Maruti Suzuki's first electric car: మారుతి నుంచి ఎలక్ట్రిక్ కారు వచ్చేస్తోంది, ధర, ఫీచర్లు ఇవే..
దేశంలోనే అతి పెద్ద కార్ల కంపెనీ అయినటువంటి మారుతి సుజుకి నుంచి త్వరలోనే ఎలక్ట్రిక్ కారు రాబోతోంది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన ఇంకా ఏమి వెలువడనప్పటికీ, ప్రస్తుతం ప్రోటోటైప్ తయారీలో సంస్థ ఉన్నట్లు తెలుస్తోంది. ఒక వేళ ఎలక్ట్రిక్ కారు కనుక మార్కెట్లోకి వస్తే, ఈవీ మార్కెట్లో పోటీ నెలకొనడడం ఖాయంగా కనిపిస్తోంది.
పర్యావరణ పరిరక్షణ కోసం ఈ మధ్య కాలంలో కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాల ప్రోత్సాహంతో ఎలక్ట్రిక్ వాహనాల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. ముఖ్యంగా మార్కెట్లో చాలా ఆటోమొబైల్ కంపెనీలు ఎలక్ట్రిక్ కార్ల తయారీలో పడ్డాయి. ఇప్పటికే ఈ విభాగంలో టాటా మోటార్స్ కాస్త పై చేయి సాధిస్తోంది. ఇప్పటికే టాటా మోటార్స్ కు చెందిన ఈవీ కార్లు రోడ్లపై సందడి చేస్తున్నాయి. ఇప్పుడు అదే బాటలో మారుతి సుజుకి కూడా పయనిస్తోంది.
భారతదేశపు అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతీ సుజుకీ మరి కొద్ది సంవత్సరాల్లో ఎలక్ట్రిక్ కార్ల విభాగంలో సందడి చేయనుంది. కంపెనీ యొక్క మొదటి EV SUV కారును తయారు చేసే పనిలో పడింది. ఇది టయోటా, సుజుకి జాయింట్ వెంచర్ క్రింద తయారు చేయబడుతుంది. గతంలో ఈ జాయింట్ వెంచర్ కింద కంపెనీ పలు మోడళ్లను మార్కెట్లోకి విడుదల చేసింది.
మారుతి ఎలక్ట్రిక్ కారు పేరు ఏమిటి?
ఇది మారుతి మొదటి జీరో-ఎమిషన్ కారు , ఈ ప్రాజెక్ట్ కంపెనీ గ్రీన్ సిగ్నల్ పొందింది. ఈ ఎలక్ట్రిక్ కారు ఉత్పత్తి పేరు ఇంకా సమాచారం వెల్లడించలేదు. ఈ కారు ప్రస్తుతం YY8 అనే సంకేతనామంతో ఉంది.
అద్భుతమైన SUV బాడీ స్టైలింగ్
ఈ కారు SUV బాడీ స్టైలింగ్‌తో రాబోతోంది, ఇది వాల్యూమ్ ఆధారిత కస్టమర్‌లను లక్ష్యంగా చేసుకుని రూపొందించబడింది. భారతదేశంలో, ఈ కారు టాటా పంచ్ ఎలక్ట్రిక్ వెర్షన్‌తో పోటీపడుతుంది, మారుతి సుజుకి దేశంలోనే అతిపెద్ద కార్ల తయారీ సంస్థ అయినప్పటికీ, కంపెనీ ఇంకా ఎలక్ట్రిక్ సెగ్మెంట్‌లో ఏ ఉత్పత్తిని ప్రారంభించలేదు.
అదే సమయంలో, టాటా నెక్సాన్ EV ఆధారంగా భారతీయ కంపెనీ టాటా ఈ విభాగంలో తన పట్టును బలోపేతం చేసింది. అయినప్పటికీ, సుజుకి తన ప్రసిద్ధ హ్యాచ్‌బ్యాక్ మారుతి సుజుకి వాగాన్ ఆర్ ఎలక్ట్రిక్ వెర్షన్‌ను పరీక్షించడం ప్రారంభించింది ఈ కారు గురించి చాలా కాలంగా వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.
ఎప్పుడు లాంచ్ అవుతుంది?
ఈ కారు లాంచ్‌కు సంబంధించి ఎటువంటి నిర్ణీత తేదీని ప్రకటించలేదు కానీ 2024లో పండుగ సీజన్‌లో దీనిని విడుదల చేయవచ్చని భావిస్తున్నారు. ఈ కారు పేరు, ధర గురించి ఇంకా ఎటువంటి సమాచారం వెల్లడి కాలేదు, అయితే కంపెనీ ఈ సెగ్మెంట్‌లో తన స్థానాన్ని సంపాదించుకోవడానికి. మరింత ఎక్కువ మంది కస్టమర్‌లను ఆకర్షించడానికి దాని ధరను తక్కువగా నిర్ణయించవచ్చు.