Asianet News TeluguAsianet News Telugu

మహీంద్రా వేసిన స్కెచ్.. షాక్ లో కార్ కంపెనీలు - ఆ లిస్ట్ విన్న వెంటనే..!!

మహీంద్రా నుండి వచ్చిన నివేదికల ప్రకారం, కంపనీ రాబోయే లైనప్ నుండి విడుదల చేయబోయే మొదటి ఎలక్ట్రిక్ SUV XUV.e8. దీనిని డిసెంబర్ 2024లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. రాబోయే మహీంద్రా XUV.e8 మోడల్‌లో ప్రత్యేకంగా బ్యాక్  వీల్ డ్రైవ్ ఉంటుంది. 
 

Mahindras sketch.. Car companies in shock - immediately after hearing the list..!!-sak
Author
First Published Aug 22, 2023, 1:37 PM IST

గత వారం ఆగస్ట్ 15 2023న దక్షిణాఫ్రికాలోని కేప్ టౌన్‌లో జరిగిన ఫ్యూచర్‌స్కేప్ ఈవెంట్‌లో మహీంద్రా ఫ్యూచర్  ప్లాన్ ని ఆవిష్కరించింది. ఈ ఈవెంట్ సందర్భంగా కంపెనీ అప్ కమింగ్  కార్ మోడళ్లను వెల్లడించడమే కాకుండా వాటి లాంచ్ షెడ్యూల్‌ల వివరాలను కూడా ఇచ్చింది. వీటిలో XUV.e8, XUV.e9, BE.05 ఇంకా BE.07 ఎలక్ట్రిక్ SUVలు ఉన్నాయి. అంతేకాకూండా మహీంద్రా ఆటోమోటివ్ BE.05 ఎలక్ట్రిక్ SUV  స్నీక్ పీక్‌ను అందించింది.

మహీంద్రా నుండి వచ్చిన నివేదికల ప్రకారం, కంపనీ రాబోయే లైనప్ నుండి విడుదల చేయబోయే మొదటి ఎలక్ట్రిక్ SUV XUV.e8. దీనిని డిసెంబర్ 2024లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. రాబోయే మహీంద్రా XUV.e8 మోడల్‌లో ప్రత్యేకంగా బ్యాక్  వీల్ డ్రైవ్ ఉంటుంది. 

ఈ ఎలక్ట్రిక్ మోటారు 170 kW (228 bhp) పవర్, 380 Nm  పీక్ టార్క్‌ను ఉత్పత్తి చేయగలదు. మహీంద్రా XUV.e8 XUV700  ఎలక్ట్రిక్ వేరియంట్‌గా పనిచేస్తుంది. ఇది కొత్తగా రూపొందించిన INGLO స్కేట్‌బోర్డ్ ప్లాట్‌ఫారమ్‌పై నిర్మించబడుతుంది, దీనిని  మహీంద్రా ఎలక్ట్రిక్ వెహికల్ లైనప్ కోసం ప్రత్యేకంగా రూపొందించబడింది.

మహీంద్రా XUV.e9 ఏప్రిల్ 2025 నాటికి అందుబాటులోకి వస్తుంది. XUV.e8 ఏడు-సీట్ల  కాకుండా  XUV.e9 ఐదు-సీట్ల కాన్ఫిగరేషన్‌తో రావొచ్చని భావిస్తున్నారు. XUV మోడల్‌లు రెండూ ఒకే విధమైన పవర్‌ట్రెయిన్ అండ్  బ్యాటరీ అప్షన్స్ అందిస్తాయని భావిస్తున్నారు.

XUV.e8 అండ్ XUV.e9 తరువాత, మహీంద్రా దృష్టి రాబోయే ప్రీమియం ఎలక్ట్రిక్ SUV లైనప్‌పైకి మారుతుంది. దీనిని "బోర్న్ ఎలక్ట్రిక్" సిరీస్ అని పిలుస్తారు. ప్రారంభ ఆఫర్ BE.05 అక్టోబర్ 2025లో విడుదల చేయడానికి షెడ్యూల్ చేయబడింది. దీనిలో శక్తివంతమైన 210 kW (282 bhp) ఎలక్ట్రిక్ మోటారు ఉంది ఇంకా 535 Nm పీక్  టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఫోర్-వీల్ డ్రైవ్ వెర్షన్‌ల కోసం, ఫ్రంట్ యాక్సిల్‌పై అమర్చిన అదనపు మోటార్ 80 kW (107 bhp), 135 Nm గరిష్ట టార్క్‌ను అందిస్తుంది. 

ఈ మోడల్ ప్రస్తుతం అభివృద్ధిలో ఉంది. BE.05 తర్వాత, మహీంద్రా BE.07 ఎలక్ట్రిక్ SUVని విడుదల చేస్తుంది. BE.05తో పోలిస్తే ఇది మరింత విలాసవంతమైన అనుభవాన్ని అందిస్తుందని భావిస్తున్నారు. ఇది అదే పవర్‌ట్రెయిన్ అప్షన్స్ తో ఇంకా  ఏప్రిల్ 2026లో ప్రారంభించబడుతుందని భావిస్తున్నారు. BE.07 అక్టోబర్ 2026 లాంచ్  తేదీతో సంవత్సరం ప్రారంభంలో ప్రకటించబడింది.

మహీంద్రా   రాబోయే ఎలక్ట్రిక్ SUVలలో LP బ్యాటరీ ప్యాక్‌  ఉంటుందని అధికారికంగా ప్రకటించింది. ఈ బ్యాటరీలు కేవలం 30 నిమిషాల్లో 80% ఛార్జింగ్‌కు చేరుకుంటాయని భావిస్తున్నారు. ఆశ్చర్యకరంగా, మహీంద్రా   రాబోయే e-SUVలు ఆగ్మెంటెడ్ రియాలిటీ, లెవెల్ 2 ADAS, ఓవర్-ది-ఎయిర్ అప్‌డేట్‌లు ఇంకా మరిన్నింటితో సహా అధునాతన టెక్నాలజీ  ప్రముఖంగా  ఉంటాయి.

Follow Us:
Download App:
  • android
  • ios