అతితక్కువ వడ్డీ రేటుతో స్కూటర్లను అందిస్తున్న ఓలా ఎలక్ట్రిక్.. జీరో డౌన్ పేమెంట్‌ కూడా ఆఫర్ చేస్తున్న కంపెనీ

IDFC ఫస్ట్ బ్యాంక్, L&T ఫైనాన్షియల్ సర్వీసెస్‌ సహా ప్రముఖ ఫైనాన్సింగ్ సంస్థల భాగస్వామ్యంతో జీరో డౌన్ పేమెంట్‌తో 60 నెలల కాలవ్యవధికి కేవలం 6.99% వడ్డీ రేటుతో ఓలా స్కూటర్ ని ఇంటికి తీసుకువెళ్లే సదుపాయం కల్పిస్తుంది ఓలా ఎలక్ట్రిక్. 

ola  electric   is offering lowest interest rates at 6.99% for a tenure of 60 months at zero down payment on electric  scooters-sak

బెంగళూరు, జూన్ 16, 2023: భారతదేశపు అతిపెద్ద EV కంపెనీ అయిన ఓలా ఎలక్ట్రిక్ 2W సెగ్మెంట్‌లో  అత్యుత్తమ S1 స్కూటర్ లైనప్ అండ్ లాభదాయకమైన ఫైనాన్సింగ్ ఆప్షన్‌లతో EV స్వీకరణను ముందుండి నడుస్తుంది. IDFC ఫస్ట్ బ్యాంక్, L&T ఫైనాన్షియల్ సర్వీసెస్‌ సహా ప్రముఖ ఫైనాన్సింగ్ సంస్థల భాగస్వామ్యంతో జీరో డౌన్ పేమెంట్‌తో 60 నెలల కాలవ్యవధికి కేవలం 6.99% వడ్డీ రేటుతో ఓలా స్కూటర్ ని ఇంటికి తీసుకువెళ్లే సదుపాయం కల్పిస్తుంది ఓలా ఎలక్ట్రిక్. దీనితో ఓలా ఎలక్ట్రిక్ EVలను మరింత సరసమైనదిగా ఇంకా అందరికీ అందుబాటులో ఉండేలా చేయడం ద్వారా #EndICEAgeకి తన నిబద్ధతను నొక్కి చెప్తుంది. కస్టమర్లు ఇప్పుడు పరిశ్రమ   అతి తక్కువ ప్రతినెల EMIలతో ఇంకా జీరో డౌన్ పేమెంట్‌తో ఓలా స్కూటర్‌ కి యజమాని అవ్వవచ్చు.

ఓలా చీఫ్ బిజినెస్ ఆఫీసర్ అంకుష్ అగర్వాల్ మాట్లాడుతూ: “మార్కెట్ లీడర్‌గా మేము ప్రముఖ ఫైనాన్సింగ్ భాగస్వాములతో భాగస్వామ్యం ఏర్పరచుకున్నాము. టైర్ 1 లోనే కాకుండా టైర్ 2 ఇంకా టైర్ 3 నగరాల్లో కూడా అత్యంత లాభదాయకమైన ఫైనాన్సింగ్ అప్షన్స్ అందిస్తున్నాము. భారతదేశం EV 2W స్వీకరణకు అపారమైన సామర్థ్యాన్ని కలిగి ఉంది.  మా ఫైనాన్సింగ్ ఆఫర్‌లు పరిశ్రమలో కొత్త బెంచ్‌మార్క్‌లను ఏర్పాటు చేస్తున్నాయి. ఈ ఫైనాన్సింగ్ అప్షన్స్ తో EVని సొంతం చేసుకునేందుకు అయ్యే ఖర్చు ఇప్పుడు ఏదైనా ICE వాహనాన్ని కొనడానికి అయ్యేఖర్చుతో పోలిస్తే సగం. మేము విధ్యుత్ వాహనాల స్వీకరణను వేగవంతం చేయడానికి ఇంకా  వాటిని అందరికీ ప్రధాన స్రవంతి ఎంపికగా చేయడానికి కట్టుబడి ఉన్నాము," అని అన్నారు. 

ఓలా యాప్ ద్వారా కొనుగోలు  చేసే ముందు ఫైనాన్సింగ్ ఆప్షన్‌లపై పూర్తి  సమాచారం కోసం కస్టమర్‌లు సమీప అనుభవ కేంద్రానికి (ఎక్స్పీరియన్స్ సెంటర్) వెళ్ళవచ్చు. ఈ ఫైనాన్సింగ్ ఆప్షన్స్ ను ఆన్లైన్ ఇంకా  ఆఫ్‌లైన్‌లో కూడా ఎంచుకోవచ్చు. ఓలా ప్రస్తుతం 700+ అనుభవ కేంద్రాలతో భారతదేశపు అతిపెద్ద D2C ఆటోమొబైల్ రిటైల్ నెట్‌వర్క్‌ను  ఉంది ఇంకా ఆగస్టులో 1000వ ECని ప్రారంభించేందుకు సన్నద్ధమవుతోంది. 

ఓలా  S1 Pro, S1 అండ్ S1 Air లతో కూడిన S1 లైనప్ అత్యాధునిక సాంకేతికత ఇంకా  అసమానమైన పనితీరుతో కూడిన సొగసైన ఇంకా మినిమలిస్ట్ డిజైన్‌ ఉంది. కంపెనీ ఇప్పుడు వరుసగా మూడు త్రైమాసికాలుగా 2W EV విభాగంలో అమ్మకాల్లో అగ్రస్థానంలో ఉంది.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios