Asianet News TeluguAsianet News Telugu

సేల్స్ లో ఓలా ఎలక్ట్రిక్ అదుర్స్.. 400% వృద్ధితో 30% మార్కెట్ వాటా సొంతం..

ఓలా సరికొత్త S1 స్కూటర్ పోర్ట్‌ఫోలియోకి అద్భుతమైన స్పందన  లభిస్తుంది. లాంచ్ చేసిన రెండు వారాల్లోనే 75,000 కంటే ఎక్కువ బుకింగ్‌లను అందుకుంది. ఓలా ఫ్యూచర్‌ ఫ్యాక్టరీ ఉత్పత్తిని పెంచడానికి ఇంకా  మార్కెట్ డిమాండ్‌ను తీర్చడానికి మూడు షిఫ్ట్‌లలో పనిచేస్తుంది. 

Ola Electric continues to dominate EV 2W segment and maintained market leadership for last 1 year-sak
Author
First Published Aug 31, 2023, 6:38 PM IST

బెంగళూరు ఆగస్ట్ 31, 2023: భారతదేశపు అతిపెద్ద ఎలక్ట్రిక్ వాహన కంపెనీ  ఓలా ఎలక్ట్రిక్ EV 2W విభాగంలో గత సంవత్సరం పాటుగా మార్కెట్ లీడర్ గా  ఆధిపత్యాన్ని కొనసాగిస్తోంది. ఆగస్ట్‌లో 19,000 యూనిట్ల అమ్మకాలను (వాహన్ డేటా ప్రకారం) నమోదు చేసుకొని 400% Y-o-Y వృద్ధిని సాధించింది అలాగే 30% మార్కెట్ వాటాను సొంతం చేసుకుంది.

ఆగస్టు లో ఓలా Gen-1 నుండి Gen-2కి ట్రాన్సఫరేషన్ చెందగా ఈ కాలంలో కంపెనీ తయారీ సామర్థ్యాన్ని కూడా విస్తరించింది. ఓలా చీఫ్ బిజినెస్ ఆఫీసర్ అంకుష్ అగర్వాల్ మాట్లాడుతూ, “ఆగస్టులో మా పోర్ట్‌ఫోలియోను అన్ని ప్రసిద్ధ ప్రైస్ పాయింట్‌లలో అందిస్తూ ఐదు స్కూటర్‌లకు విస్తరించాము. సరికొత్త S1 లైనప్ EV స్వీకరణను వేగవంతం చేయడమే కాకుండా  గ్రీన్ మొబిలిటీ వైపు భారతదేశ ప్రయాణాన్ని కూడా వేగవంతం చేస్తుంది. పండుగల సీజన్‌ వస్తుండడంతో, ఈ కాలంలో మంచి అమ్మకాలు జరుగుతాయని మేము ఆశిస్తున్నాము ఇంకా అధిక డిమాండ్ కారణంగా EV పరిశ్రమ ఒక ఇన్‌ఫ్లెక్షన్ పాయింట్‌ను చూస్తుందని మేము ఆశిస్తున్నాము అన్ని అన్నారు. 

ఓలా సరికొత్త S1 స్కూటర్ పోర్ట్‌ఫోలియోకి అద్భుతమైన స్పందన  లభిస్తుంది. లాంచ్ చేసిన రెండు వారాల్లోనే 75,000 కంటే ఎక్కువ బుకింగ్‌లను అందుకుంది. ఓలా ఫ్యూచర్‌ ఫ్యాక్టరీ ఉత్పత్తిని పెంచడానికి ఇంకా  మార్కెట్ డిమాండ్‌ను తీర్చడానికి మూడు షిఫ్ట్‌లలో పనిచేస్తుంది. ఓలా అన్యువల్ ఫ్లాగ్‌షిప్ ఈవెంట్‌లో భాగంగా ఆవిష్కరించిన S1 ప్రో, S1 ఎయిర్, S1X+, S1X (3kWh), S1X (2kWh) సరికొత్త ఇంకా  అధునాతనమైన Gen-2 ప్లాట్‌ఫారమ్‌పై నిర్మించబడ్డాయి.

S1 ప్రో   
 రూ.1,47,499 ధరతో Gen-2 S1 Pro ఇప్పుడు ట్విన్-ఫోర్క్ టెలిస్కోపిక్ ఫ్రంట్ సస్పెన్షన్,  ఫ్లాట్ ఫ్లోర్‌బోర్డ్‌తో పాటు మెరుగైన 195 కి.మీ మైలేజ్,  120 కి.మీ/గం  స్పీడ్  అందిస్తోంది. S1 Pro Gen 2 కోసం సేల్స్ విండో ఇప్పుడు తెరవబడింది, అయితే డెలివరీలు సెప్టెంబర్ మధ్యలో ప్రారంభమవుతాయి.

S1 ఎయిర్
రూ.1,19,999 ధరతో S1 ఎయిర్  3 kWh బ్యాటరీ కెపాసిటీ, 6kW  పవర్, 151 కి.మీ సర్టిఫైడ్ రేంజ్, 90 km/hr టాప్ స్పీడ్ అందిస్తుంది. S1 ఎయిర్ డెలివరీలు తాజాగా 100 కంటే ఎక్కువ నగరాల్లో ప్రారంభమయ్యాయి.

ICE-కిల్లర్ S1X
ఓలా ఎలక్ట్రిక్   ICE-కిల్లర్ స్కూటర్ S1Xని అన్ని రకాల వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా S1 X+, S1 X (2kWh), S1 X (3kWh) వంటి మూడు వేరియంట్‌లలో పరిచయం చేసింది. S1 X+ (3kWh), S1 X (3kWh) రెండూ శక్తివంతమైన 6kW మోటార్‌, 3kWh బ్యాటరీ, 151 కి.మీ రేంజ్, 90 km/h టాప్ స్పీడ్ తో వేగంతో రానున్నాయి. S1 X (2kWh) కూడా పవర్ ఫుల్  6kW మోటార్‌తో వస్తుంది ఇంకా  91 కి.మీ రేంజ్, 85 km/h టాప్ స్పీడ్ వేగాన్ని ఉంటుంది.

S1 X+ 
రూ.109,999కి  S1 X+  సేల్స్ ద్వారా అందుబాటులో ఉంది. డెలివరీలు వచ్చే నెలలో ప్రారంభమవుతాయి. S1 X (3kWh) అండ్  S1 X (2kWh)  ప్రీ-రిజర్వేషన్ విండో రూ. 999 తో ప్రస్తుతం కొనసాగుతుండగా, వాటి డెలివరీలు డిసెంబర్‌లో ప్రారంభం అవుతాయి. S1 X (3kWh), S1 X (2kWh) స్కూటర్‌లు ఆకర్షణీయమైన రూ. 99,999 ఇంకా రూ. 89,999 వద్ద అందుబాటులో ఉన్నాయి.

Follow Us:
Download App:
  • android
  • ios