Asianet News TeluguAsianet News Telugu

2022 Bajaj Pulsar N160: మార్కెట్లోకి సరికొత్త పల్సర్ బైక్.. ధర ఎంతంటే..!

భారత మార్కెట్లో Bajaj Pulsar N160 మోటార్ సైకిల్ విడుదల అయింది. రూ. 1 లక్ష 22 వేల నుంచి దీని ధరలు ప్రారంభమవుతున్నాయి. ఎలాంటి విశేషాలు ఉన్నాయి, మైలేజ్ ఎంత ఇస్తుంది? తదితర విషయాల కోసం ఈ స్టోరీ చదవండి.
 

New Bajaj Pulsar N160 launched at Rs 1.23 lakh
Author
Hyderabad, First Published Jun 23, 2022, 11:37 AM IST

ద్విచక్ర వాహనాల తయారీదారు బజాజ్ ఆటో భారత మార్కెట్లో సరికొత్త Pulsar N160ని విడుదల చేసింది. ఇది నేక్డ్ వెర్షన్ ప్లాట్‌ఫారమ్‌పై రూపొందించిన స్ట్రీట్-ఫైటర్ బైక్. ఇలాంటి క్వార్టర్-లీటర్ మోటార్‌సైకిల్ ప్లాట్‌ఫారమ్ గతేడాది పల్సర్ 250 లాంచ్‌తో పరిచయం అయింది. సరికొత్త సరికొత్త బజాజ్ పల్సర్ N160 రెండు వేరియంట్లలో లభించనుంది. సింగిల్-ఛానల్ ABS వేరియంట్ ధర ఎక్స్-షోరూమ్ వద్ద రూ. 1.22 లక్షలు కాగా, డ్యూయల్-ఛానల్ ABS వేరియంట్ ధరను రూ. 1.27 లక్షలుగా నిర్ణయించారు.

డిజైన్ పరంగా Bajaj Pulsar N160 పూర్తిగా పల్సర్ N250ని పోలి ఉంటుంది. ఈ బైక్ స్టెప్ సీట్, అండర్ బెల్లీ ఎగ్జాస్ట్‌తో అగ్రెసివ్ డిజైన్‌ను కలిగి ఉంది. ఈ మోటార్‌సైకిల్‌లో ట్విన్ LED DRLలతో కూడిన ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్, షార్ప్ ట్యాంక్ ఎక్స్‌టెన్షన్‌లు, ఇంజన్ రక్షణ కోసం అండర్‌బెల్లీ కౌల్, మల్టీ-స్పోక్ అల్లాయ్ వీల్స్ అలాగే LED టెయిల్ ల్యాంప్ ఉన్నాయి.

ఇంజన్, ఇతర స్పెసిఫికేషన్లు

పల్సర్ N160లో 164.82cc సామర్థ్యం కలిగిన సింగిల్-సిలిండర్ 4-స్ట్రోక్ ఆయిల్-కూల్డ్ ఫ్యూయల్-ఇంజెక్టెడ్ ఇంజన్ అమర్చారు. దీనిని 5-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్‌తో జత చేశారు. ఈ ఇంజన్ 16 BHP వద్ద 14.65 Nmని అందిస్తుంది. ఈ బైక్ ఒక లీటరుకు సుమారు 48 కిమీ మైలేజ్ అందించగలదు.

పల్సర్ N160 ముందు వైపున టెలిస్కోపిక్ ఫోర్క్ సస్పెన్షన్ , వెనుక వైపు మోనోషాక్‌ అబ్జర్ కలిగి ఉంది. బ్రేకింగ్ సెటప్‌లో 300 మిమీ ఫ్రంట్ డిస్క్, వెనుక వైపు 230 మిమీ డిస్క్ బ్రేక్ ఉన్నాయి. కలర్స్ విషయానికి వస్తే.. డ్యూయల్-ఛానల్ ABS వేరియంట్ ఏకైక బ్రూక్లిన్ బ్లాక్ షేడ్‌లో మాత్రమే లభిస్తుండగా, సింగిల్-ఛానల్ ABS మోడల్ మాత్రం కరేబియన్ బ్లూ, రేసింగ్ రెడ్, బ్రూక్లిన్ బ్లాక్ అనే మూడు రంగుల షేడ్స్‌లో అందుబాటులో ఉంటుంది.
 

Follow Us:
Download App:
  • android
  • ios