మైఖేల్ జాక్సన్ లైఫ్ స్టయిల్, ఇల్లు, కార్లు, సంపాదన గురించి తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే..

మైఖేల్ జాక్సన్ అతని కాలంలో ఒక ఫ్యాషన్ ఐకాన్. అతని మరణం తర్వాత కూడా ఆ ట్రెండీ స్టైల్స్‌ను ప్రపంచం నలుమూలల నుండి ఎంతో మంది అభిమానులు అనుసరిస్తున్నారు.

Michael Jackson Lifestyle House Cars Net Worth will blow your mind

మైఖేల్ జాక్సన్ ఈ పేరు వినని వారు, తెలియని వారు ఎవరు ఉండరు. ఇప్పటికీ మైఖేల్ జాక్సన్ ని ఒక గొప్ప పాప్ స్టార్‌గా పరిగణిస్తారు, 1958 ఆగస్టు 29న జన్మించిన మైఖేల్ జాక్సన్  గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ ప్రకారం ఇప్పటికీ ఆల్ టైమ్ ఎంటర్టైన్మెంట్ రారాజుగా పరిగణించబడతాడు. మ్యూజిక్, డాన్స్, ఫ్యాషన్ రంగాల్లో ఆయన విశేష కృషి చేశారు. అయితే 25  జూన్ 2009న  మైఖేల్ జాక్సన్ మరణించాడు. కానీ మరణానికి కారణం ఇప్పటి వరకు మిస్టరీగానే ఉంది. కొందరు గుండెపోటు వల్ల మరికొందరు ఇతర కారణాల వల్ల జరిగిందని అంటున్నారు.

ఈ పాప్ స్టార్ సంపాదన దాదాపు $500 మిలియన్లుగా అంచనా. ఇందులో రాయల్టీలు (సోలో రికార్డింగ్‌లు అలాగే మ్యూజిక్ వీడియోలు),  మ్యూజిక్ ఈవెంట్స్,  టాప్ బ్రాండ్‌ల ప్రోమోషన్స్  ఉన్నాయి. కేవలం మ్యూజిక్ ద్వారా మైఖేల్ జాక్సన్ నికర సంపాదన బిలియన్ మార్కును దాటిందని కొందరు ట్రేడ్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అయితే అవి కేవలం ఊహాగానాలు మాత్రమే.  
మైఖేల్ జాక్సన్ అతని కాలంలో ఒక ఫ్యాషన్ ఐకాన్. అతని మరణం తర్వాత కూడా ఆ ట్రెండీ స్టైల్స్‌ను ప్రపంచం నలుమూలల నుండి ఎంతో మంది అభిమానులు అనుసరిస్తున్నారు. మైఖేల్ జాక్సన్ ఇంట్లో  ఫోర్డ్ ఎకనోలిన్ వాన్ (1993 మోడల్), GMC హై సియెర్రా ఫైర్ ట్రక్ (1986 మోడల్), GMC జిమ్మీ (1988 మోడల్), డిటాంబుల్ మోడల్ B రోడ్‌స్టర్ (1909 మోడల్) అనే నాలుగు లిమోసిన్‌లు ఉన్నాయి. అతని వద్ద హార్లే డేవిడ్‌సన్ పోలీస్ టూరింగ్ బైక్ కూడా ఉంది (2001 వెర్షన్), గుర్రపు బండి కూడా ఉంది. 

మైఖేల్ జాక్సన్  రెండుసార్లు వివాహం చేసుకున్నాడు, కానీ రెండూ విడాకులకు దారితీశాయి. మైఖేల్ జాక్సన్ 1982లో ఒక ఆల్బమ్‌కు కవర్‌గా పులి పిల్లతో పోజులిచ్చాడు.

పాప్ లెజెండ్ మైఖేల్ జాక్సన్ కి ఖరీదైన కార్లు కూడా ఉన్నాయి.  పికప్ ట్రక్కుల నుండి మొత్తం 75 రకాల వాహనాలు జాక్సన్ పేరు మీద రిజిస్టర్ చేయబడ్డాయి. అతని లగ్జరీ కార్ల సేకరణలో అత్యంత ఖరీదైన కారు 1999  రోల్స్ రాయిస్ సిల్వర్ సెరాఫ్, దీని లోపలి భాగాలను సూపర్‌స్టార్ స్వయంగా రూపొందించారు.  1990 నాటి రోల్స్ రాయిస్ సిల్వర్ స్పర్ II మరొక విలాసవంతమైన కార్. ఈ కారు సీట్లు బ్లాక్ ఫాబ్రిక్ అండ్ వైట్ లెదర్ అప్హోల్స్టరీ ఉన్నాయి. ప్రపంచంలోని అత్యంత ఖరీదైన ఆల్కహాలిక్ డ్రింక్స్‌తో కూడిన కస్టమైజ్డ్ బార్ కూడా ఇందులో ఉంది.

జాక్సన్ ఆధీనంలో ఉన్న నాల్గవ లైమో 1954 కాడిలాక్ ఫ్లీట్‌వుడ్, దీనిని అకాడమీ అవార్డు హాలీవుడ్ సినిమా"డ్రైవింగ్ మిస్ డైసీ" షూటింగ్ సమయంలో  ప్రాపర్టీగా ఉపయోగించారు. జాక్సన్ కార్ల అభిరుచి కేవలం లిమోసిన్‌లకే పరిమితం కాకుండా వ్యాన్‌ల వరకు విస్తరించింది. 1993 ఫోర్డ్ ఎకనొలిన్ వ్యాన్ విస్తృతంగా మోడిఫైడ్ చేయబడింది.  దీనిలో వీడియో గేమ్ ప్లేయర్, ప్యాసెంజర్ సీట్ల ముందు  పర్సనల్ టీవీ స్క్రీన్‌లు, హై ఎండ్ సీట్ లెదర్ అప్హోల్స్టరీ వంటి ఎన్నో లగ్జరీ ఫీచర్లు లోపల అమర్చబడ్డాయి.
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios