ప్రముఖ కార్ల తయారీ కంపనీకి షాక్... 24 గంటల్లో రూ.100కోట్లు చెల్లించాలని ఆదేశం

ప్రముఖ కార్ల తయారీ కంపనీ వోక్స్ వ్యాగన్ కు జాతీయ హరిత  ట్రిబ్యునల్ షాకిచ్చింది. పర్యావరణానికి హాని కలిగించడమే కాకుండా...తమ ఆదేశాలను భేఖాతరు చేసినందుకు గాను కంపనీపై ఎన్‌జీటి సీరియస్ అయ్యింది. కేవలం 24 గంటల్లోగా రూ.100  కోట్లను కాలుష్య నియంత్రణ మండలి ఖాతాలో జమచేయాల్సిందిగా ఈ జర్మనీ కంపనీకి హరిత ట్రిబ్యునల్ ఆదేశించింది. 
 
National Green Tribunal asks Volkswagen to deposit rs.100 cr  by tomorrow

ప్రముఖ కార్ల తయారీ కంపనీ వోక్స్ వ్యాగన్ కు జాతీయ హరిత  ట్రిబ్యునల్ షాకిచ్చింది. పర్యావరణానికి హాని కలిగించడమే కాకుండా...తమ ఆదేశాలను భేఖాతరు చేసినందుకు గాను కంపనీపై ఎన్‌జీటి సీరియస్ అయ్యింది. కేవలం 24 గంటల్లోగా రూ.100  కోట్లను కాలుష్య నియంత్రణ మండలి ఖాతాలో జమచేయాల్సిందిగా ఈ జర్మనీ కంపనీకి హరిత ట్రిబ్యునల్ ఆదేశించింది. 

వోక్స్ వ్యాగన్ కంపనీకి చెందిన  డీజిల్ కార్లు పర్యావరణానికి తీవ్ర హాని కల్గిస్తున్నాయంటూ హరిత్ ట్రిబ్యునల్ లో గతంలోఓ కేసు నమోదయ్యింది. దీనిపై విచారించిన ట్రిబ్యునల్ కాలుష్య ఉద్గారాలను వెదజల్లేలా ఈ కంపనీ కార్లలో పరికరాలున్నట్లు నిర్ధారించింది. దీంతో గతేడాది ఆ కంపనీకి రూ.100 కోట్ల జరిమానా విధిస్తూ ట్రిబ్యునల్ తీర్పు వెలువరించింది. 

అయితే ఈ ఆదేశాలను పట్టించుకోని కంపనీ జరిమానాను చెల్లించకపోవడంతో ఎన్‌జిటి ఆగ్రహం వ్యక్తం చేసింది. దీనిపై ఇవాళ ట్రిబ్యునల్ విచారణ జరపగా...జరిమానా చెల్లించడానికి తమకు మరింత సమయం కావాలని వోక్స్ వ్యాగన్ కంపనీ కోరింది. అయితే అందుకు ససేమిరా ఒప్పుకోని ట్రిబ్యునల్ శుక్రవారం(రేపు) సాయంత్రం 5గంటల కల్లా కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి ఖాతాలో రూ. 100 కోట్ల జమ చేయాలని ఎన్‌జీటీ ఛైర్‌పర్సన్‌ ఆదర్శ్‌ కుమార్‌ గోయల్‌ నేతృత్వంలోని ధర్మాసనం ఆదేశించింది. 
 
Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios