Asianet News TeluguAsianet News Telugu

కొత్త రాష్ట్రపతి ద్రౌపది ముర్ము 9 కోట్ల అఫిషియల్ కార్.. ఎందుకు చాలా ప్రత్యేకమైనదో తెలుసుకోండి..

ఈ కారులో VR9-లెవెల్ బాలిస్టిక్ ప్రొటెక్షన్, 44 కాలిబర్‌ల వరకు హ్యాండ్‌గన్ షాట్‌లు, మిలిటరీ రైఫిల్ షాట్ ప్రొటెక్షన్, బాంబులు, పేలుడు పదార్థాలు ఇంకా గ్యాస్ దాడుల నుండి ప్రొటెక్షన్ ఉంటుంది. మరింత ఆకర్షణీయంగా కారులో బుల్లెట్‌ప్రూఫ్ అల్లాయ్‌లు అండ్ టైర్లు అమర్చబడి ఉంటాయి.

President Droupadi Murmu's official car, Rs 9 crore Mercedes-Benz S600 Pullman Guard armoured limousine
Author
Hyderabad, First Published Jul 27, 2022, 5:13 PM IST

భారతదేశ 15వ రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము తాజాగా ఢిల్లీలోని పార్లమెంట్ సెంట్రల్ హాల్‌లో ప్రమాణ స్వీకారం చేసిన సంగతి మీకు తెలిసిందే. అయితే ద్రౌపది ముర్ము రాష్ట్రపతి భవన్ నుండి పార్లమెంటు వరకు మెర్సిడెస్-బెంజ్ S600 పుల్‌మన్ గార్డ్ ప్రెసిడెన్షియల్ లిమోసిన్‌లో ప్రయాణించారు. 

 ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి SPG ఉపయోగించే వాహనం లాగానే భారతదేశంలోని సురక్షితమైన వాహనాలలో ఒకటిగా ఈ  వాహనం పరిగణించబడుతుంది. ఈ కారు ప్రత్యేక ఫీచర్లు మరియు ధర గురించి తెలుసుకుందాం.

Mercedes-Benz S600 Pullman Guard ఇండియాలో VVIP రవాణా కోసం అఫిషియల్ ఆర్మర్డ్ లిమోసిన్‌ పదవీకాలం ముగిసిన రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్‌కు సేవలందించింది అలాగే చాలా కాలంగా రాష్ట్రపతి కార్యాలయంలో సేవలందిస్తోంది. 

Mercedes-Benz S600 Pullman Guardని  ఇండియాలో రూ. 8.9 కోట్లకు 2015లో లాంచ్ చేశారు.  అలాగే ఆ కారు ERV (పేలుడు నిరోధక వాహనం) 2010-లెవెల్  అండ్ VR 9-లెవెల్ ప్రొటెక్షన్ పొందుతుంది. 

ఈ కారులో VR9-లెవెల్ బాలిస్టిక్ ప్రొటెక్షన్, 44 కాలిబర్‌ల వరకు హ్యాండ్‌గన్ షాట్‌లు, మిలిటరీ రైఫిల్ షాట్ ప్రొటెక్షన్, బాంబులు, పేలుడు పదార్థాలు ఇంకా గ్యాస్ దాడుల నుండి ప్రొటెక్షన్ ఉంటుంది. మరింత ఆకర్షణీయంగా కారులో బుల్లెట్‌ప్రూఫ్ అల్లాయ్‌లు అండ్ టైర్లు అమర్చబడి ఉంటాయి, అలాగే గ్యాస్ దాడి జరిగినప్పుడు కారులో ఉన్నా వారిని సజీవంగా ఉంచడానికి ఆక్సిజన్ సప్లయి కూడా ఉంది.

ప్రెసిడెన్షియల్ మెర్సిడెస్ మేబ్యాక్ S600 పుల్‌మాన్ గార్డ్ 6.0-లీటర్ V12 పెట్రోల్ ఇంజన్‌ 530hp, 830 Nm గరిష్ట శక్తి అండ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ 7-స్పీడ్ DCT, అలాగే ఎయిర్ సస్పెన్షన్, రన్-ఫ్లాట్ టైర్‌లతో ఉంటుంది. ఈ కారు 0 నుండి 100 కి.మీ వేగాన్ని 8 సెకన్ల కంటే తక్కువ సమయంలో అందుకుంటుంది. ఈ కారు టాప్ స్పీడ్ గంటకు 160 కి.మీ.

ఇందులో నలుగురు వ్యక్తులు కూర్చునే అవకాశం ఉంది. 530 లీటర్ల బూట్ స్పేస్ అలాగే 80 లీటర్ల ఫ్యుయెల్ ట్యాంక్ కెపాసిటీ ఉంది. ఈ కారును దేశంలోనే అత్యంత సురక్షితమైన కారుగా పరిగణించబడుతుంది, దీనిని దేశ ప్రథమ పౌరుడు ప్రయనించడానికి రూపొందించబడింది.

ఈ కారు 2 మీటర్ల దూరం నుండి 15 కిలోల వరకు TNT తట్టుకోగలదు.  7.62x51mm రైఫిల్ కాట్రిడ్జ్‌లను, AK-47 బుల్లెట్లు కూడా ఈ కారులోకి ప్రవేశించలేవు. ప్రధానమంత్రి నరేంద్రమోడీ సెక్యూరిటీ ఫ్లీట్‌లో Mercedes-Maybach S650ని SPG చేర్చింది, దీని ధర రూ. 12 కోట్లుగా అంచనా. 

Follow Us:
Download App:
  • android
  • ios