మీరు కారు కొనాలని ప్లాన్ చేస్తున్నారా..? బెస్ట్ మైలేజీతో రానున్న కార్లు ఇవిగో!

కొత్త జనరేషన్ మారుతి సుజుకి స్విఫ్ట్ 2024లో రోడ్లపైకి రానుంది. భారతదేశంలో రానున్న కొత్త చిన్న కార్లలో ఈ కారు ఒకటి. నివేదికలు నిజమైతే కొత్త స్విఫ్ట్  1.2L, 3-సిలిండర్ పెట్రోల్ ఇంజన్ పొందుతుంది.

Planning to buy a car? Here are the upcoming cars with good mileage!

భారతదేశంలో ఎస్‌యూ‌విలకు డిమాండ్ ఆల్ టైమ్ హైలో ఉంది. అయినప్పటికీ చిన్న కార్లు, ప్రీమియం హ్యాచ్‌బ్యాక్‌లు ఇప్పటికీ ఇండియాలో మంచి సేల్స్ చూస్తున్నాయి. రాబోయే రోజుల్లో మార్కెట్లోకి చిన్న కార్ల విభాగంలో నాలుగు కొత్త ఉత్పత్తులు  ఎంట్రీ ఇవ్వబోతున్నాయి.  ఈ నాలుగు చిన్న కార్ల  కొన్ని కీలక వివరాలు ఇక్కడ ఉన్నాయి...

కొత్త జనరేషన్ మారుతీ స్విఫ్ట్
కొత్త జనరేషన్ మారుతి సుజుకి స్విఫ్ట్ 2024లో రోడ్లపైకి రానుంది. భారతదేశంలో రానున్న కొత్త చిన్న కార్లలో ఈ కారు ఒకటి. నివేదికలు నిజమైతే కొత్త స్విఫ్ట్  1.2L, 3-సిలిండర్ పెట్రోల్ ఇంజన్ పొందుతుంది. ఈ హ్యాచ్‌బ్యాక్  కొత్త మోడల్ ARAI ధృవీకరించబడిన మైలేజీని 25 వరకు అందిస్తుంది. దేశంలోనే అత్యంత ఇంధన సామర్థ్యం కలిగిన కారుగా ఈ కారు అవతరిస్తుంది. కొత్త జనరేషన్ మారుతి డిజైర్ కూడా అదే పవర్‌ట్రెయిన్ సెటప్‌తో వస్తుంది. 

టాటా ఆల్ట్రోజ్ సిఎన్‌జి
టాటా ఆల్ట్రోజ్ సిఎన్‌జి ఈ సంవత్సరం ఆటో ఎక్స్‌పోలో ప్రదర్శించబడింది ఇంకా రాబోయే నెలల్లో సేల్స్ కి రానుంది. ఈ హ్యాచ్‌బ్యాక్ డైనా-ప్రో టెక్నాలజీతో బూస్ట్ చేయబడిన 1.2L రెవోట్రాన్ పెట్రోల్ ఇంజన్‌తో వస్తుంది. CNG మోడ్‌లో గరిష్టంగా 77bhp శక్తిని, 97Nm గరిష్ట టార్క్‌ను అందిస్తుంది. ఆల్ట్రోజ్ CNG 60 లీటర్ల సామర్థ్యంతో రెండు CNG ట్యాంకులను పొందవచ్చు. CNG ట్యాంకులు లీకేజీ అండ్ థర్మల్ సంఘటనలను నిరోధించే అధునాతన పదార్థాలతో తయారు చేయబడినట్లు కార్ల తయారీ సంస్థ పేర్కొంది. ఈ కార్ 25 kmpl కంటే ఎక్కువ మైలేజ్ అందిస్తుంది. 

కొత్త జనరేషన్ టాటా టియాగో
టాటా మోటార్స్ 2024 లేదా 2025లో టియాగో హ్యాచ్‌బ్యాక్‌కు జనరేషన్ మార్పును అందించనుంది. అల్ట్రాజ్ హ్యాచ్‌బ్యాక్ ఇంకా పంచ్ మైక్రో SUVలో ఇప్పటికే ఉపయోగించిన మాడ్యులర్ ఆల్ఫా ప్లాట్‌ఫారమ్‌పై కొత్త టియాగో ప్రయాణించనుంది. ఆల్ఫా ఆర్కిటెక్చర్ విభిన్న బాడీ స్టైల్స్, మల్టీ పవర్‌ట్రెయిన్‌లకు సపోర్ట్ ఇస్తుంది. దీని డిజైన్ ఇంకా ఇంటీరియర్ లేఅవుట్‌లో గణనీయమైన మార్పులు చేయనుంది. కొత్త టాటా టియాగో కొన్ని అధునాతన ఫీచర్లతో రావోచ్చు. 

ఎం‌జి కామెట్ EV 
ఎం‌జి మోటార్ ఇండియా  రాబోయే 2-డోర్ల ఎలక్ట్రిక్ కారుకు 'కామెట్' అని పేరు పెట్టనున్నట్లు తెలిపింది. ఇది ఇండోనేషియా వంటి మార్కెట్లలో విక్రయించబడిన రీ-బ్యాడ్జ్డ్ వులింగ్ ఎయిర్ EV. ఈ మోడల్ 2023 మధ్య నాటికి మార్కెట్‌లోకి వచ్చే అవకాశం ఉంది ఇంకా దీని ధర దాదాపు రూ.10 లక్షలు ఉండవచ్చు. MG కామెట్స్ పవర్‌ట్రెయిన్ సెటప్‌లో సుమారు 20-25kWh బ్యాటరీ ప్యాక్, ఫ్రంట్ యాక్సిల్‌పై అమర్చబడిన ఎలక్ట్రిక్ మోటారు పొందవచ్చు. ఈ చిన్న ఎలక్ట్రిక్ కారు 300 కి.మీల రేంజ్‌ను అందిస్తుంది. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios