భారీ ప్లాంట్‌ మూసివేతకు మారుతి సుజుకి నిర్ణయం...

ప్రస్తుతం మారుతున్న సాంకేతిక పరిజ్ఞానం...మార్కెట్ అవసరాలను  దృష్టిలో పెట్టుకుని ప్రముఖ  వాహన తయారీ సంస్థ మారుతీ సుజుకీ ఇండియా లిమిటెడ్ సంచలన నిర్ణయం తీసుకుంది. డిల్లీ సమీపంలోని గుర్‌గ్రావ్ లోని తమ సంస్ధకు చెందిన భారీ డీజిల్ ఇంజన్ తయారీ అసెంబుల్ యూనిట్ ను శాశ్వతంగా మూసివేయనున్నట్లు ప్రకటించింది.  భవిష్యత్ లో మార్కెట్లో చోటుచేసుకునే పరిణామాలు, నూతన నిబంధనల కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు మారుతీ సుజుకి సంస్థ తెలిపింది.  
 
maruti suzuki india decided to close diesel engine plant at gurgarv

ప్రస్తుతం మారుతున్న సాంకేతిక పరిజ్ఞానం...మార్కెట్ అవసరాలను  దృష్టిలో పెట్టుకుని ప్రముఖ  వాహన తయారీ సంస్థ మారుతీ సుజుకీ ఇండియా లిమిటెడ్ సంచలన నిర్ణయం తీసుకుంది. డిల్లీ సమీపంలోని గుర్‌గ్రావ్ లోని తమ సంస్ధకు చెందిన భారీ డీజిల్ ఇంజన్ తయారీ అసెంబుల్ యూనిట్ ను శాశ్వతంగా మూసివేయనున్నట్లు ప్రకటించింది.  భవిష్యత్ లో మార్కెట్లో చోటుచేసుకునే పరిణామాలు, నూతన నిబంధనల కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు మారుతీ సుజుకి సంస్థ తెలిపింది.  

ప్రస్తుతం డిజిల్ కార్ల కొనుగోలుకు వాహనదారులు ఆసక్తి చూపించడం లేదని మారుతి సుజుకి ప్రతినిధులు తెలిపారు.  పెట్రోల్ కార్లను కొనుగోలు వైపే ఎక్కువ మంది వినియోగుదారులు మొగ్గు చూపుతున్నారు. అంతే కాకుండా భవిష్యత్ లో ఎలక్ట్రికల్, సీఎన్‌జి కార్లకు డిమాండ్ పెరిగే అవకాశం ఉంది. అందువల్ల డిజిల్ ఇంజన్ కార్ల
అమ్మకాలు మరింత తగ్గే అవకాశం ఉందని ముందే ఊహించి మారుతి సుజుకి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. 

అంతే కాకుండా 2020 ఏప్రిల్ 1వ తేదీ నుండి దేశవ్యాప్తంగా స్టేజ్-6 ఉద్గారాలకు సంబంధించిన నిబంధనలు రాబోతున్నాయి. దీంతో డిజిల్ కార్ల డిమాండ్ మరింత తగ్గే అవకాశం ఉంది. ఇలా వివిధ కారణాల వల్ల ఏడాదికి  1.70 లక్షల డీజిల్ ఇంజిన్లను అసెంబుల్ చేసే సామర్థ్యం ఉన్న భారీ యూనిట్ ను మూసివేయాల్సి వస్తున్నట్లు మారుతి సుజుకి ఇండియా వెల్లడించింది. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios