Asianet News TeluguAsianet News Telugu

ఈ హోండా కారు కూడా ఫుల్ సేఫ్.. యూరో ఎన్‌సి‌ఏ‌పి క్రాష్ టెస్ట్‌లో 5-స్టార్ రేటింగ్..

టెస్టింగ్ కోసం ఉపయోగించిన మోడల్ ఇండియాలో విక్రయించే మోడల్ కాదని గమనించాలి. ఎందుకంటే పరీక్షించిన మోడల్‌లో మొత్తం 11 ఎయిర్‌బ్యాగ్‌లు స్టాండర్డ్‌గా ఉన్నాయి

Now this Honda car becomes safest, gets 5-star rating in Euro NCAP crash test
Author
First Published Nov 17, 2022, 5:46 PM IST

ఆటోమోబైల్ కంపెనీ హోండా కొత్త కార్ హోండా సివిక్ ఇ:హెచ్‌ఇవి యూరో ఎన్‌సిఎపి సేఫ్టీ టెస్టింగ్ లాస్ట్ రౌండ్ లో  5-స్టార్ రేటింగ్‌ను సాధించింది. అడల్ట్  ప్యాసెంజర్ సేఫ్టీలో హోండా e:HEV ఫ్రంటల్ ఇంపాక్ట్‌లో మొత్తం 16 పాయింట్లలో 13.6 పాయింట్లను, సైడ్ ఇంపాక్ట్‌లో ఫుల్ 16 పాయింట్లను స్కోర్ చేసింది.

నివేదికల ప్రకారం ఫ్రంటల్ ఆఫ్‌సెట్ టెస్ట్ లో  సివిక్ ప్యాసింజర్ కంపార్ట్‌మెంట్ స్థిరంగా ఉంది. డ్రైవర్ ఛాతీకి సేఫ్టీ రేటింగ్ వీక్ ఉందని రేట్ చేయగా, డ్రైవర్ ఇంకా ప్యాసెంజర్ మోకాలు సేఫ్టీ బెస్ట్ ఉన్నట్లు వెల్లడించింది.

టెస్టింగ్ కోసం ఉపయోగించిన మోడల్ ఇండియాలో విక్రయించే మోడల్ కాదని గమనించాలి. ఎందుకంటే పరీక్షించిన మోడల్‌లో మొత్తం 11 ఎయిర్‌బ్యాగ్‌లు స్టాండర్డ్‌గా ఉన్నాయి, ఇందులో ముందు ఉండే ఇద్దరి ప్రయాణికులకు మోకాలి ఎయిర్‌బ్యాగ్‌లు ఉంటాయి. సైడ్ ఇంపాక్ట్  సమయంలో ఎయిర్‌బ్యాగ్‌లు గాయాన్ని తగ్గించడానికి వెనుక సీటు ప్రయాణీకుల రక్షణ కోసం ఇచ్చారు.

భారతదేశంలో విక్రయించే సివిక్‌ కారుకు కేవలం 6 ఎయిర్‌బ్యాగ్‌లు మాత్రమే లభిస్తాయి. సైడ్ ఇంపాక్ట్ సమయంలో డ్రైవర్ ఇంకా ఫ్రంట్ ప్యాసింజర్ మధ్య ఆక్సిడెంట్ ప్రభావాన్ని నివారించడానికి మొదటి సారిగా అందించిన ఫ్రంట్ సెంటర్ ఎయిర్‌బ్యాగ్లు ఇవి.  11వ జనరేషన్ సివిక్‌లో ఫ్రంట్ డోర్ స్టిఫెనర్‌లు, బ్యాక్ వీల్స్ ఆర్చ్ ఫ్రేమ్‌లు ఉంటాయి.

చైల్డ్ ఆక్యుపెంట్ ప్రొటెక్షన్ విభాగంలో కూడా కారు ఫ్రంటల్ ఇంపాక్ట్‌లో 16కి 13, లాటరల్ ఇంపాక్ట్‌లో 16కి 16 స్కోర్ చేసింది. కొత్త సివిక్ వైడ్ 100-డిగ్రీల వ్యూ కెమెరా, ఫార్వర్డ్ కొలిషన్ వార్నింగ్ సిస్టమ్‌ను కూడా పొందుతుంది. Euro NCAP ద్వారా గరిష్టంగా 5-స్టార్ రేటింగ్‌ను పొందిన సివిక్ CR-V, జాజ్ వంటి కార్ల ఫ్యామిలీలో హోండా చేరింది.
 

Follow Us:
Download App:
  • android
  • ios