫికేషన్‌ల ప్రకారం ఇంజిన్  ట్యూనింగ్‌ను సవరించవచ్చు. ఇంజిన్ అండ్ ఎగ్జాస్ట్ బ్లాక్ రంగులో అందించారు. ఇంజిన్ ఒకేలా ఉన్నప్పటికీ, ఎగ్జాస్ట్ సిస్టమ్ అంతా కొత్తది.

Follow Us:
Download App:
  • android
  • ios