ప్యాసింజర్ వెహికల్స్‌లో ది బెస్ట్ ‘మారుతి స్విఫ్ట్‌’

ఆటోమొబైల్ విక్రయాలు పతనమైనా.. ఇప్పటి వరకు జరిగిన విక్రయాల్లో మారుతి సుజుకి ఇండియాదే పై చేయి కావడం గమనార్హం. ఈ సంస్థ మోడల్స్ ఆరు కార్లు టాప్ 10లో నిలిచాయి. స్విఫ్ట్ మోడల్ కారు టాప్ వన్‌గా నిలిచింది. 
 

Maruti Swift tops best-selling PV model list in November

నవంబర్ నెలలో ఎక్కువగా అమ్ముడైన ప్యాసింజర్‌ వాహనాల్లో మారుతి సుజు హాచ్‌బ్యాక్‌ స్విఫ్ట్‌ అగ్రస్థానంలో నిలిచింది. నవంబర్ నెలలో వాహనాల విక్రయాల్లో తీరు తెన్నులు విశేషాల డేటాను సొసైటీ ఆఫ్‌ ఇండియన్ ఆటోమొబైల్‌ మ్యానుఫాక్చరర్స్‌ (సియామ్‌) విడుదల చేసింది.

ప్రయాణ వాహనాల్లో మరోసారి మారుతి సుజుకీ వాహనాలు ఆధిక్యం ప్రదర్శించాయి. ఎక్కువగా అమ్ముడైన వాహనాల్లో టాప్‌ 6 మారుతివే కావడం విశేషం. దక్షిణ కొరియా ఆటోమొబైల్ మేజర్ హ్యుండాయ్ ఆధ్వర్యంలోని సాంత్రో మోడల్ మళ్లీ టాప్ జాబితాలో వచ్చి చేరింది.

22,191 యూనిట్ల విక్రయాలతో స్విఫ్ట్‌ ఈ జాబితాలో తొలిస్థానంలో ఉంది. ఇక మారుతి కాంపాక్ట్‌ సెడాన్‌ డిజైర్‌ 21,037 యూనిట్ల విక్రయాలతో రెండో స్థానంలో నిలిచింది. ఇదే కంపెనీకి చెందిన ప్రీమియం హాచ్‌బ్యాక్‌ బాలెనో 18,649 యూనిట్ల విక్రయాలతో మూడో స్థానంలో ఉంది. 

ఇక గత నెలలో అగ్రస్థానంలో ఉన్న ఎంట్రీలెవల్‌ మారుతి ఆల్టో ఈసారి నాలుగో స్థానానికి పడిపోయింది. నవంబర్‌లో 14,378 యూనిట్ల ఆల్టో వాహనాలు అమ్ముడయ్యాయి. మారుతి విటారా బ్రెజా 14.378 కార్ల విక్రయంతో ఐదో స్థానంలో,  వాగన్ ఆర్ 11,311 యూనిట్ల విక్రయంతో  ఆరో స్థానంలో నిలిచాయి. గతేడాది వాగన్ ఆర్ మోడల్ కారు 14,038 యూనిట్లను విక్రయించింది. 

ఇక హ్యుండాయ్‌కు చెందిన ప్రీమియం హాచ్‌బ్యాక్‌ ఎలైట్‌ ఐ20 10,555 విక్రయాలతో ఏడో స్థానం దక్కించుకుంది. ఇదే కంపెనీకి చెందిన ఎస్‌యూవీ క్రెటా 9,677 యూనిట్ల విక్రయాలతో ఎనిమిదో స్థానంలో ఉంది.

హ్యుందాయ్‌ గ్రాండ్‌ ఐ 10 తొమ్మిది, శాంత్రో పదో స్థానంలో ఉన్నాయి. ఎక్కువగా అమ్ముడైన ప్యాసింజర్‌ వాహనాల జాబితాలో శాంత్రో మళ్లీ చోటు దక్కించుకుంది. 2014 డిసెంబర్లో శాంత్రో విక్రయాలు నిలిపివేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత నాలుగేళ్లకు ఈ ఏడాది అక్టోబరులో తిరిగి ఈ మోడల్‌ను విడుదల చేసింది హ్యుండాయ్‌. హుండాయ్ శాంత్రో కారు 9,009 యూనిట్లు అమ్ముడు పోయింది. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios