Maruti-Toyota:క్రెటాకు పోటీగా మారుతి-టయోటా కొత్త ఎస్‌యూ‌వి.. ఆగస్టు నుండి ఉత్పత్తి..

మారుతి సుజుకి కొత్త SUV కూడా వచ్చే నెలలో ప్రపంచవ్యాప్తంగా లాంచ్ కానుంది. ఒక ప్రకటనలో టొయోటా-సుజుకి కొత్త SUV  ఉత్పత్తిని ఆగష్టు 2022లో కర్ణాటకలోని బిడాడిలోని టయోటా  ఉత్పత్తి కేంద్రంలో ప్రారంభించనున్నట్లు తెలిపింది.

Maruti Toyota is bringing together a new SUV, production will start from August

మారుతీ సుజుకి (maruti suzuki), టయోటా కిర్లోస్కర్ మోటార్ (toyota kirloskar motor) ఒక కొత్త  ఎస్‌యూ‌వి మోడల్‌పై కలిసి పనిచేసేందుకు  ప్రణాళికలను అధికారికంగా ప్రకటించాయి. ఈ కార్  తయారీ TKM ప్లాంట్‌లో ఆగస్టు నుంచి ప్రారంభం కానుంది. ఈ రెండు బ్రాండ్‌ల నుండి మిడ్-సైజ్ SUV లాంచ్ గురించి ఊహాగానాలు ఉన్నప్పటికీ టయోటా జూలై 1న అధికారికంగా ప్రదర్శించనుంది. 

మారుతి సుజుకి కొత్త SUV కూడా వచ్చే నెలలో ప్రపంచవ్యాప్తంగా లాంచ్ కానుంది. ఒక ప్రకటనలో టొయోటా-సుజుకి కొత్త SUV  ఉత్పత్తిని ఆగష్టు 2022లో కర్ణాటకలోని బిడాడిలోని టయోటా  ఉత్పత్తి కేంద్రంలో ప్రారంభించనున్నట్లు తెలిపింది. దీనిపై  ప్రత్యేకంగా తెలపనప్పటికి ఈ SUV మిడ్-సైజ్ విభాగంలో రానుంది, ఈ కారు ప్రస్తుతం హ్యుందాయ్ క్రెటా, కియా సెల్టోస్, టాటా హారియర్ ఇతర కార్లకు పోటీగా వస్తుంది.

కొత్త SUV మోడల్‌ను సుజుకి అభివృద్ధి చేసిందని అధికారిక ప్రకటనలో తెలిపింది. మారుతీ సుజుకి ఇండియా లిమిటెడ్ అండ్ TKM  ఇండియాలో ఈ SUVని  సుజుకి అండ్ టయోటా  కొత్త మోడల్‌గా విక్రయించనున్నాయి. అంతేకాకుండా సంస్థ కొత్త మోడల్‌ను ఆఫ్రికాతో సహా  బయటి మార్కెట్‌లకు కూడా ఎగుమతి చేయాలని  యోచిస్తోంది. ఒక నివేదిక ప్రకారం, టయోటా  ఈ మిడ్-సైజ్ SUV పేరు అర్బన్ క్రూయిజర్ హైరైడర్ గా సూచించింది.   

హైబ్రిడ్ ఇంజన్
ఈ కొత్త SUVని మైల్డ్ హైబ్రిడ్ అండ్ స్ట్రాంగ్ హైబ్రిడ్ ఇంజన్‌లతో అందించనుంది. సుజుకి అభివృద్ధి చేసిన మైల్డ్ హైబ్రిడ్ యూనిట్ మైల్డ్ హైబ్రిడ్ సిస్టమ్‌తో 1.5-లీటర్ K15C DualJet పెట్రోల్ ఇంజన్‌గా ఉంటుంది. ఈ ఇంజన్ ప్రస్తుతం Brezza, XL6, Ertiga ఇంకా Ciazలలో ఉపయోగించారు. ఈ ఇంజన్ 103 బిహెచ్‌పి పవర్, 137 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. గేర్ ట్రాన్స్‌మిషన్ ఆప్షన్స్ లో 6-స్పీడ్ మాన్యువల్ అండ్ 6-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ ఉంటాయి.

టయోటా  స్ట్రాంగ్ హైబ్రిడ్ యూనిట్ 1.5-లీటర్ పెట్రోల్ ఇంజన్ అండ్ ఎలక్ట్రిక్ మోటారుతో వస్తుంది. ఈ ఇంజన్ సుమారు 116 PS శక్తిని ఉత్పత్తి  చేస్తుంది ఇంకా e-CVT యూనిట్‌తో తీసుకొస్తున్నారు. మైల్డ్ హైబ్రిడ్ సిస్టమ్ FWD ఇంకా AWD సిస్టమ్‌లతో వస్తుంది, అయితే స్ట్రాంగ్ హైబ్రిడ్ యూనిట్ సెల్ఫ్ ఛార్జింగ్ ఇంకా FWD (ఫ్రంట్-వీల్ డ్రైవ్) సిస్టమ్‌తో వస్తుంది. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios