Maruti Suzuki Discount: మారుతీ కార్లపై డిస్కౌంట్లు.. ఇప్పుడే కొనేయండి..!

Maruti Suzuki: కారు కొనాలని ప్లాన్ చేస్తున్నారా..! అయితే మే నెలలో మారుతి సుజుకి తన కార్లపై గరిష్టంగా రూ.31 వేల వరకూ డిస్కౌంట్స్ అందుబాటులో ఉంచింది. డిస్కౌంట్ అందుబాటులో ఉన్న కార్లలో  WagonR, Celerio, Swift, త‌దిత‌ర‌ మోడల్స్ ఉన్నాయి. ఏ మోడల్ పై ఎంత డిస్కౌంట్ అందుబాటులో ఉందో చెక్ చేయండి.
 

Maruti Suzuki Cars Discount Offers in May 2022

మారుతీ సుజుకి తన కార్లపై, ఎస్‌యూవీలపై ఆకర్షణీయమైన డిస్కౌంట్లను ఆఫర్ చేస్తోంది. వాగన్ ఆర్, ఎస్-ప్రెస్సో, స్విఫ్ట్, డిజైర్, విటారా బ్రెజా వంటి పలు మోడల్స్‌పై ఈ డిస్కౌంట్లు అందుబాటులో ఉన్నాయి. ఈ ఆఫర్లలో భాగంగా క్యాష్ డిస్కౌంట్లతో పాటు ఎక్స్చేంజ్ బోనస్‌లు, కార్పొరేట్ డిస్కౌంట్లు అందుబాటులో ఉన్నాయి. అయితే ఈ డిస్కౌంట్ ఆఫర్లు కేవలం ఈ నెలలో మాత్రమే.

సెలెరియో.. గత కొన్ని నెలల క్రితమే సరికొత్త సెలెరియోను కంపెనీ లాంచ్ చేసింది. అయినప్పటికీ ఈ కారుపై ఏఎంటీతో పాటు అన్ని వేరియంట్లపై రూ.26 వేల వరకు డిస్కౌంట్లను కంపెనీ ఆఫర్ చేస్తుంది. ప్రస్తుతం దేశంలో అత్యధిక మైలేజ్ ఇస్తోన్న కారుగా ఇది ఉంది.

ఎస్-ప్రెస్సో కారు అత్యంత చౌకైన, ఫ్యూయల్ సమర్థవంతమైన హ్యాచ్‌బ్యాక్. ఇది 1.0 లీటరు పెట్రోల్ ఇంజిన్‌తో మార్కెట్లోకి వచ్చింది. మాన్యువల్, ఏఎంటీ గేర్‌బాక్స్ ‌లో ఈ కారు అందుబాటులో ఉంది. తక్కువ ధరలో మెరుగైన ఫీచర్లు ఈ కారులో ఉన్నాయి. ఎస్-ప్రెస్సో కొనుగోలుదారులు మాన్యువల్, ఏఎంటీ వేరియంట్లపై రూ.31 వేల వరకు ప్రయోజనాలను పొందవచ్చు.

విటారా బ్రెజా కారుపై మారుతీ రూ.22 వేల డిస్కౌంట్ ఇస్తుంది. ఇది ఫ్యూయల్ సమర్థవంతమైన కంపాక్ట్ ఎస్‌యూవీ. త్వరలోనే దీని అప్‌డేటెడ్ మోడల్‌ను మారుతీ తీసుకురాబోతుంది. 1.5 లీటరు పెట్రోల్ ఇంజిన్‌తో అందుబాటులో ఉన్న ఈ కారు మాన్యువల్, ఏఎంటీ గేర్‌బాక్స్‌లను కలిగి ఉంది. అంతేకాక ప్రస్తుత మోడల్‌ను ఆపివేయనుంది.

స్విఫ్ట్.. ఇండియాలో అత్యంత ఇష్టమైన హ్యాచ్‌బ్యాక్‌లలో ఇది ఒకటి. ఈ కారుపై మొత్తంగా రూ.25 వేల వరకు డిస్కౌంట్ అందుబాటులో ఉంది. హ్యుండాయ్ గ్రాండ్ ఐ10 నియోస్‌కి, టాటా టియాగోకి ఈ కారు గట్టి పోటీ ఇస్తుంది. స్పోర్టీ లుక్‌లో స్విఫ్ట్ ఉంది. 1.2 లీటరు డ్యూయల్ జెట్ పెట్రోల్ ఇంజిన్‌తో ఇది మార్కెట్లోకి వచ్చింది.

డిజైర్‌పై మారుతీ కంపెనీ రూ.22 వేల డిస్కౌంట్‌ను ఆఫర్ చేస్తుంది. స్విఫ్ట్ మాదిరిగానే డిజైర్ కూడా 1.2 లీటరు డ్యూయల్‌జెట్ పెట్రోల్ ఇంజిన్‌తో మార్కెట్లోకి వచ్చింది. ఇది కంపాక్ట్ సెడాన్ కారు. దీనికి సౌకర్యవంతమైన, ఎక్కువ స్పేస్‌తో క్యాబిన్ ఉంటుంది. మారుతీ బెస్ట్ సెల్లింగ్ మోడల్స్‌లో డిజైర్ ఒకటి.

హ్యుండాయ్ శాంట్రో, టాటా టియాగో కార్లకు గట్టి పోటీగా నిలుస్తోన్న మారుతీ వాగన్ ఆర్‌పై రూ.31 వేల డిస్కౌంట్‌ను అందిస్తోంది కంపెనీ. ఈ కారు 1.0 లీటరు, 1.2 లీటరు పెట్రోల్ ఇంజిన్ ఆప్షన్లలో అందుబాటులో ఉంది. 1.0 లీటరు వేరియంట్‌పై రూ.31 వేల వరకు, 1.2 లీటరు వేరియంట్‌పై రూ.21 వేల వరకు ప్రయోజనాలు అందుబాటులో ఉన్నాయి.

 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios