Asianet News TeluguAsianet News Telugu

న్యూ మారుతి బాలెనో బుకింగ్స్ షురూ...కేవలం రూ.11,000 చెల్లిస్తే సరి

వినియోగదారుల ఆకాంక్షలకు అనుగుణంగా సరికొత్త మార్పులతో మార్కెట్లోకి వచ్చేందుకు సిద్ధమైన మారుతి సుజుకి బాలెనో ఆర్ఎస్ ఫేస్ లిఫ్ట్ మోడల్ బుకింగ్స్ మొదలయ్యాయి. కొనుగోలు చేయాలని భావించే వారు రూ.11,000 చెల్లించి బుకింగ్ చేసుకోవచ్చు. 

New baleno facelift Bookings Open at Rs 11,000
Author
New Delhi, First Published Jan 23, 2019, 11:07 AM IST

న్యూఢిల్లీ: దేశీయ ప్రయాణికుల తయారీ సంస్థ మారుతి సుజుకి (ఎంఎస్ఐ) సరికొత్త మోడల్ ప్రీమియం హ్యాచ్ బ్యాక్ బాలెనో ఫేస్ లిఫ్ట్ కారు బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. మారుతి న్యూ బాలెనో ఫేస్ లిఫ్ట్ మోడల్ కారు కావాల్సిన వారు రూ.11,000 చెల్లిస్తే సరి. ఈ నెలాఖరులో గానీ, వచ్చేనెల ప్రారంభంలో గానీ బాలెనో ఫేస్ లిఫ్ట్ మోడల్ కారును మార్కెట్లోకి విడుదల చేయనున్నది. నూతన మోడల్ బాలెనో ఫేస్ లిఫ్ట్ కారు అగ్రెస్సివ్ ఫ్రంట్ డిజైన్‌తో రూపొందించుకున్నారు. 

స్పీడ్ అలర్ట్ సిస్టమ్‌తోపాటు పలు అదనపు భద్రతా ఫీచర్లను అందుబాటులోకి తెస్తోంది మారుతి బాలెనో ఫేస్ లిఫ్ట్. కో- డ్రైవర్ సీటుకు బెల్టు రిమైండర్, రేర్ పార్కింగ్ అసిస్ట్ సెన్సర్లు అదనంగా జోడించారు. స్టాండర్డ్ డ్యూయల్ ఎయిర్ బ్యాగులు, చైల్డ్ సీట్ రిస్ట్రెయింట్ సిస్టం (ఐఎస్ఓఎఫ్ఐఎక్స్), ప్రీ- టెన్షనర్, ఫోర్స్ లిమిటర్ సీట్ బెల్ట్స్, ఏబీఎస్, ఈబీడీ తదితర ఫీచర్లు కూడా ఉన్నాయి. 

1.0 లీటర్‌ పెట్రోలు బూస్టర్‌ జెట్‌ టర్బో ఇంజీన్‌తో మరింత శక్తివంతంగా ఈ కారును  లాంచ్‌ చేయనుంది. ఫ్రంట్‌ బంపర్‌లో మార్పులతోపాటు పాత హెచ్‌ఐడీ ల్యాంప్స్‌కు బదులుగా కొత్త ఎల్‌ఈడీ హెడ్‌ ప్రొజెక్టర్‌ ల్యాంప్స్‌  అమర్చింది. అలాగే రియర్‌ డిస్క్‌ బ్రేక్‌లను, బ్లాక్‌ అండ్‌ సిల్వర్‌ డ్యుయల్‌ టోన్‌ కొత్త అల్లోయ్‌ వీల్స్‌ను కొత్తగా జోడించింది. డార్క్‌ గ్రే కలర్‌లో ఇంటీరియర్‌ డిజైన్‌ను ఇచ్చింది. దీంతోపాటు స్మార్ట్‌ప్లే ఇన్‌ఫోటైన్‌మెంట్‌ సిస్టంను స్మార్ట్‌ఫోన్‌ నావిమాప్స్‌ నావిగేషన్‌ ఆప్‌తో అప్‌డేట్‌  చేసింది. వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా సరికొత్త అప్‌డేట్స్‌తో మార్కెట్లోకి రానున్న మారుతి బాలెనో ఆర్‌ ఎస్‌ ఫేస్‌లిఫ్ట్‌ వెర్షన్‌ ధర విషయానికి వస్తే..రూ.8.53లక్షలుగా ఉండవచ్చని అంచనా.

2016 నుంచి భారతదేశంలో అత్యధికంగా అమ్ముడు పోతున్న కార్ల మోడళ్లలో బాలెనో ఒకటి. 2018-19 తొలి తొమ్మిది నెలల విక్రయాల్లో 14 శాతం వృద్ధిరేటు నమోదైంది. కేవలం 38 నెలల కాలంలోనే ఐదు లక్షల కార్లు విక్రయంతో రికార్డు నెలకొల్పింది. మార్కెట్లోకి ఆవిష్కరించినప్పటి నుంచి ఇప్పటి వరకు బాలెనో మోడల్ కార్లు 5.2 లక్షల యూనిట్లు అమ్ముడు పోయాయి. 

మొబిలిటీ ఇన్నోవేషన్‌కు మారుతి ప్రోత్సాహం 
ఆటోమొబైల్‌, మొబిలిటీ రంగంలో నూతన ఆవిష్కరణ (ఇన్నోవేషన్‌)ల ప్రోత్సాహానికి మారుతి సుజుకీ ఇండియా ముందుకొచ్చింది. ఇందుకు మొబిలిటీ అండ్‌ ఆటోమొబైల్‌ ఇన్నోవేషన్‌ లాబ్‌ (ఎంఏఐఎల్‌) కార్యక్రమం ప్రారంభించింది. దీంతో ఇన్నోవేటివ్‌, అత్యాధునిక సొల్యూషన్లను అందించే స్టార్టప్‌లను గుర్తించనున్నది. భవిష్యత్‌కు అనుగుణంగా ఉండటమే కాక వినియోగదారులకు ప్రయోజనం కలిగించే వాటికి కంపెనీ ప్రాధాన్యం ఇవ్వనుంది. దేశీయ ఆటోమొబైల్‌ పరిశ్రమ క్రమంగా ఎదుగుతోందని, ఈ నేపథ్యంలో ఇన్నోవేషన్‌ సంస్కృతిని ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని మారుతి సుజుకీ ఇండియా మేనేజింగ్‌ డైరెక్టర్‌, సీఈఓ కెనిచి అయుకవా తెలిపారు. 

Follow Us:
Download App:
  • android
  • ios