Asianet News TeluguAsianet News Telugu

ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ ఓనర్ ఆవేదన.. సర్వీస్ సెంటర్ ముందు బ్యానర్‌తో నిరసన..

 కొత్త వాహనాల బ్రేక్‌డౌన్‌లతో సహా నిరంతరం వస్తున్న ఓలాపై ఇటువంటి ఫిర్యాదులు ఇటీవలి కాలంలో చాలా తక్కువగా ఉన్నప్పటికీ ఇప్పుడు మళ్లీ అలాంటి ఘటనే చోటుచేసుకుంది. 
 

Ola S1 Pro electric scooter owner protests in front of service centre with banner-sak
Author
First Published Jul 20, 2023, 4:10 PM IST

ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల తయారీ సంస్థ ఓలా ఎలక్ట్రిక్ దేశంలో వాహన రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చిన ఓలా ఎస్1 అండ్  ఎస్1 ప్రో ఎలక్ట్రిక్ స్కూటర్ల పరిచయంతో మొదట్లో వార్తల్లో నిలిచింది . అయితే ఆ తర్వాత కంపెనీ పెద్ద వివాదాల్లో కూరుకుపోయింది. వివిధ ఓలా యజమానుల విచారకరమైన కథనాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. కొత్త వాహనాలు చెడిపోవడంతో సహా నిరంతరంగా వస్తున్న ఇలాంటి ఫిర్యాదుల సంఖ్య  తగ్గినప్పటికీ ఇప్పుడు మళ్లీ అలాంటి ఘటనే ఒకటి చోటుచేసుకుంది. 

దీంతో విసిగిపోయిన ఓలా కస్టమర్లు కొందరు సర్వీస్ సెంటర్ ముందు నిరసనకు దిగిన ఘటన ట్విట్టర్‌లో వైరల్ అవుతోంది. ఈ పోస్ట్‌ను ఓలా ఎలక్ట్రిక్ పేరడీ అనే ట్విట్టర్ యూజర్ నుండి షేర్ జరిగింది. ఇది ఓలా ఫ్యూచర్ ఫ్యాక్టరీ కాదని, చాలా నాసిరకం స్కూటర్లతో కూడిన సర్వీస్ సెంటర్ అని కస్టమర్లు బ్యానర్లతో సర్వీస్ సెంటర్ ముందు నిరసనకు దిగారు.

ట్వీట్‌తో పాటు ఉన్న ఫోటోలో  డజన్ల కొద్దీ ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్‌లు సర్వీస్ సెంటర్ ముందు  బ్యానర్‌తో పార్క్ చేయబడి ఉన్నాయి. ఎలక్ట్రిక్ స్కూటర్ల యజమానులు ఎదుర్కొంటున్న సమస్యలతో పాటు లోపాల గురించి సమాచారం ఈ బ్యానర్‌లో చూపెడుతుంది. బ్యాటరీ 20 శాతానికి చేరుకున్నప్పుడు స్కూటర్ దానంతట అదే ఆగిపోతుందని, ఆపై మనం మన గమ్యస్థానానికి హాయిగా పోవచ్చని బ్యానర్ లో పేర్కొంది. 

అలాగే కొన్ని రోజులుగా ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ సర్వీస్‌ సెంటర్‌లో పడిఉన్నట్లు ఫిర్యాదులు వస్తున్నాయి. ఓక ఓలా  స్కూటర్ యజమాని సరదాగా దీనిని 'పార్కింగ్ మోడ్' అని పేర్కొన్నాడు. అలాగే, ఓలా సర్వీస్ సెంటర్ నుండి తనకు ఎలాంటి మెసేజ్ రాలేదని, సర్వీస్ ఎగ్జిక్యూటివ్ తన కాల్‌లకు సమాధానం ఇవ్వడం లేదని చెప్పాడు. అతను ఎలక్ట్రిక్ స్కూటర్‌లోని అలైన్‌మెంట్ బుష్‌ను ఐదుసార్లు మార్చినట్లు కూడా చెప్పాడు. ఏది ఏమైనప్పటికీ, ఇది ఏ వాహన యజమానికైనా చాలా బాధాకరమైన పరిస్థితి. 

దేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన ఎలక్ట్రిక్ స్కూటర్ కంపెనీలలో ఓలా ఎలక్ట్రిక్ ఒకటి. దీని EVలు ఖచ్చితంగా అద్భుతమైన పనితీరు ఇంకా పరిధిని అందిస్తాయి. ఇది చాలా మంది వినియోగదారులకు ప్రధాన ఆకర్షణ. దేశంలోని  ద్విచక్ర వాహన తయారీదారుల ఆధిపత్యాన్ని సవాలు చేస్తూ ఓలా మార్కెట్‌ను లక్ష్యంగా చేసుకుంది. అయితే, ఇటీవలి కాలంలో ఎలక్ట్రిక్ స్కూటర్ల నాణ్యతపై ఎక్కువ మంది వినియోగదారులు తమ ఆందోళనలను వ్యక్తం చేయడంతో కంపెనీ చాలా విమర్శలకు గురైంది. 

 

Follow Us:
Download App:
  • android
  • ios