Vespa:పాప్ మ్యూజిక్ స్టార్ డిజైన్ చేసిన పియాజియో వెస్పా లిమిటెడ్-ఎడిషన్.. దీని స్పెషాలిటీ ఏంటంటే..?
పియాజియో వెస్పా స్కూటర్ కొత్త లిమిటెడ్-ఎడిషన్ మోడల్‌ను జస్టిన్ బైబర్ ఎక్స్ ఎడిషన్ పేరుతో విడుదల చేసింది. ఈ స్కూటర్‌ను జస్టిన్ బీబర్ స్వయంగా డిజైన్ చేశారు.
ఇటాలియన్ స్కూటర్ తయారీ సంస్థ పియాజియో (Piaggio)కస్టమర్లను ప్రత్యేకమైన భాగస్వామ్యాలతో ఆహ్లాదపరుస్తుంది. గతంలో డియోర్ అండ్ జార్జియో అర్మానీ వంటి బ్రాండ్‌లతో చేతులుకలిపింది. కాంటెంపరారి పాప్ కల్చర్ అండ్ ట్రెడిషనల్ ఇటాలియన్ హస్తకళను ప్రతిబింబించే కొత్త ప్రాజెక్ట్ కోసం కంపెనీ ఇప్పుడు ప్రపంచవ్యాప్త పాప్ మ్యూజిక్ స్టార్ జస్టిన్ బీబర్‌తో భాగస్వామ్యం కుదుర్చుకుంది.
పియాజియో వెస్పా స్కూటర్ కొత్త లిమిటెడ్-ఎడిషన్ మోడల్‌ను జస్టిన్ బైబర్ ఎక్స్ ఎడిషన్ పేరుతో విడుదల చేసింది. ఈ స్కూటర్‌ను జస్టిన్ బీబర్ స్వయంగా డిజైన్ చేశారు.
జస్టిన్ బీబర్ (justin Bieber) X ఎడిషన్ మూడు ఇంజన్ ఆప్షన్స్ లో అందుబాటులోకి వచ్చింది. వీటిలో 50cc, 125cc అండ్ 150cc ఉన్నాయి. ఈ అన్నీ మోడల్స్ ఫైర్ స్టిక్కర్‌లతో ప్రత్యేకమైన వైట్ పెయింట్ స్కీమ్‌తో వస్తుంది. స్కూటర్ 12-అంగుళాల రిమ్స్‌లో కూడా అదే పెయింట్ థీమ్‌ను చూడవచ్చు.
నివేదిక ప్రకారం, పాప్ స్టార్ జస్టిన్ బీబర్ "నేను మొదటిసారి వెస్పాను నడిపాను. యూరప్, బహుశా లండన్ లేదా పారిస్‌లో ఉండవచ్చు. నేను వెస్పాను చూసి "నేను ఒకసారైనా వెస్పాని నడపాలనుకున్నాను' అని చెప్పారు.' వెస్పా నడుపుతున్నపుడు అద్భుతమైన సమయాన్ని గడిపాను, నా జుట్టు గాలిలో ఎగిరిపోతుంది స్వేచ్ఛగా, చాలా సరదాగా ఉంది." అని అన్నారు.
ఈ స్కూటర్ కొన్ని ముఖ్య ఫీచర్స్ గురించి మాట్లాడితే ఫుల్ ఎల్‌ఈడి లైటింగ్, TFT ఇన్స్ట్రుమెంట్ కన్సోల్‌ను ఉపయోగిస్తుంది, ఇంకా చాలా వివరాలను చూపుతుంది. అంతేకాకుండా ఈ లిమిటెడ్ ఎడిషన్ స్కూటర్ తో ఒక బ్యాగ్, హ్యాండ్ గ్లోవ్స్, కస్టమ్ డిజైన్‌తో కూడిన తెల్లటి హెల్మెట్‌తో సహా కొన్ని ప్రత్యేకమైన అసెసోరిస్ తో వస్తుంది.
కంపెనీ ఏప్రిల్ 18 నుండి స్కూటర్ బుకింగ్ ప్రారంభించనుంది. అలాగే దాని ధర కూడా వచ్చే వారం ప్రకటించబడుతుందని భావిస్తున్నారు. అయితే, ఈ స్కూటర్ త్వరలో భారతీయ కస్టమర్లకు విక్రయించే అవకాశం లేదు.