recall:ట్రయంఫ్ బైక్స్ కి కంపెనీ రీకాల్ జారీ.., మీ బైక్‌లో కూడా ఈ లోపం లేకపోయినా చెక్ చేయండి
ప్రసిద్ధ యూకే-ఆధారిత బైక్స్ తయారీ సంస్థ ట్రయంఫ్ లైనప్‌లో అత్యంత అందుబాటులో ఉండే బైక్ ట్రయంఫ్ ట్రైడెంట్ 660కి ఇటీవల రీకాల్ చేయబడింది. ఎందుకంటే 07 ఫిబ్రవరి 2021 నుండి 15 మే 2021 మధ్య తయారు చేయబడిన బైక్ లకు సైడ్-స్టాండ్ లోపం ఏర్పడింది.
పాపులర్ యూకే-ఆధారిత బైక్ తయారీ సంస్థ ట్రయంఫ్ లైనప్‌లో అత్యంత బడ్జెట్ బైక్ ట్రైడెంట్ 660కి సంబంధించి తాజాగా రీకాల్ జారీ చేసింది. మీరు కూడా ఈ బైక్ కొనుగోలుదారులలో ఒకరు అయితే మీరు మీ సమీప ట్రయంఫ్ డీలర్ షిప్ ను సంప్రదించవచ్చు. ఎందుకంటే 07 ఫిబ్రవరి 2021 నుండి 15 మే 2021 మధ్య తయారు చేయబడిన బైక్ లకు సైడ్-స్టాండ్ లోపం ఏర్పడింది.
యూఎస్ నేషనల్ హైవే ట్రాఫిక్ సేఫ్టీ అడ్మినిస్ట్రేషన్ జారీ చేసిన రీకాల్ డాక్యుమెంట్ ప్రకారం ట్రయంఫ్ ట్రైడెంట్ కోసం సైడ్-స్టాండ్‌లు ముడి పదార్థాలను ఉపయోగించి తయారు చేయబడ్డాయి. దీని కారణంగా ఈ బైక్ సైడ్ స్టాండ్ వంగి ఉంటుంది. బైక్ స్టాండ్ ఎక్కువగా వండి ఉండటం వల్ల పడిపోయే ప్రమాదం ఉందిని తెలిపింది.
భారతదేశంలో కూడా బైక్స్
ఈ బాక్ వీడి భాగాలను హర్యానాలోని ఫరీదాబాద్‌లో ఉన్న ఫుజిన్ కార్పొరేషన్ ప్రైవేట్ లిమిటెడ్ సరఫరా చేసింది. రీకాల్ డాక్యుమెంట్ యూఎస్ లోని 314 యూనిట్లకు సంబంధించినది మాత్రమే అయితే, భారతదేశంలో విక్రయించబడిన యూనిట్లు కూడా కంపెనీ రీకాల్ వల్ల ప్రభావితమయ్యాయి.
ట్రయంఫ్ డీలర్‌షిప్ లో ఈ లోపనికి ఎలాంటి డబ్బును ఛార్జ్ చేయకుండా భర్తీ చేస్తుంది. మరిన్ని వివరాల కోసం కస్టమర్‌లు వారి సమీప అధికారిక ట్రయంఫ్ డీలర్‌షిప్‌లో సంప్రదించవచ్చు.
ధర అండ్ ఫీచర్లు
భారతదేశంలో ఈ కంపెనీ బైక్స్ పై ధరల పెంపును కూడా ప్రకటించింది. ట్రైడెంట్‌ను రూ. 6.95 లక్షల ఎక్స్-షోరూమ్ ధరతో దేశంలో విడుదల చేశారు. ఇప్పుడు దీని ఎక్స్-షోరూమ్ ధర రూ.7.45 లక్షలు.
ఎంట్రీ-లెవల్ ట్రయంఫ్ తర్వాత కూడా ట్రైడెంట్ ఫుల్-ఎల్‌ఈడి లైటింగ్, బ్లూటూత్-రెడీ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, ట్రాక్షన్ కంట్రోల్ సిస్టమ్ (TCS) వంటి ఎన్నో ఫీచర్లను అందిస్తుంది. ఈ బైక్ సింగిల్ వేరియంట్‌లో మ్యాట్ జెట్ బ్లాక్ అండ్ మ్యాట్ సిల్వర్ ఐస్, క్రిస్టల్ వైట్, సిల్వర్ ఐస్ అండ్ డయాబ్లో రెడ్, సఫైర్ బ్లాక్‌తో నాలుగు కలర్ ఆప్షన్స్ లో అందించబడుతుంది.