మహీంద్రా బొలెరో కొత్త లోగో.. లేటెస్ట్ మోడల్‌లో ఎలాంటి అప్‌డేట్ ఫీచర్స్ ఉన్నాయో తెలుసా?

కంపెనీ కొత్త లోగోని అత్యధికంగా అమ్ముడవుతున్న  స్పోర్ట్స్ యుటిలిటీ వాహనం బొలెరోకి అప్ డేట్ చేసింది. బొలెరో ఫీచర్లపై అధికారిక సమాచారాన్ని కంపెనీ ఇంకా వెల్లడించలేదు. అయితే, కొన్ని మీడియా నివేదికలు దాని ఫీచర్స్ గురించి వెల్లడించాయి. 

mahindra Bolero will come with new logo know what other updates in new model?

దేశీయ వాహన తయారీ సంస్థ మహీంద్రా  అండ్ మహీంద్రా  కంపెనీ పాపులర్ ఎస్‌యూ‌వి బొలెరోకి కొత్త  లోగోని అందించింది. ఈ కొత్త లోగోని మొదట XUV-700లో, ఆ తర్వాత స్కార్పియో-N, స్కార్పియో క్లాసిక్‌లో కనిపించింది. ఈ ఎస్‌యూ‌విల తర్వాత ఇప్పుడు కంపెనీ కొత్త లోగోని అత్యధికంగా అమ్ముడవుతున్న  స్పోర్ట్స్ యుటిలిటీ వాహనం బొలెరోకి అప్ డేట్ చేసింది. బొలెరో ఫీచర్లపై అధికారిక సమాచారాన్ని కంపెనీ ఇంకా వెల్లడించలేదు. అయితే, కొన్ని మీడియా నివేదికలు దాని ఫీచర్స్ గురించి వెల్లడించాయి. ఈసారి బొలెరోలో కొత్తగా ఏముందో తెలుసా...

డిజైన్ గురించి చెప్పాలంటే 
 ఈ ఎస్‌యూ‌వి ఫ్రంట్ గ్రిల్‌లో ఎటువంటి మార్పు లేకుండా కొత్త లోగోను ఇన్‌స్టాల్ చేశారు. దీంతో బొలెరో చాలా ఆకర్షణీయంగా కొత్తగా కనిపిస్తుంది. SUV ముందు, వెనుక ఇంకా స్టీరింగ్‌పై  కొత్త లోగో ఇచ్చారు. కంపెనీ ఇప్పుడు ప్యాసింజర్ వాహనాలను కొత్త లోగోతో పరిచయం చేస్తోంది, అయితే పాత లోగోను వాణిజ్య వాహనాలకు వర్తింపజేయనుంది. 

ఈ ఫీచర్లు బొలెరోతో వస్తున్నాయి
ఇప్పటివరకు ఉన్న సమాచారం ప్రకారం, నాలుగు పవర్ విండోస్, నాలుగు స్పీకర్లతో 2-డిన్ మ్యూజిక్ సిస్టమ్, మాన్యువల్ డిమ్మింగ్ IRVM, బ్యాక్ వాషర్‌తో వైపర్, MIDతో డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ వంటి ఫీచర్లను పొందుతుంది. వీటితో పాటు ABS, EBD అండ్ డ్యూయల్ ఎయిర్‌బ్యాగ్‌లతో సేఫ్టీ కూడా అందించారు. Bolero 2022 హెడ్‌లైట్ గురించి మాట్లాడితే  బ్లాక్ హాలోజన్ లోపల ఇన్‌స్టాల్ చేయబడింది. DRLలతో పాటు టర్న్ ఇండికేటర్లను కూడా పొందుతుంది. అయితే  ఫాగ్ ల్యాంప్స్  ఉండవు. SUV సైడ్ ప్రొఫైల్‌లో ఎటువంటి మార్పు లేదు.  కానీ మెటల్ బంపర్ ఇచ్చారు,  అంటే సిటీ ట్రాఫిక్ పరిస్థితుల్లో బంపర్ కి పగుళ్లు ఏర్పడదు. 

ఇంజిన్ 
బొలెరో 2022లో 1.5 లీటర్ 3-సిలిండర్ టర్బో ఛార్జ్డ్ M-హాక్ 75 ఇంజన్‌ని కంపెనీ అందించింది. ఈ ఇంజన్‌తో బొలెరో మైక్రో హైబ్రిడ్ టెక్నాలజీని పొందుతుంది. SUV M-Hawk75 ఇంజిన్ 75 bhp, 210 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. కారులో 5 స్పీడ్ గేర్‌బాక్స్ ఇచ్చారు.

ధర ఎంత?
కొత్త బొలెరో B4, B6 అండ్ B6 (ఆప్షనల్ ) ట్రిమ్‌లలో వస్తుంది. ఎక్స్-షోరూమ్ ధర గురించి చెప్పాలంటే B4 ధర సుమారు రూ. 9.31 లక్షలు, B6 ధర 9.99 లక్షలు అలాగే B6 (ఆప్షనల్ ) ధర సుమారు రూ. 10.24 లక్షలు ఉండవచ్చు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios